సౌత్ ఇండస్ట్రీలో మరో జంట వివాహబంధంలోకి అడుగుపెట్టింది. ఎవరికీ తెలియకుండా టాలీవుడ్ హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. వారెవరూ కాదు..హీరో సిద్దార్థ, హీరోయిన్ అతిథి రావు. గత కొంత కాలంగా ఈ జంట రిలేషన్‌షిప్‌లో ఉన్న సంగతి తెలిసిందే. సరిగ్గా ఆరునెలల క్రితం సిద్ధార్థ, అతిథిరావు హైదరి నిశ్చితార్థం చేసుకున్నారు. సినిమా షూటింగ్ అంటూ ఏకంగా గుడిలోనే నిశ్చితార్థం చేసుకోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇప్పుడు కూడా సీక్రెట్‌గానే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కింది.
సౌత్ ఇండియన్ స్టైల్‌లో హీరో సిద్ధార్థ, హీరోయిన్ అతిథిరావు హైదరికి వివాహం జరిగింది. వీరి పెళ్లిపై ఎటువంటి ప్రకటన లేదు. అతికొద్ది మంది బంధువులు సమక్షంలో వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసి సిద్ధార్థ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. పెళ్లి ప్రకటన కూడా లేకుండా అలా సీక్రెట్‌గా చేసుకోవడం ఏంటని ఫ్యాన్స్ హర్ట్ అయినట్లున్నారు. ఏదేమైనా పెళ్లితో ఒక్కటైన ఆ జంటకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ హీరోయిన్ అతిథిరావు హైదరి ఓ పోస్ట్‌ను షేర్ చేసింది. ఓ నోట్‌ను షేర్ చేస్తూ ఆమె ఎమోషనల్ అయ్యింది. నా సూర్యుడు నువ్వే..నా చంద్రుడు నువ్వే అంటూ ఆమె సిద్ధార్థను పొగడ్తలతో ముంచెత్తింది. ఆ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం. గతంలో అతిథిరావు హైదరి.. సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని పెళ్లాడింది. 2012లో ఏవో సమస్యలతో ఆమె మిశ్రాకు విడాకులిచ్చింది. ఇక సిద్దార్థ్ విషయానికొస్తే తన చిన్ననాటి ఫ్రెండ్ అయిన మేఘనను పెళ్లాడి 2007లో ఆమెకు విడాకులిచ్చాడు. ప్రస్తుతం సిద్ధార్థ్, అదితిరావు పెళ్లితో న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేశారు. ఈ కపుల్ కలకాలం కలిసి ఉండాలని నెటిజెన్లు ఆశీర్వదిస్తున్నారు.