*ప్రభాస్ ను దెబ్బ కొట్టిన చరణ్
*RRR లో అల్లూరి సీతారామారాజు బెటరంటున్నారు
ఇది సోషల్ మీడియా యుగం. పైగా రాజమౌళి శకం నడుస్తోంది. ఈ టైమ్ లో భారీ సినిమాలు తీయడం పెద్ద సాహసం.
ఎందుకో ఏమిటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. గ్రాఫిక్స్ తో తెరకెక్కే సినిమా అయినా, హిస్టారికల్ మూవీస్ అయినా సరే,
ఇఫ్పుడు అన్ని చిత్రాలను బాహుబలి,RRR లతో పోల్చి చూస్తున్నారు ఆడియోన్స్. మణిరత్నం తెరకెక్కించిన పొన్నియిన్ సెల్వన్ టాలీవుడ్ కలెక్షన్స్ ను బాహుబలితో కంపారిజన్ దెబ్బకొట్టింది. బాహుబలి చూసి కళ్లతో పొన్నియిన్ సెల్వన్ ను చూడలేం అంటున్నారు తెలుగు ప్రేక్షకులు. ఇఫ్పుడు ఓం రౌత్ తీసిన ఆదిపురుష్ పై కూడా RRR ఎఫెక్ట్ పడింది.
ఈ సినిమాలో ప్రభాస్ రాముడి లుక్ కంటే, త్రిబుల్ ఆర్ లో చరణ్ అల్లూరి సీతా రామరాజు లుక్ బాగుంది అంటున్నారు.
ఎవరూ ఊహించని విధంగా ఆదిపురుష్ టీజర్ సమయంలో రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ కావడం మొదలైంది. RRRలో చరణ్ ను అల్లూరి సీతారామరాజుగా చూపించే ప్రయత్నంలో రాజమౌళి ఏకంగా శ్రీరాముడి రూపాన్ని గుర్తుకు తెచ్చేవిధంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఉత్తరాది ప్రేక్షకులు RRRలో రామ్ లో రాముడినే చూసుకున్నారు. అందుకే ఈ సినిమా హిందీలోనూ 200 కోట్లకు పైగా రాబట్టింది. ఆదిపురుష్ టీజర్ రిలీజ్ వేళ RRR రాముడి గెటప్ మళ్లీ బయటికి వచ్చింది. అందరూ రామం రాఘవం పాట వినిపిస్తున్నారు. ఇండియన్ సినిమాపై రాజమౌళి ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ఆదిపురుష్ టీజర్ ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. అన్నట్లు మరో విషయం ఏంటంటే త్రిబుల్ ఆర్ మూవీ ఈ నెల 21న జపాన్ లో రిలీజ్ అవుతోంది. త్వరలోనే టీమ్ అంతా కలసి జపాన్ వెళ్లనున్నారు. దాంతో త్వరలోనే రామ్ చరణ్ రాముడి అవతారం గురించి జపాన్ లోనూ జోరుగా చర్చ జరగనుంది.