వరదల వెనుక విదేశీ కుట్ర ఉందా…. కేసీఆర్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారా….

By KTV Telugu On 19 July, 2022
image

కేసీఆర్ పరోక్షంగా చంద్రబాబును ప్రశంసించారా.. తుమ్మలను భుజం తట్టడం వెనుక ఉద్దేశం ఏమిటి. చేసన పనులు చిరస్థాయిగా గుర్తుండిపోతాయన్నేందుకు భద్రాచలం అంశమే ఉదాహరణగా నిలుస్తుందా.. కేసీఆర్ కూడా రాజకీయ సమీకరణాలను బేరీజు వేసుకుని ఒక వర్గాన్ని మళ్లీ దగ్గరకు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారా?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో తెలంగాణ సీఎం పర్యటించారు. భద్రాచలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరకట్టల నిర్మాణాన్ని ప్రస్తావించారు. అప్పట్లో తుమ్మల నాగేశ్వరరావు చేసిన అభివృద్ధి, ఆయన కృషిని అభినందించారు. కరకట్ట నిర్మాణానికి తుమ్మల చూపిన అంకితభావాన్ని ప్రశంసించారు. నిజానికి అప్పటి సీఎం చంద్రబాబు చొరవతోనే కరకట్ట నిర్మాణం జరిగిందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే తుమ్మల మార్గంలో చంద్రబాబును ఆయన పొగిడారని కొందరు అంటున్నారు..

టీడీపీ అధినేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విజన్ ఉన్న నేతగా చెబుతారు. ముందు చూపే ఆయనకున్న బలమని అంటారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించి సాప్ఠ్ వేర్ కేంద్రంగా మార్చింది కూడా ఆయనే… ఇప్పుడు తెలంగాణను వరదలు అతలాకుతలం చేస్తున్న వేళ చంద్రబాబు ముందు చూపు…మరోసారి హాట్ టాపిక్ గా మారింది.. గోదావరి నది ఉగ్రరూపు దాల్చడంతో భద్రాచలం జలమయమైంది.  గోదావరి నీటిమట్టం 70 అడుగలుకు పైకి వచ్చి… 36 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టింది. మామూలుగా అయితే ఈ రికార్డు స్థాయి వరదకు భద్రాచలం పూర్తిగా మునిగిపోవాలి. అయితే.. అప్పట్లో చంద్రబాబు ముందు చూపే… ఇప్పుడు భద్రాద్రిని…. వరద ముప్పునుంచి బయట పడేసింది. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఎంతో ముందుచూపుతో భద్రాచలం పట్టణానికి వరద ముప్పు నివారించేందుకు కరకట్టను నిర్మించారు. 53కోట్లతో ఎటపాక నుంచి సుభాష్ నగర్‌ వరకు 10 కిలోమీటర్ల వరకు ఈ కరకట్టను నిర్మించారు. అదే ఇప్పుడు భద్రాద్రికి రక్షణ కవచంగా నిలిచింది. ఏకంగా 10 వేల కుటుంబాలు వరద ముంపునకు గురవకుండా కాపాడగలిగింది. ప్రస్తుతం కరకట్ట లేని ప్రాంతంతోపాటు కరకట్టలో ఉన్న స్లూయిస్‌లో లీకులతోనే దిగువ ప్రాంతం జలమయమైంది. ఈ కరకట్టే లేకపోతే భద్రాచలం మూడొంతులు జలమయం అయ్యేదంటున్నారు భద్రాద్రి కరకట్ట నిర్మాణంలో చంద్రబాబు చూపిన ముందుచూపే ఇప్పుడు అందరిని కాపాడిదంటూ  అందరూ ప్రశంసిస్తున్నారు…

నాడు చంద్రబాబు చేసిన అభివృద్ధి ఇప్పటికీ రాష్ట్రానికి ఉపయోగపడుతోంది. ఒక నాయకుడు చేసిన  పనులే చిరస్థాయిగా నిలిచిపోతాయని కేసీఆర్ కూడా గుర్తించినట్లున్నారు. మంచి చేసిన వారిని పొగడటంలో తప్పులేదని తెలంగాణ సీఎం భావించారు. పైగా రాజకీయ సమీకరణాలు, సామాజిక వర్గం లెక్కలు కూడా సరిచూస్తున్నారు…నిజానికి తుమ్మల నాగేశ్వరరావు … గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి ఖమ్మం జిల్లా పాలిటిక్స్ మారిపోాయాయి. మంత్రి పువ్వాల అజయ్ ఎప్పటికప్పుడు పైచేయిగా నిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు కొత్త నేతలు వచ్చి గులాబీ కండువా కప్పుకున్నారు..దానితో టీఆర్ఎస్ లో ముఠాతత్వం పెరిగింది. తుమ్మల అసంతృప్తిగా ఉన్నారని గుర్తించిన కేసీఆర్.. ఆయన్ను బుజ్జగించేందుకు కూడా కరకట్ట కట్టినది నువ్వేనని ప్రశంసించారనుకోవాలి. పైగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో పార్టీ బలహీనపడుతోందన్న అనుమానాలు నడుమ.. అన్ని గూపులను ఏకం చేసినట్లు కూడా అయ్యింది…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా.. కాంగ్రెస్‌తో చంద్రబాబు జతకట్టి ప్రచారం చేశారు.దానితో ఎన్నికల్లో గెలిచిన వెంటనే కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ప్రస్తావనచేశారు. చంద్రబాబును ఓడించి తీరుతానని శబథం పట్టారు. అందుకు తగ్గట్టుగానే ఏపీ ఎన్నికల్లో జగన్‌కు సపోర్ట్ చేసిన ఆయన.. బాబు ఓటమికి తన వంతు సహకరించారు. తర్వాత కూడా కొంతకాలం చంద్రబాబుపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మాత్రం కేసీఆర్ వైఖరి మారుతోందన్న విశ్వాసం కలుగుతోంది.. ఇటీవల రెండు మూడు సార్లు చంద్రబాబును తెలంగాణ ఐటీ మినిష్టర్ కేటీఆర్ తెగపొగిడేశారు. హైదరాబాద్ కు పెట్టుబడులను ఆహ్వానిచడంలో చంద్రబాబు కీలకపాత్ర పోషించారన్నారు. మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ కు రావడం వెనుక క్రెడిట్ మొత్తం చంద్రబాబుదేనన్నారు. బిల్ గేట్స్ ను పర్సనల్ గా కలుసుకుని మరీ తెలంగాణకు పెట్టుబడులు తెచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ఇలాంటి పరిణామాలు వాస్తవ పరిస్థితులకు దర్పణం పడతాయి. అధికారంలో ఉన్నప్పుడు దార్శనికతను ప్రదర్శించిన నేతల సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అయితే టీఆర్ఎస్ మరో వ్యూహం కూడా అమలు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రెడ్డి సామాజిక వర్గం పూర్తిగా దూరమవుతుందన్న అనుమానాలు కలుగుతున్న నేపథ్యంలో…. కమ్మ సామాజిక వర్గాన్ని దగ్గరకు చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా కొందరంటున్నారు…