మెగాస్టార్ అడగాల్సింది కదా అంటున్న ఫ్యాన్స్
తను కూడా అదే చెప్పేవాడు అంటున్న చిరు
గాడ్ ఫాదర్ లో ఒకటి తగ్గింది. అదే సల్మాన్ రోల్ కనుక ఒక మెగా హీరో చేసి ఉంటే సినిమా నెక్ట్స్ లెవల్లో ఉండేదని ముందు నుంచి మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్న మాట. ఆ హీరో , ఈ హీరో కాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరుకు బాడీ గార్డ్ లా నటించి ఉంటే , తార్ మార్ స్టెప్పులేసి ఉంటే, ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర గాడ్ ఫాదర్ వసూళ్లు మరో విధంగా ఉండేవని అందరూ అంటున్నారు. ఇదే మాటను ఇన్ స్టాగ్రామ్ చాట్ లో పూరి జగన్నాథ్ మెగాస్టార్ ను అడిగేశారు.
అందుకు చిరు నవ్వుతూ నిజమే తమ్ముడిని అడగాల్సింది. ఆ రోల్ పవన్ కు ఆఫర్ చేయాల్సింది. నా సినిమాలో క్యారెక్టర్ అంటే తమ్ముడు తప్పక చేసేవాడు. కాని ప్యాన్ ఇండియా మార్కెట్ లో మూవీని రిలీజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు సల్మాన్ సపోర్ట్ అవసరం. అందుకే తన ఎంపిక సరైనదే అన్నాడు చిరు. ఏది ఏమైనా మెగా బ్రదర్స్ కలసి నటించే బంపర్ ఆఫర్ మిస్ అయింది. మళ్లీ ఈ కాంబోలో మూవీ ఎప్పుడు వస్తుందో చూడాల్సి ఉంది. ఇక ఇదే ఇంటర్యూలో గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి చాలా ప్రశ్నలు సంధించాడు పూరి జగన్నాథ్. సినిమాలో తనకు రోల్ ఆఫర్ చేయడం పై, నయనతారతో నటించడంపై, సత్యదేవ్ విలన్ రోల్ గురించి, చాలా అడిగాడు. అయితే అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆటో జాని. పూరి మేకింగ్ లో చిరు కమ్ బ్యాక్ మూవీగా రావాల్సిన సినిమా ఇది. కాని కొన్ని కారణాలతో కుదరలేదు. ఆటో జాని ఎప్పుడు పూరి? అని చిరు అడిగినప్పుడు, అది పాత కథ. ఇప్పుడు చేయలేం. మీ కోసం మరో మంచి కథ రాస్తాను అంటూ రిప్లై ఇచ్చాడు పూరి. లైగర్ ఫెయిల్యూర్ ను ఇప్పుడిప్పుడు తేరుకుంటున్నట్లు తెలిపాడు పూరి.