మునుగోడులో బీఆర్‌ఎస్‌ కాదు…టీఆర్‌ఎస్సే

By KTV Telugu On 6 October, 2022
image

టీఆర్‌ఎస్‌ పేరును బిఆర్‌ఎస్‌గా మారుస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. వెంటనే పేరు మార్పు కోసం ఒక బృందాన్ని ఎన్నికల సంఘం వద్దకు పంపించారు. వచ్చే నెలలో జరగనున్న మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్‌ పార్టీ పేరుతోనే పోటీ చేస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. అయితే అధికారికంగా పార్టీ పేరు మారడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున మునుగోడులో టీఆర్‌ఎస్‌ పేరుతోనే పోటీ చేయనున్నట్టు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులను కలిసిన తరువాత వినోద్ కుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. బీఆర్ఎస్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ గుర్తించడానికి కొంత సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. రేపటి నుంచే మునుగోడులో నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది కాబట్టి టీఆర్ఎస్ పేరుతోనే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. బీఆర్ఎస్‌ను ఎన్నికల కమిషన్ గుర్తించేంత వరకూ టీఆర్ఎస్ పేరే కొనసాగుతుందని వినోద్ కుమార్ పేర్కొన్నారు. పార్టీ ఎన్నికల గుర్తు కూడా కారే ఉంటుందని చెప్పారు. మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితి అని మార్చడంపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.