పుట్టినరోజు కానుకగా పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్
వచ్చే ఏడాదే దర్శనం..
అక్టోబర్ 15 సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బర్త్ డే.దాంతో చిత్ర యూనిట్ కొత్త సినిమా పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో సుప్రీమ్ ఫేస్ చూపించకుండా, స్థానిన ప్రజలను ఉద్దెశించి ప్రసంగిస్తున్నట్లు ఉంది. లాస్ట్ ఇయర్ రిపబ్లిక్ రిలీజ్ కు ముందు ఒక స్మాల్ యాక్సిడెంట్ లో సాయి తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. కోలుకోవడానికి చాలా కాలమే పట్టింది. పూర్తిగా ఆరోగ్యం చేకూరిన తర్వాత సుప్రీమ్ హీరో డైరెక్ట్ గా తాను అంతకు ముందు ఒప్పుకున్న ప్రాజెక్ట్ లోకి అడుగు పెట్టాడు. సుకుమార్ కథను అందిస్తున్నాడు. సహనిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. కార్తిక్ దండు అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. నవంబర్ లో టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయబోతున్నారు. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే గేమ్ ఛేంజర్ గా మారబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. భీమ్లానాయక్, బింబిసారలో హీరోయిన్ గా నటించిన సంయుక్తా మీనన్ కథానాయికగా కనిపించబోతోంది.