రికార్డు స్థాయిలో జెండాల తయారీ

By KTV Telugu On 19 August, 2022
image

హర్ ఘర్ తిరంగాలో భాగంగా మునుపెన్నడూ లేని విధంగా జాతీయ జెండాలు తయారవుతున్నాయి. తెలంగాణలో ఏటా లక్షల్లో మాత్రమే జాతీయ జెండాలు తయారు చేసేవారు. ఈ ఏడాది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా జెండాల తయారీ కోట్లకు పెరిగింది. కరోనా వచ్చినప్పటి నుంచి అంతంత మాత్రంగానే ఉన్న జెండాల తయారీ బిజినెస్ ఈ ఏడాది ఊపందుకుంది.

హర్‌ ఘర్ తిరంగాలో భాగంగా ఈసారి కేంద్ర ప్రభుత్వం ఇండియన్ ఫ్లాగ్‌ కోడ్‌లో సవరణలు చేసింది. ఈ ఏడాది జాతీయ జెండాలను పాలిస్టర్‌ క్లాత్‌తో తయారు చేయిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోటి 20 లక్షల జెండాల తయారీకి ఆర్డర్ ఇచ్చింది.రాష్ట్ర వ్యాప్తంగా టెస్కో సంస్థ ద్వారా జెండాలను పంపిణీ చేస్తున్నారు.నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని మహిళలకు జెండా కుట్టే పని అప్పగించారు. ఈ జెండాల తయారీతో 40 కేంద్రాల్లో సుమారు 2 వేల మంది ఉపాధి పొందుతున్నారు.

సిరిసిల్లకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది.తెలంగాణతోపాటు మరో 12 రాష్ర్టాల నుంచి జాతీయ జెండాలు ఆర్డర్లు అందుకుని తమ పని తనాన్ని చూపించారు చేనేత కార్మికులు.స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలనే పిలుపు మేరకు నేతన్నకు రాష్ట్ర సర్కారు రూ.5 కోట్ల విలువైన 1.20 కోట్ల పతాకాల ఆర్డర్లు ఇవ్వగా.. వివిధ రాష్ట్రాల మరో 2 కోట్ల జెండాల తయారీకి ఆర్డర్లు వచ్చాయి. మొత్తంగా 5 వేల మరమగ్గాలపై త్రివర్ణ పతాకాలు తయారు చేశారు.2 వేల మందికి చేతినిండా పనిదొరకడంతో వారు సంబరపడ్డారు.

సిరిసిల్ల నేత కార్మికులకు చేతి నిండా పనికల్పించేందుకు సీఎం కేసీఆర్‌,మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.బతుకమ్మ, క్రిస్మస్‌, రంజాన్‌ వస్ర్తాల తయారీకి ఆర్డర్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు.ప్రస్తుతం 25 వేల మరమగ్గాలపై బతుకమ్మ చీరలు తయారవుతుండగా, తాజాగా రాష్ట్ర సర్కారు రూ.5 కోట్ల విలువైన 1.20 కోట్ల జెండాల తయారీకి ఆర్డర్‌ ఇవ్వడంతో భరోసా కల్పించింది.జాతీయ జెండాల తయారీతో నేత కార్మికులే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి దొరికింది. కుట్టు పని మహిళలకు ఉపాధి దొరికింది. మరమగ్గాలపై ఒక్కో కార్మికుడు నెలకు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నాడు.
బైట్స్- సిరిసిల్ల నుంచి వచ్చిన ఫీడ్ వాడాలి

రాష్ట్ర ప్రభుత్వం జెండాల తయారీ ఆర్డర్లను పోచంపల్లితోపాటు నల్లగొండ, వరంగల్‌, గద్వాల, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఇచ్చింది. నేతన్నలు అధికంగా ఉండే సిరిసిల్లకు ఆర్డర్లు ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ సూచన మేరకు స్వయంగా సీఎం కేసీఆర్‌ టెస్కోను ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి ఒక్కో స్క్రీన్‌ ప్రింటర్‌ వ్యాపారికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా
ఆర్డర్లు వచ్చాయి.మన చేతుల్లో ఎగురుతున్న జాతీయ జెండాలను నేతన్నలు రేయింబవళ్లు శ్రమించి తయారు చేశారు. స్వాతంత్ర వజ్రోత్సవాల పుణ్యమాని తయారీదారులకు ఈసారి పంట పండింది.యువకులతోపాటు మహిళలకు చేతినిండా పనిదొరుకుతోంది.తెలంగాణ వ్యాప్తంగా 38588 పవర్ లూమ్స్ ఉండగా ఒక్క సిరిసిల్లలోనే 28494 పవర్ లూమ్స్ ఉన్నాయి.ఈ ఒక్క ఆర్ధిక సంవత్సరంలోనే 350 కోట్ల విలువైన ఉత్పత్తులు జరగడం పెద్ద విశేషం.