1. ప్రజలు ఎందుకు స్పందించడం లేదు
2. ఏపీ అవతరణ దినోత్సవం సందర్భంగా పవన్ ప్రవచనాలు
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా తయారయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రశ్నించడానికని పార్టీ పెట్టి కేవలం వైఎస్‌ఆర్‌సీపీని ప్రశ్నించడమే ఎజెండాగా పెట్టుకున్నారు.
ప్రజలు కూడా తనలాగే వైసీపీని ప్రశ్నించాలనేది ఆయన ఉద్దేశం. కానీ జనం ఆయన్ను లైట్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో వారు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దాంతో పవన్‌లో అసహనం పెరిగిపోయింది.
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. ఆయన ఏమన్నారంటే… ఆనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగువారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణించేవారు.. ఈ వివక్షను భరించలేక పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష చేపట్టి, ప్రాణాలను పణంగా పెట్టి, తెలుగువారిలో చైతన్యం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సాధించిపెట్టారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆంధ్రులలో ఎలాంటి చైతన్యం కోసం అమరజీవి తపించారో.. ఆ చైతన్యం ఆంధ్రప్రదేశ్ వాసులలో ఈనాడు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రం అతలాకుతలం అయిపోతున్నా ఎందుకు స్పందన కరవైందని నిలదీశారు. కానీ ప్రజలు తమకున్న చైతన్యంతోనే టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించారని, తనను రెండు చోట్ల ఓడించారని
ఆయనకు అర్థం కావడం లేదు. ఇంకా ఏమంటారంటే..?
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చేజారిపోతున్నా ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రజలను నిలదీశారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రయివేటు పరం చేస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఆ బీజేపీతో మూడేళ్లుగా చెట్టాపట్టలేసుకుని తిరిగిన పవన్ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్లి మోదీని ప్రశ్నించారా ? లేదు…ఆ పని మాత్రం చేయరు. ఆ స్టీల్ ప్లాంట్ ప్రయివేటు పరం కావడానికి కారణం వైసీపీ ప్రభుత్వమే అని వాదిస్తారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నా, ప్రజలకు పాలకులు కనీస వసతులు కల్పించలేకపోతున్నా ఎందుకు ప్రశ్నించరని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే చాలు అని ఎందుకు ఒప్పుకున్నారని చంద్రబాబును ఒక్కసారన్నా పవన్ ప్రశ్నించారా ? లేదు. అక్రమార్కులు పరిపాలన చేస్తుంటే చేష్టలుడిగి ఎన్నాళ్లు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుందామని ప్రశ్నించారు. ఓటును ఆయుధంగా మలచుకోవాలని పిలుపు నిచ్చారు…అంతేకానీ ఓటుకు కోట్లు కేసులో బ్రీఫ్‌డ్ మీ అంటూ అడ్డంగా ఇరుక్కున్న చంద్రబాబును ఇదేమిటని ఇంతవరకు ప్రశ్నించలేదు పవన్. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి అని ఊరికే అన్లేదు.