తెలుగు రాష్ట్రాల సీఎంలు యువతకు బంపర్ ఆఫర్

By KTV Telugu On 13 September, 2024
image

KTV TELUGU :-

ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా యుగం. అరచేతిలో ఫోన్.. అందులో ప్రపంచం ఇమిడిపోవడంతో ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించే వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. పక్కవారితో మాటలకన్నా చేతిలో ఫోన్ పట్టుకొని అందులో విషయాలను తెలుసుకోవడానికే అందరూ ప్రాధాన్యతనిస్తున్నారు. అంతటి ప్రాధాన్యత ఉన్న సోషల్ మీడియాను రాజకీయ పార్టీలు ఎలా ఉపయోగించుకుంటున్నాయో మనం చూస్తున్నాం. ఒకరకంగా పార్టీ విజయాలకు కూడా ఇవి కారణమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంత్రుల పేషీల్లో కొత్త సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్ లను నియమించాలని నిర్ణయించింది. అలాగే వీరికి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లను కూడా నియమించనుంది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ప్రకటన విడుదల చేసింది. మొత్తం 24 మంది ఎగ్జిక్యూటివ్ లను, 24 మంది అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లను తీసుకోబోతున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఎంపిక చేసి నెలకు రూ.50వేల వేతనం ఇస్తారు. వీరికి అర్హతగా బీటెక్ లేదా బీఈని ప్రభుత్వం నిర్ణయించింది. సోషల్ మీడియా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ లకు అర్హత డిగ్రీ ఉండాలి. వీరికి వేతనం నెలకు రూ.30వేలు ఇస్తారు.

డిజిటల్ కంటెంట్ విషయంలో అనుభవం ఉండటంతోపాటు వాటిని ప్రమోషన్ చేసే విధానం కూడా తెలిసి ఉండాలి. ఆయా శాఖలకు చెందిన మంత్రుల పోర్ట్ ఫోలియోకు సంబంధించి కార్యకలాపాలపై ప్రచారం చేయాలి. ప్రభుత్వ ఇమేజ్ ను పెంచేలా, ప్రజల్లో మంచి పేరు వచ్చేలా కంటెంట్ ను రూపొందించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈనెల 23వ తేదీలోగా తమ రెజ్యూమేను info.apdcl@gmail.com మెయిల్ కు పంపించాలి. హాట్ సూట్ పై పనిచేసిన అనుభవంతోపాటు గూగుల్ అనలిటిక్స్, ఫేస్ బుక్, డిజిటల్ బ్లాగర్ ఫ్లాన్, ఫ్రీలాన్స్ లాంటి అనుభవం ఉండాలని పేర్కొంది.

ఉద్యోగాల భర్తీ పై ముఖ్యమంత్రి రేవంత్ కీలక ప్రకటన చేసారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయిన రెండు నెలల్లోనే 30వేల పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ఈ ఏడాది పూర్తి అయ్యేలోపు మరో 35 వేల ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కొత్తగా నియమించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. తెలంగాణలో అవలక్షణాలతో డ్రగ్స్ బానిసలయ్యారన్నారు.

తెలంగాణ అకాడమీలో ఎస్సైల పాసింగ్ అవుడ్ పరేడ్‌కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐలకు శుభాకాంక్షలు తెలిపారు. కూడా మధుర జ్ఞాపకమని పేర్కొన్నారు. తెలంగాణ సాధించుకున్న తరువాత విద్యార్థుల్లో, ఉద్యమకారుల్లో , ప్రజల్లో ఎంతో అసంతృప్తిగా ఉందని.. ప్రజా ప్రభుత్వం ఏర్పాటు తరువాత నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించామని తెలిపారు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను కొత్తగా నియమించి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామన్నారు. తెలంగాణలో అవలక్షణాలతో డ్రగ్స్ బానిసలయ్యారన్నారు. గంజాయి, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ”పోలీస్ ఉంటే ఉద్యోగం కాదు.. ఇది ఎమోషన్ , బాగోద్వేగం.. డ్రగ్స్ , గంజాయి, సైబర్ క్రైమ్‌పై మీరు బలంగా పని చేస్తారని మీ పై పూర్తి విశ్వాసం ఉంది” అని చెప్పుకొచ్చారు. తెలంగాణాలో పెట్టుబడులు తీసుకురావడంతో పాటు ప్రజల కుల వృత్తులను ఆదుకుంటూ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

దేశ చరిత్రలోనే 18 వేల కోట్లు రూపాయలు కడుపు కట్టుకొని రైతుల అకౌంట్లలో జమ చేశామని ముఖ్యమంత్రి రేవంత్ పేర్కొన్నారు. తెలంగాణ పోలీస్ అకాడేమి నుండి ఈరోజు 547 సబ్ ఇన్స్‌పెక్టర్లు పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వారిలో 145 మంది మహిళా ఎస్‌ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547 లో 401 మంది సివిల్ ఎస్‌ఐలు ఉన్నారు. అలాగే 547లో 472 మంది గ్రాడ్యూట్స్, 75 మంది పోస్ట్ గ్రాడ్యూఎట్స్ ఉన్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి