కొంతకాలంగా వల్లభనేని మౌనం
పార్టీ కార్యక్రమాలకు దూరం
సడన్ గా సీఎంతో వంశీ భేటీ
గడపగడపకు కార్యక్రమం..
గన్నవరంలో పార్టీ పరిస్థితిపై చర్చ?
గత కొంతకాలంగా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ… సీఎంతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షకు… వంశీతో పాటు మాజీ మంత్రి కొడాలి డుమ్మా కొట్టారు. దీనిపై వివరణ ఇచ్చేందుకే వంశీ సీఎంను కలిసినట్లు తెలుస్తోంది. అనారోగ్య కారణాలతో సమావేశానికి రాలేకపోయానని…. వారం రోజుల్లో గడప గడపకూ కార్యక్రమం నిర్వహిస్తానని జగన్కు వంశీ చెప్పినట్లు సమాచారం. అదేసమయంలో నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు వంశీ. ఈ సందర్భంగా గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపైనా ముఖ్యమంత్రి చర్చించినట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల్లో జగన్ సునామీలోనూ గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు వంశీ. ఆ తర్వాత టీడీపీని తూర్పారబట్టి జగన్ కు జై కొట్టారు. అధికారికంగా పార్టీ మారలేదు కానీ, అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. పలు సందర్భాల్లో చంద్రబాబు -లోకేష్ టార్గెట్ గా విరుచుకుపడే వారు వంశీ. కొడాలి నాని మంత్రిగా ఉన్న సమయంలో వంశీకి తగిన ప్రాధాన్యత దక్కింది. కానీ, కొంత కాలంగా వంశీ తీరులో మార్పు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంటి పోటీ చేయాలనుకుంటున్న తనకు… స్థానిక వైసీపీ నేతల నుంచి సపోర్ట్ లభించడం లేదు. యార్లగడ్డ వెంకట్రావ్, దుట్టా వర్గాలు వంశీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. గన్నవరం టికెట్ విషయంలో వైసీపీ అధినాయకత్వం వంశీకి భరోసా ఇచ్చినా…స్థానిక నేతలు అడ్డుపడుతున్నారనే అసంతృప్తితో వల్లభనేని ఉన్నారట.
వల్లభనేని వంశీ దివంగత ఎన్టీఆర్ కు వీరాభిమాని. జూ.ఎన్టీఆర్ కు సన్నిహితుడు కూడా. ఇటీవల ప్రభుత్వం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్చడాన్ని బహిరంగంగానే తప్పు పట్టారు వంశీ. పునరాలోచన చేయాలని లేఖ కూడా రాశారు. కానీ, అది జరగలేదు. ఆ తరువాత నుంచి ఆయన సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇది కూడా ఆయన మౌనం వహించడానికి ఓ కారణమని తెలుస్తోంది. త్వరలోనే ఆయన కీలక నిర్ణయం తీసుకుంటారని.. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ సమయంలో.. వంశీ సడన్ గా సీఎంను కలవడం చర్చనీయాంశంగా మారింది. అభివృద్ధి పనుల విషయంలో ముఖ్యమంత్రిని కలిసినట్లు చెబుతున్నా…అంతర్గతంగా ఏదో జరుగుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పునరాలోచన చేయాలని వంశీ ఆ సమయంలోనే సీఎం జగన్ ను కోరారు. కానీ, అసెంబ్లీ పేరు మార్పుకు ఆమోదించారు. వల్లభనేని వంశీ రాజకీయంగా ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ కు వీర భక్తుడు. జూనియర్ ఎన్టీఆర్ తోనూ కొద్ది రోజుల క్రితం వరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. ఈ నిర్ణయం పైన వల్లభనేని వంశీ ఆ తరువాత మాట్లాడ లేదు. ఎన్టీఆర్ పేరు వైసీపీ ప్రభుత్వం మార్చటం తమకు రాజకీయంగా నష్టం చేస్తుందనేది వంశీ మనోగతంగా తెలుస్తోంది. నియోజవకర్గంలో వైసీపీకి దగ్గరైన సమయం నుంచి అదే పార్టీ నేతల నుంచి సమస్యలు ఎదురైనా..వంశీ ముందుకే అడుగు వేసారు. ఇక, అమారావతి రైతుల మహా పాదయాత్ర సమయంలో వైసీపీ నేతలు ఆ యాత్ర పైన తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు ఈ యాత్రను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. Recommended Video ప్రైవేట్ ఉద్యోగుల హక్కు కోసం మరో పోరాటం తప్పదు – సీఎం పై మండిపడ్డ పొన్నం ప్రభాకర్ వంశీ రాజకీయ అడుగులపై ఆసక్తి నిత్యం వైసీపికి మద్దతుగా..చంద్రబాబు నిర్ణయాల పైన విరుచుకుపడే వల్లభనేని వంశీ..ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో రాజకీయ వివాదంగా మారుతున్న అమరావతి పాదయాత్ర పైన స్పందించ లేదు. నిత్యం రాజకీయాలతో బిజీగా ఉండే వల్లభనేని వంశీ..కొంత కాలంగా ఆ స్థాయిలో యాక్టివ్ గా లేరని వైసీపీలోచే చర్చ సాగుతోంది. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలను వైసీపీ అధినాయకత్వం కంట్రోల్ చేయటం లేదనే అభిప్రాయంతో ఆయన ఉన్నట్లుగా చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం క్రిష్ణా జిల్లా టీడీపీ నేతలు.. కొడాలి నాని లక్ష్యంగా సవాళ్లు చేసినా.. వల్లభనేని వంశీ స్పందించలేదని చెబుతున్నారు. గుడివాడ లో అమరావతి రైతులు కొడాలి నానికి సవాల్ చేసారు. ఆ అంశంలోనూ వంశీ మౌనంగానే ఉన్నారు. అయితే, వంశీ అసంతృప్తికి అసలు కారణాలు ఏంటనేది ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. టీడీపీ నుంచి వైసీపీకి దగ్గరైన నేతల నియోజకవర్గాల పైన వైసీపీ అధినాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ సమయంలో..ఇప్పుడు వంశీ వ్యవహారం వైసీపీలో ఆసక్తి కరంగా మారుతోంది.