హర్ష సాయి కేసులో బయటపడ్డ వీడియోలు

By KTV Telugu On 26 September, 2024
image

KTV TELUGU :-

యూట్యుబర్ హర్షసాయి తనపై అత్యాచారం చేశాడంటూ ఓ యువతి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. హర్షసాయి తనకి మత్తుమందు ఇచ్చి నగ్న వీడియోలు తీశాడని, వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేశాడని సదరు యువతి నార్సింగ్ పోలీసులను ఆశ్రయించడంతో స్టేషన్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే తనపై కేసు నమోదైందని తెలియగానే ఫ్యామిలీతో సహా అజ్ఞాతంలోకి వెళ్లిన హర్షసాయి తన లాయర్‌ని రంగంలోకి దింపాడు. దీంతో సదరు బాధితురాలు కూడా తన లాయర్‌ను బరిలోకి దింపి ఫైట్‌కి రెడీ అయింది. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఇరు వర్గాల లాయర్లు తమ క్లైంట్‌ని సపోర్ట్ చేస్తూ పలు కీలక కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ఒక్కసారి పరిశీలిస్తే..

తన క్లైంట్ హర్షసాయిని ఓ సాంగ్ కోసం అప్రోచ్ అయింది. అయితే తన దగ్గర స్టోరీ ఉందని, దానిపై మూవీ తీద్దామని హర్షసాయి కోరాడు. దానికి బాధితురాలి టీం కూడా ఓకే చెప్పి ‘మెగా’ పేరుతో సినిమా గ్రాండ్‌గా రిలీజ్ చేయడానికి రెడీ అయింది. అయితే సినిమా చేయాలంటే తనకి అకామడేషన్ కావాలని హర్షసాయి అడగడంతో బాధితురాలి టీం ఓ విల్లాలో అతడికి అకామడేషన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఉంటూనే స్క్రిప్ట్ డిస్కషన్‌ పేరుతో బాధితురాలిని విల్లాకి పిలిచి డ్రింక్స్‌లో సెడేటివ్స్ కలిపి నగ్న వీడియోలు తీసి, రేప్ చేశాడు. ఆ తర్వాత వాటిని అడ్డం పెట్టుకుని బెదిరించాడు. ఈ విషయాన్ని హర్షాసియ ఫాదర్ రాధాకృష్ణ దృష్టికి బాధితురాలు తీసుకెళ్లగా.. హర్షసాయి కెరీర్ స్పాయిల్ అయిపోతుందని బతిమాలి పెళ్లి చేస్తానని ఆయన ఫాల్స్ ప్రామిస్ చేశాడు. ఆ ప్రామిస్ గుడ్డిగా నమ్మిన తన క్లైంట్.. సినిమా పూర్తి చేసి గ్రాండ్‌ రిలీజ్‌కి రెడీ అయింది. ఇలాంటి టైంలో కాపీ రైట్స్ ఇవ్వను.. నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటూ హర్షసాయి కొత్త రూల్ పెట్టడంతో దానికి తన క్లైంట్ ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్స్ చేసి, బాధితురాలిదే తప్పు అనేలా ఆడియోలు క్రియేట్ చేసి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే మూవీ నుంచి తానే తప్పుకుంటున్నట్లు మంచివాడిలా నటిస్తున్నాడు. ఈ కేసులో హర్షసాయితో పాటు ఇమ్రాన్ ఖాన్ అనే మరో వ్యక్తి పేరును కూడా కంప్లైంట్‌లో పొందు పరిచాం.

హర్షసాయి ఎదుగుదలని, సక్సెస్‌ని చూసి ఓర్వలేకే ఈ కేసు పెట్టడం జరిగింది. ఇది అతడిని డీఫేమ్ చేయాలని పెట్టిన అబద్ధపు కేసు. డబ్బు కోసమే తన క్లైంట్‌ హర్షసాయిపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ప్రేమ, పెళ్లి అన్నీ అబద్ధాలే. రెండేళ్ల క్రితం హర్షను కలిసింది. ఏడాదిగా ఇద్దరికీ సంబంధాల్లేవు. సాంగ్‌లో నటించాలని హర్షను కోరింది. హర్షసాయి నిరాకరించాడు. అందుకే ఇలా తప్పుడు ఫిర్యాదు చేసింది. హర్షసాయి, అతని తండ్రి రాధాకృష్ణని బ్లాక్‌మెయిల్ చేసింది. రాధాకృష్ణ ఆమెని చూసిందే లేదు. కానీ కావాలనే అయనని కూడా ఈ కేసులోకి లాగారు.

ఇదిలా ఉంటే.. ఈ కేసులో హర్షసాయి కొన్ని ఆడియోలను బయటపెట్టాడు. ఆ ఆడియోల్లో బాధితురాలు తనని ప్రేమించమంటూ వేధించిందని, కాదంటే టార్చర్ చేసిందని కొన్ని ఆడియోలను బయటపెట్టాడు. అదే టైంలో బాధితురాలి స్నేహితురాలు కూడా హర్షసాయి-బాధితురాలికి సంబంధించిన ఓ వీడియో బయటపెట్టింది. ప్రస్తుతం ఈ ఆడియోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి