మళ్లీ మెగా డామినేషన్ స్టార్ట్ అయిందా?
కింగ్ సిచ్యువేషన్ ఏంటి?
ఈ ఏడాది దసరా సినిమాలకు పెద్దగా క్రేజ్ లేదు. బాక్సాఫీస్ ను షేక్ చేసి పారేసే దసరా సినిమాలు రాలేదు.
అయితే ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన గాడ్ ఫాదర్, ఘోస్ట్, స్వాతి ముత్యం చిత్రాలు ,
పండగ రోజున పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఆచార్య తర్వాత,
చిరు నటించిన గాడ్ ఫాదర్ పై ముందు నుంచి పెద్దగా అంచనాలు లేవు. మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ గా తెరకెక్కడం, టీజర్, ట్రైలర్ కు పెద్దగా రెస్పాన్స్ కనిపించకపోవడం, పాటలు కూడా పేలకపోవడంతో, గాడ్ ఫాదర్ ఇలా వచ్చి అలా వెళ్తాడు అనుకున్నారంతా… కాని ఫస్ట్ షో పడగానే బాస్ ఈజ్ బ్యాక్ అంటూ టాక్ మొదలైంది. మొదటి ఆట నుంచే గాడ్ ఫాదర్ హిట్ టాక్ తెచ్చుకున్నాడు. అసలే దసరా సీజన్, పైగా మెగాస్టార్ మూవీకి పాజిటివ్ టాక్, ఈ దశలో మిగితా సినిమాలపై ఆ ఇంపాక్ట్ పడుతుంది అనుకుంటుండగా చిన్న చిత్రం స్వాతి ముత్యం కూడా హిట్ టాక్ ను తెచ్చుకుంది. నాగార్జున నటించిన ఘోస్ట్ యావరేజ్ మార్కులు తెచ్చుకుంది. దసరా హాలీడేస్ వీకెండ్ వరకు ఉన్నాయి. సో అసలు సిసలు దసరా విన్నర ఎవరూ ? అనేది మండేకు క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి అయితే చిరు లీడ్ లో ఉన్నాడు. గాడ్ ఫాదర్ గా చిరు నటవిశ్వరూపం చూపించడానే టాక్ దసరా పండక్కి కొత్త జోష్ ను తీసుకొచ్చింది. స్వాతి ముత్యం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ,
ప్రేక్షకులను ఏ మేరకు థియేటర్ వరకు రప్పింస్తుందో వేచి చూడాలి. ఘోస్ట్ పూర్తి స్థాయి యాక్షన్ మూవీ కావడంతో,
ఆ వర్గం ఆడియెన్స్ మాత్రమే ఇప్పుడు నాగ్ కోసం థియేటర్స్ కు రాబోతున్నారు. దీపావళి వరకు పేరున్న హీరోలు కాని, పెద్ద చిత్రాలు కాని బాక్సాఫీస్ బరిలోకి దిగడం లేదు. దాంతో గాడ్ ఫాదర్, ఘోస్ట్ , స్వాతిముత్యం సినిమాలకు ఇప్పుడు పెద్ద వరంగా మారింది.