ఏజెంట్ రిలీజ్ కు అడ్డంకి ఏంటి?
2022 పై హోప్స్ వదిలేసుకున్నట్లేనా?
గత ఏడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ తో హిట్ కొట్టాడు అఖిల్.
హ్యాట్రిక్ ఫ్లాప్స్ తర్వాత వచ్చిన విజయం తర్వాత అఖిల్ దృష్టి ప్యాన్ ఇండియా మార్కెట్ పై పడింది.
సురేందర్ రెడ్డి మేకింగ్ ఏజెంట్ మూవీ స్టార్ట్ చేసాడు.
మాలీవుడ్ మెగా స్టార్ మమ్ముట్టి ఈ మూవీలో కీలకమైన పాత్రలో నటించాడు.
ఆగస్ట్ లోనే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది అర్ధం కాకుండా ఉంది.
ఏజెంట్ ఏకంగా సంక్రాంతికి వస్తాడని బాగా ప్రచారం సాగుతోంది.
అక్కినేని ఫ్యాన్స్ కూడా అఖిల్ ను సంక్రాంతికే రమ్మంటున్నారు.
అందుకు చాలా కారణాలు ఉన్నాయి.
ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి వచ్చి బంగార్రాజుతో బంగారం లాంటి హిట్ కొట్టారు నాగార్జున, నాగ చైతన్య.
ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి తెల్సిందే. నాగార్జున బాలీవుడ్ డెబ్యూట్ లాల్ సింగ్ చద్దా డిజాస్టర్ అయింది.
మరో మూవీ థ్యాంక్యూ ఎప్పుడు రిలీజైందో కూడా ఎవరికి తెలియదు. ఇక నాగార్జున కూడా దసరా వచ్చి డిజాస్టర్ చూశాడు.
ఇన్ని చూసిన అఖిల్ ఈ ఏడాది తన సినిమా విడుదల వద్దంటే వద్దు అంటున్నాడట.అందుకే నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి బరిలోకి దిగాలి అనుకుంటున్నాడట. చిరు, బాలయ్య ఇలా ఎంతమంది హీరోలు వచ్చినా, తన సినిమా పండగ సీజన్ లో కావాల్సినంత కిక్ ఇస్తుందని నమ్ముతున్నాడు సురేందర్ రెడ్డి.