ఫ్లోరైడ్ బాధితుడి ఇంట్లో కేటీఆర్‌ లంచ్‌

By KTV Telugu On 19 October, 2022
image

మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో భాగంగా టీఆర్ఎస్ అభ్య‌ర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్ రెడ్డి నామినేష‌న్ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌య్యేందుకు గురువారం చండూరు వెళ్లిన ఆ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌… నామినేష‌న్ అనంత‌రం నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని శివ‌న్న గూడెం వెళ్లారు. గూడెంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి ఇంటికి వెళ్లిన కేటీఆర్‌… ఆయ‌న యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా అంశాల స్వామి ఇంటిలోనే కేటీఆర్ మ‌ధ్యాహ్న భోజ‌నం చేశారు. నేల‌పై చాప ప‌ర‌చ‌గా దానిపై మ‌రో మంత్రి జ‌గదీశ్ రెడ్డితో క‌లిసి కూర్చున్న కేటీఆర్…అంశాల స్వామితో క‌లిసి భోజ‌నం చేశారు. ఈ సందర్భంగా త‌న ప‌క్క‌నే కూర్చున్న అంశాల స్వామికి భోజ‌నాన్ని వడ్డించారు. అంతకు ముందు కేటీఆర్‌ మాట్లాడుతూ …
మునుగోడు ఫ్లోరోసిస్‌ సమస్యకు పరిష్కారం చూపించే మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతిఆయోగ్‌ సూచిస్తే, కేంద్రంలోని మోదీ సర్కారు ఒక్క పైసా కూడా ఇయ్యలేదు కానీ, సొంత లాభం కోసం పార్టీ మారిన రాజగోపాల్‌రెడ్డికి మాత్రం రూ.18 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు అని విమర్శించారు.