సుధా మూర్తి రాజ్యసభలో ఉండడం నారీ శక్తికి నిదర్శనం – Modi – Draupadi Murmu-Sudha Murthy

By KTV Telugu On 9 March, 2024
image

KTV TELUGU :-

సుధామూర్తి ,ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారి భాగస్వామిగా రచయిత్రిగా, సేవామూర్తి గా, దాత గా సుధా మూర్తి గారి గురించి తెలియని వారు ఉండరు. ఆవిడ సింప్లిసిటీ చూసిన వారంతా ఆశ్చర్యపోతారు. ఆమె సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని వీలైనంత మందికి కి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా వారి అభివృద్ధికి కూడా తోడ్పడుతుంటారు. ఎన్నో గ్రంథాలయాలు ఏర్పాటు చేయడమే కాకుండా బీద విద్యార్థులకు పరీక్ష ఫీజులు కూడా కట్టి చదువు విలువను తెలియజేస్తుంటారు. అలాంటి సుధా మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాజ్యసభకు నామినేట్ చేశారు. శ్రీమతి మూర్తిని అభినందిస్తూ, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు ప్రకటన వెలువడినందున ఆమె రాజ్యసభలో ఉండటం దేశ ‘నారీ శక్తి’కి శక్తివంతమైన నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.

“భారత రాష్ట్రపతి శ్రీమతి సుధా మూర్తీ జీని రాజ్యసభకు నామినేట్ చేసినందుకు నేను సంతోషిస్తున్నాను. సామాజిక సేవ, దాతృత్వం మరియు విద్యతో సహా విభిన్న రంగాలకు సుధా జీ చేసిన కృషి అపారమైనది మరియు స్ఫూర్తిదాయకం. రాజ్యసభలో ఆమె ఉనికి మనకు శక్తివంతమైన నిదర్శనం. ‘నారీ శక్తి’, మన దేశ భవిష్యత్తును రూపొందించడంలో మహిళల శక్తి మరియు సామర్థ్యాన్ని ఉదాహరణగా చూపుతుంది. ఆమెకు ఫలవంతమైన పార్లమెంటరీ పదవీకాలం కావాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ అన్నారు.

భారత రాష్ట్రపతి 12 మంది సభ్యులను కళలు, సాహిత్యం, శాస్త్రాలు మరియు సామాజిక సేవలకు చేసిన కృషికి పార్లమెంటు ఎగువ సభకు నామినేట్ చేస్తారు.

సుధా మూర్తి చేసిన సామాజిక సేవలకు గుర్తింపుగా పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను కూడా అందుకున్నారు. సుధా మూర్తి భర్త ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు. ఇంజనీరింగ్ చదివిన సుధా మూర్తి కాలేజీలో మొదటి అమ్మాయి. అమ్మాయిలకు ఇంజనీరింగ్ చదివు ఎందుకు అని ఎంతోమంది ప్రశ్నిస్తుండే వారంట. అయినా పట్టుదలగా చదివి నారాయణమూర్తి గారిని వివాహం చేసుకొని కంపెనీకి అన్ని విధాలుగా తోడ్పడుతూ వచ్చారు. ఆమె సలహాలు సహకారం వల్లనే కంపెనీ ఈ విధంగా అభివృద్ధి చెందిందని నారాయణమూర్తి గారు చెబుతుంటారు. వారికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి పెళ్లిల్లు చేసుకుని uk లో స్థిరపడ్డారు. అల్లుడు రిషి సునక్ ప్రస్తుతం యు కె ప్రధానమంత్రిగా ఉన్నారు

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి