* కలెక్షన్స్ గుడ్.. పొన్నియన్ సెల్వన్ నాట్ బ్యాడ్!
* మణిరత్నం పొన్నియన్ సెల్వన్ గట్టెక్కుతుందా?
ఓ రేంజ్ స్టార్‌డమ్. టాలెంటంతా ఓచోట పోగేసినట్లు హేమాహేమీలంతా నటించిన సిన్మా. భారీ అంచనాలమీద విడుదలైనా ఫస్ట్ షోకే నెగిటివ్ టాక్. బాహుబలిని కాపీ కొట్టినట్లుందన్నారు కొందరు. కంగాళీలా ఉందని పెదవివిరిచారు విశ్లేషకులు. మణిరత్నం మ్యాజిక్ పనిచేయలేదన్నారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక తేలిపోయిందన్నారు. సాత్వికంగా ఉండే మిసెస్ మణిరత్నం సుహాసినికి కోపం తెచ్చించారు. మొత్తానికి తేలిదేంటంటే పార్ట్-2కోసం పార్ట్-1ని చుట్టేశారని. సిన్మా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడం ఖాయమని.
ఎవరి అంచనాలు ఎలా ఉన్నా పొన్నియన్ సెల్వన్ అంత దారుణంగా అయితే లేదు. లెజండరీ డైరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇంకా తెరపై ఆడుతోంది. తమిళంలో కలెక్షన్లతో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మూడురోజుల్లోనే పొన్నియన్ సెల్వన్ 200 కోట్ల క్లబ్‌లో చేరింది. పదేళ్లక్రితమే మొదలై ఆగిపోయి చివరికి తెరకెక్కించినందుకు మణిరత్నం కష్టానికి ప్రతిఫలం దక్కేలా ఉంది. మొదటి రోజే 80కోట్ల కలెక్షన్లతో విమర్శకుల సమీక్షల్ని తిప్పికొట్టిన సిన్మా రూ.200కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. కోలీవుడ్ హిస్టరీలోనే వేగంగా ఈ ఘనత సాధించిన సిన్మాగా నిలిచింది పొన్నియన్ సెల్వన్.
రూ.200కోట్ల వసూళ్లతో ఇప్పటికే సగం బడ్జెట్‌ని సిన్మా రాబట్టింది. ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే ఫస్ట్ వీక్‌లోనే సేఫ్ జోన్‌లోకి వచ్చేస్తామన్న నమ్మకంతో ఉంది సిన్మా యూనిట్. ఒక్క నార్త్ అమెరికాలో తప్ప ఓవర్సీస్‌లో అత్యధిక బాక్సాఫీసు వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాల లిస్టులోకి పొన్నియిన్ సెల్వన్ -1 కూడా చేరిపోయింది. యూకే, సింగపూర్, మలేసియా ఐమ్యాక్స్ స్క్రీన్లమీద వసూళ్లలో టాప్‌లో నిలిచింది. ఇండియాలో కూడా ఐమ్యాక్స్ థియేటర్లలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో సినిమాగా నిలిచింది. అసలే హిట్లులేక బాలీవుడ్ అల్లాడుతోంది. టాలీవుడ్ కూడా బ్రేక్ ఈవెన్ సిన్మాలకోసం చూస్తోంది. ఈ కరువు కాలంలో కోలీవుడ్‌లో మణిరత్నం మూవీ కొత్త ఉత్సాహాన్ని నింపింది.