అపర కుబేరుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్ నగర్ జోగ్వాడ్ గ్రామంలో అన్న సేవా కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి స్థానిక ప్రజలకు ముఖేష్ అంబానీ అనంత్ అంబానీలతో పాటు రాధికా మర్చంట్ కుటుంబ సభ్యులు కూడా భోజనం వద్దిన్చారు .స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం ఈ అన్న సేవా కార్యక్రమం నిర్వహించింది
అతిథులకు ఇచ్చిన 9 పేజీల ఆహ్వాన పత్రికలో పశుపక్షుల చిత్రాలను చిత్రించారట. ఇన్దుకు కారణం ఏమిటంటే గత 25 సంవత్సరాల నుండి జాంనగర్లో ఒక కోటికి పైగా చెట్లను నాటి అడవిగా మార్చారట ఎన్నో జంతువులను పశుపక్షులను కాపాడి ఈ అడవిలో పెంచుతున్నారట అంబానీలు
ఇక ఈ ప్రీ వెడ్డింగ్ కోసం వచ్చే అతిధులకు 2500 వంటకాల్ని వడ్డించనున్నట్లు సమాచారం ఒకసారి వడ్డించిన వంటకం మరోసారి వడ్డించకుండా అతిథులు ఎప్పుడు గుర్తుపెట్టుకునేలాగా ఈ కార్యక్రమం ఉండేలా చూస్తున్నారట. మెహందీ హాల్స్, మేకప్ రూమ్, హెయిర్ స్టైలింగ్ రూమ్, సారీ డ్డ్రేపింగ్ రూమ్స్ అంటూ సకల సదుపాయాలు అతిథుల కోసం అమర్చి పెట్టారట. వీరి వివాహం కోసం వెయ్యి కోట్లు ఖర్చుపెట్టనున్నట్లు తెలిసింది ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహం వీరిదే అవుతుంది.
ఈ వేడుకకు ప్రముఖుల అందరికీ చార్టెడ్ ఫ్లైట్స్ ని ఏర్పాటు చేశారు మన దేశంలో ప్రముఖులు అందరితో పాటు బిల్ గేట్ విదేశీ ప్రముఖులు బిల్ గేట్స్ మార్క్ జుకన్ బర్గ్, భూటా న్ రాజు వంటి వారందరూ ఫ్యామిలీతో సహా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారట.
ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ ల వివాహం కోసం 700 కోట్లకు పైగా ఖర్చుపెట్టినట్లుగా సమాచారం. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ఇప్పటివరకు ఖరీదైన వివాహం ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానా ది. వీరి పెళ్ళికి 916 కోట్లు ఖర్చు పెట్టారట. డబ్బులు ఉన్నాయని ఒక పెళ్లి కోసం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా రతన్ టాటా, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలకు వెచ్చించవచ్చు కదా అని కొందరు అంటుంటారు, కానీ మరికొందరు పరోక్షంగా ఖర్చు పెట్టే డబ్బు అంతా ప్రజల వద్దకే కదా చేరేది ఎన్నో కుటుంబాలు ఈ పెళ్లి వల్ల ఆదాయం పొందుతాయని వృధా అని అనాల్సిన అవసరం ఏమి లేదని మరికొందరి చర్చించు కుంటున్నాను.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…