ప్రముఖ నటుడిని మింగేసిన కొవిడ్…

By KTV Telugu On 28 December, 2023
image

KTV TELUGU :-

ప్రముఖ నటుడు, రాజకీయవేత్త వయకాంత్ దీర్ఘకాలిక అనారోగ్యంతో కన్నుమూశారు. తమిళ సినీ రంగంలో కేప్టెన్ గా పిలిచే విజయకాంత్ కు మూడో సారి కొవిడ్ వచ్చిన కొన్ని గంటల్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. చెన్నై మియాట్ హాస్పిటల్ లో ఆయన చికిత్స పొందుతూ చనిపోయారు. విజయకాంత్‌ 1952 ఆగస్టు 25న మదురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్‌ విజయరాజ్‌ అళగర్‌స్వామి. చిత్ర పరిశ్రమలోకి వెళ్లిన తర్వాత విజయకాంత్‌గా మారారు. ఆయన నటించిన తొలి సినిమా ‘ఇనిక్కుమ్‌ ఇలమై’ 1979లో విడుదలైంది. ప్రతినాయకుడి పాత్రతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు నిర్విరామంగా నటించారాయన. 3 షిఫ్టుల్లో పనిచేసేవారు. ఆయన నటించిన సినిమాల సంఖ్య 150కి పైగానే. 1984లో ఒకే ఏడాది ఆయన నటించిన 18 సినిమాలు విడుదలయ్యాయి. దానితో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. పోలీసు అధికారిగా 20కి పైగా సినిమాల్లో కనిపించారు.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2005లో డీఎండీకే పార్టీని స్థాపించారు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 2016 ఎన్నికల్లో పరాజయం పొందారు.ప్రతిపక్ష నేతగా కూడా సేవలందించారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి