మరోసారి వార్తల్లో పూరి

By KTV Telugu On 25 October, 2022
image

డ్యాషింగ్ డైరెక్టర్ కు వ్యతిరేకంగా బయ్యర్లు ధర్నా చేయబోతున్నారా?
మరి జనగణమన పరిస్థితి ఏంటి?

లైగర్ తో పూరి జగన్నాథ్ కష్టాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సినిమా ప్లాప్ కావడంతో, బయ్యర్లు అందరూ నష్టపోయారు. దాంతో పూరి పెద్ద మనసు చేసుకుని కొంత మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఈ ప్రక్రియ ఆలస్యం అవుతుండటంతో బయ్యర్లలో ఒపిక నశించింది. పూరికి వ్యతిరేకంగా ధర్నా చేస్తామంటూ బెదిరింపుకు దిగారు. దాంతో పూరికి కోపం వచ్చింది. నా పరువు పోతుందని బయ్యర్స్ కు డబ్బులు తిరిగి చెల్లిస్తాను అన్నాను.
ఇప్పుడు బయ్యర్లు ధర్నాకు దిగితే పైసా కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు పూరి. అంతే కాదు సినిమా అనేది వ్యాపారం అని.. తన హిట్ మూవీస్ నుంచి లాభాలు పొందిన బయ్యర్లు ఇప్పుడు ఇలా నష్టపరిహారం చెల్లించమనడం ఎంత వరకు సబబు అని ఎదురు ప్రశ్నించాడు. ఈ సంగతి ఇలా ఉంటే పూరి కలల ప్రాజెక్ట్ జనగణమన పై బాలీవుడ్ లో కొత్త రూమర్ మొదలైంది. విజయ్ దేవరకొండతో జనగణమన స్టార్ట్ చేసాడు పూరి. అయితే లైగర్ ఎఫెక్ట్ తో ఈ ప్యాన్ ఇండియా ఫిల్మ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ను రణభీర్ లేదా రణవీర్ సింగ్ తో చేయాలనుకుంటున్నాడట పూరి. లైగర్ రిజల్ట్ చూసిన తర్వాత కూడా రణభీర్, రణవీర్ పూరికి అవకాశం ఇస్తారా..?