సూపర్ స్టార్ కోసమే మళ్లీ ఒక్కటయ్యారా?
రజనీ ఇంట్లో భార్య భర్తల సయోధ్య కుదిరిందా?
జనవరిలో తమిళనాట ఒక తుపాన్ పుట్టుకొచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు , ప్రముఖ నటుడు ధనుష్, అతని కూతురు ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. దాదాపు 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వీరి ప్రకటన చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే సూపర్ స్టార్ మనసును గాయపరిచింది. గత 10 నెలలుగా రజనీకాంత్ కూతురు, అల్లుడు మధ్య మనస్పర్ధలు తొలిగించేందుకు చేయని ప్రయత్నం లేదని సమాచారం. చాలా సార్లు ధనుష్ తోనూ, అతని కుటుంబ సభ్యులతోనూ చర్చలు జరిపారు రజనీ. కొద్ది రోజులుగా రజనీ చేస్తోన్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. ఈ మధ్యే సూపర్ స్టార్ ఇంట్లో ఐశ్వర్య, ధనుష్ కు మధ్య మరో మారు చర్చలు జరిగాయట. ఈ చర్చల్లో విడిపోవడానికి గల సమస్యలను వీరిద్దరు పరిష్కరించుకున్నారని, పిల్లల కోసమైనా విడిపోవాలనుకునే నిర్ణయాన్ని రద్దు చేసుకోవాలనుకుంటున్నారట. త్వరలోనే ధనుష్, ఐశ్వర్య ఒక్కటిగా మీడియా ముందుకు వచ్చి తిరిగి కలసిపోబోతున్నామని తెలపబోతున్నారట. ఇదే స్పీడ్ లో అక్కినేని నాగ చైతన్య, సమంత కూడా తిరిగి ఒక్కటి కావాలని చైసామ్ మ్యూచువల్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాని వీరిద్దరు మళ్లీ ఒక్కటి అయ్యే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవలే నాగార్జున చైతన్య, సమంత రిలేషన్ పై ముగిసిన అధ్యాయం అని చెప్పుకొచ్చాడు.