బీజేపీ బలం టీఆర్ఎస్సే ! కేసీఆర్ పట్టించుకోవడం మానేస్తే ఏమవుతుంది ?

By KTV Telugu On 10 May, 2022
image

తెలంగాణ బీజేపీ ఎంత బలపడింది ? ఎంత బలపడిందో ఎవరికీ తెలియదు. దుబ్బాకలో రఘునందన్‌ను వరుసగా ఓడిపోతున్న సానుభూతితో గెలిపించారన్న విశ్లేషణలు వచ్చాయి. ఇక హూజూరాబాద్‌లో గెలుపు ఈటలదే కానీ బీజేపీది కాదు. అచ్చంగా బీజేపీ బలంపై గెలిచిన సీటంటూ ఏమీ లేదు. అయితే బీజేపీని టీఆర్ఎస్ ప్రధాన శత్రువు అన్నట్లుగా విమర్శిస్తూ ఉండటంతో బీజేపీతోనే టీఆర్ ఎస్ పోటీ పడుతోందన్న అభిప్రాయం ప్రజల్లో కలుగుతోంది. అయితే ఇది వ్యూహాత్మకంగా కేసీఆర్ చేస్తున్నారన్న అభిప్రాయం నిజంగానే ఉంది. అయితే ఇప్పుడు టీఆర్ఎస్ ఒక్క సారిగా సీన్ మార్చేసి.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం ప్రారంభిస్తే బీజేపీ మళ్లీ బ్యాక్ స్టేజ్‌లోకి వెళ్లిపోవడం ఖాయమన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

బీజేపీనే టార్గెట్ చేసి క్రేజ్ తెచ్చి పెట్టిన కేసీఆర్ !

రాజకీయాల్లో ఇద్దరి మధ్యనే పోటీ జరుగుతోంది అన్న ఫీలింగ్ తీసుకు వస్తే.. దూరంగా ఉన్న మూడో పార్టీని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. ఆ పార్టీ ఓటర్లు కూడా ఓడిపోయే పార్టీకి ఓటెందుకు వేయడం అని.. ఓడించాలనుకున్న పార్టీకి ఓట్లేస్తున్నారు. హుజురాబాద్‌, దుబ్బాకల్లో అదే తేలింది. అక్కడ జరిగిన రాజకీయం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్. అందుకే కాంగ్రెస్ పార్టీని ఓటర్లు పరిగణనలోకి తీసుకోలేదు. చాలా వరకూ అదే రాజకీయాన్ని రెండు పార్టీలు కొనసాగిస్తున్నాయి. రెండు రాజకీయ పార్టీల వ్యూహాలను చూస్తే ఇదే తెలుస్తుంది. బీజేపీకి పెద్దగా బలం లేని ప్రాంతాల్లో బండి సంజయ్ యాత్రలు పెట్టుకోవడం.. అక్కడ ఉద్రిక్తతలు సృష్టించడం.. దాన్ని స్టేట్ ఇష్యూగా మార్చే ప్రయత్నం చేయడం అంతా వ్యూహాత్మకంగానే జరుగుతోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

రాహుల్ సభతో ఒక్క సారిగా దూసుకొచ్చేసిన కాంగ్రెస్ !

ఇప్పటి వరకూ ఈ రెండు పార్టీల రాజకీయాలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ పార్టీ వెనుకబడిపోయింది. వరి ఇష్యూలో రెండు పార్టీల బాధ్యత ఉన్నా.. కౌంటర్ చేయడంలో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ అయిపోయింది. అంతర్గత సమస్యలతో కొట్టు మిట్టాడింది. ఆ పార్టీ దుస్థితిని అర్థం చేసుకుని.. కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎదగకుండా చేయాలన్న లక్ష్యంతో బీజేపీకి సాయం చేస్తున్నట్లుగా టీఆర్ఎస్ తీరు ఉందన్న అభిప్రాయం ఉంది. అది కేసీఆర్‌కు మంచిదో కాదో తెలియదు కానీ.. ఆయన బీజేపీకి మాత్రం ఎవరూ చేయలేనంత సాయం చేస్తున్నారన్న విషయం మాత్రం తెలంగాణ రాజకీయవర్గాలకు ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. కానీ రేవంత్ రెడ్డి పట్టుదలగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకు వస్తున్నారు. ప్రభుత్వంపై అలుపెరుగకుండా పోరాడుతున్నారు. అంతర్గత సమస్యల్ని కూడా అధిమించి.. రాహుల్ సభను తిరుగులేని విధంగా నిర్వహింప చేసి అందరి దృష్టిని ఆకర్షించేశారు. డిక్లరేషన్‌తో రైతుల నమ్మకాన్ని పెంచుకున్నారు.

కేసీఆర్‌కు కాంగ్రెస్‌ను తప్పనిసరిగా టార్గెట్ చేయాల్సిన పరిస్థితి.. !

బీజేపీపై కేసీఆర్‌కు తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రాదని నమ్ముతున్నారు. అంటే మిత్రపక్షాలతో కలిసి అయినా కాంగ్రెస్సే అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పట్ల తెలంగాణ ప్రజల్లో సానుభూతి ఉంది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అభిమానం ఉంది. ఇప్పటి వరకూ ఓట్లుగా మల్చుకోలేకపోయారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. తెలంగాణకు బలమైన నాయకత్వం కనిపిస్తోంది. డిక్లరేషన్‌పై రైతుల్లో చర్చ జరిగితే సీన్ పూర్తిగా మారిపోతుంది. రాహుల్ గాంధీ చేసిన విమర్శలకు ఇప్పటికే అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కౌంటర్లు ఇస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రజలకు చేరకపోకపోవడంతో అధినేత కేసీఆర్ రీ కౌంటర్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారని టీఆర్ఎస్‌లో చర్చ జరుగుతోంది

కేసీఆర్‌కు ప్రత్యర్థిని ఎంచుకునే చాయిస్ !

కారణం ఏదైనా ప్రత్యర్థిని ఎంచుకునే అవకాశం కేసీఆర్‌కు వచ్చింది. బీజేపీతో పోటీ పడాలా.. కాంగ్రెస్‌తోనా అన్నది ఆయన డిసైడ్ చేసుకోవాలి. బీజేపీతో ఇప్పుడు పోరాటం అంటే ఎంత ప్రమాదకరమో కేసీఆర్‌కు ఎవరూ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉన్నంతలో కాంగ్రెస్ తో పోరాటం అంటే ప్రజల్లో తేల్చుకోవచ్చు. కానీ బీజేపీతో పోరంటే ప్రజల మద్దతుతో బయట చాలా సవాళ్లు ఎదుర్కోవాలి. ఇప్పుడు కేసీఆర్ కాంగ్రెస్ ను ప్రత్యర్థిగా ఎంచుని రంగంలోకి దిగితే.. బీజేపీ మళ్లీ పాత పరిస్థితే రావొచ్చన్న విశ్లేషణలు సహజంగానే వినిపిస్తున్నా