జంప్ జిలానీలపై టీఆర్‌ఎస్‌, బీజేపీ వార్‌

By KTV Telugu On 10 October, 2022
image

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ట్విట్టర్ వార్‌ జరుగుతోంది. త్వరలో ఈ ఎంపీలు పార్టీ మారబోతున్నారంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటుంటున్నారు. టీఆర్‌స్‌కు చెందిన రాజ్యసభ ఎంపీలు
బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. మొత్తం ఏడుగురు ఎంపీలలో నలుగురు ఎంపీలు అంగీకరించారని, మరొకరు ఒప్పుకుంటే రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌లో విలీనం అయిపోయినట్లే అని జోస్యం చెప్పారు. ఇద్దరు కేసీఆర్‌ సొంత మనుషులు, పెట్టుబడిదారులైన ఇద్దరు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరేందుకు ఒప్పుకున్నారని తెలిపారు. ప్రగతి భవన్‌లో ప్రగతి సాధించిన వ్యక్తి నేతృత్వంలోనే ఈ విలీనం జరుగుతుందని హింట్‌ ఇచ్చారు రేవంత్‌రెడ్డి. విలీనానికి సంబంధించిన తంతు ఇప్పటికే పూర్తయిందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ టీఆర్‌ఎస్‌లో విలీనం అయినట్లుగానే రాజ‌్యసభలో టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ బీజేపీలో విలీనం అవడం ఖాయం అన్నారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్‌ నుంచి వెళ్లిన సురేశ్‌రెడ్డి, కేశవరావుతో పాటు బడుగుల లింగయ్య యాదవ్‌కు పార్టీని మోసం చేసే అలవాటు లేదని వారు తప్ప మిగిలివారు బీజేపీలో చేరిపోతారని జోస్యం చెప్పారు. గెస్టుహౌసుల్లో బిజీగా ఉన్న కేటీఆర్‌ అతితెలివి తేటలు ప్రదర్శించడం ఆపి ఈ విషయం మీద దృష్టి పెడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. అంతకు ముందు రోజు తెలంగాణా కు చెందిన ఇద్దరు కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు త్వరలో పార్టీ మారతారని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ వ్యాఖ్యల్లో నిజం లేదని, ఆయన చెప్పేవన్నీ అబద్దాలని కాంగ్రెస్‌ ఎంపి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.