భారత్‌లో హైవోల్టేజ్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ పార్టీలు ఎక్కువగా ఆధారపడుతోంది బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోల మీద కాదు. వారు ఈ తరహా ప్రచారం చేసినా సోషల్ మీడియాలో ప్రచారంపైనే ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. విచ్చవిడిగా ఖర్చు చేస్తున్నారు. సొంత సైన్యాలే కాదు.. అద్దె ఇన్ ఫ్లూయన్సర్స్ పెరిగిపోతున్నారు. ఈ పరిస్థితి ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపించబోతోందా ?
ప్రపంచంలో ఉన్న జనాభాలో సగానికిపైగా భారత్, చైనాల్లోనే ఉన్నారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదు. ఆ దేశంలో చైనా సోషల్ మీడియాలు ఉంటాయి. బయట వాటికి చాన్స్ ఉండదు. కానీ భారత్ ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో విదేశీ సోషల్ మీడియాలదే హవా. అంతే కాదు మన దేశంలో వన్ జీబీ డేటా చాలా తక్కువ. అమెరికాలో ఇంటర్నెట్ కోసం.. వన్ జీబీ జేటా వాడుకుంటే ఆరు డాలర్లు ఖర్చవుతుంది. అంటే దాదాపుగా ఐదు వందల రూపాయలు. మన దేశంలో వన్ జీబీ డేటా పదమూడు రూపాయలకే వినియోగదారులకు లభిస్తోంది. ప్రపంచంలో డేటా అత్యంత చీప్ గా లభిస్తున్న దేశాల్లో భారత దేశం మూడో స్థానంలో ఉంది.
చవకగా లభిస్తున్న డేటా, స్మార్ట్ ఫోన్ల విప్లవంతో భారత పౌరులంతా ఆన్ లైన్ లోకి వచ్చేశారు. భారత్ లో ఉన్న ప్రజల్లో 880 మంది ఆన్ లైన్ లో ఉంటున్నారు. వీరిలో 442 మంది గ్రామీణ ప్రాంతాల ప్రజలు. అంటే వారి చేతుల్లో ఫోన్ ఉంటుంది. అది చాలు అన్నట్లుగా సోషల్ మీడియా విస్తరించింది. ఆ సోషల్ మీడియాను రాజకీయపార్టీలు ఊహించని విధంగా వాడుకుంటున్నాయి. రీల్స్, యూట్యూబ్ వీడియోస్, ఇన్ ఫ్లూయన్సర్స్, పాడ్ కాస్ట్ ఇలా ఏ పద్దతిలో చాన్స్ ఉంటే ఆ పద్దతిలో రాజకీయ పార్టీలు ప్రచారాలు చేస్తున్నాయి.
సోషల్ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయడానికి రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదు. రాజకీయ పార్టీలు అసలు ప్రచారం కన్నా సోషల్ మీడియాలో ఓటర్లను ఎలా ప్రభావితం చేయగలుగుతున్నామన్నది చూసుకుంటున్నారు. మన దేశంలో మొదటి సోషల్ మీడియా ఎలక్షన్ గా 2014 ఎన్నికలను చెప్పవచ్చు. అప్పట్లో నరేంద్రమోదీ ని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం .. ఆయన ఇమేజ్ ను ఊహించనంతగా పెంచిందనేది అందరూ అంగీకరించే విషయం. సోషల్ మీడియాను ఉపయోగించుకుంటే రాజకీయంగా ఎలా లాభపడవచ్చో బీజేపీ చూపించిన ఎన్నిక అది.
సోషల్ మీడియాను వినియోగించేవారు మన దేశంలో చాలా ఎక్కువ. 229 మిలియన్ ఇన్ స్టా యూజర్స్ ఉన్నారు. 535 మిలియన్ వాట్సాప్ యూజర్స్, 315 మిలియన్ల మంది ఫేస్ బుక్ యూజర్స్, 462 బిలియన్ యూట్యూబ్ యూజర్స్ ఉన్నారు. ఒక్కరు ఒక్కటే వాడాలని లేదు. ఒక్కొక్కరు నాలుగింటిలోనూ యాక్టివ్ గా ఉంటున్నారు. అందుకే ఈ సోషల్ మీడియా వ్యవస్థలన్నింటిలోనూ రాజకీయ పార్టీలు వేలు పెట్టాయి. సొంత వ్యవస్థల్ని ఏర్పాటు చేసుకున్నాయి.
అయితే రాజకీయ పార్టీలు అంతటితో ఆగిపోవడం లేదు. ఎవరు ఓటచర్లను ప్రభావితం చేయగలరు అనుకుంటే వారికి ప్యాకేజీలు ఇచ్చి మరీ ప్రచారం చేయించుకుంటున్నారు. సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్స్ పేరుతో ప్రచారం చేసే వారి మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. మంచి ఫాలోయింగ్ బేస్ ఉన్న వారికి లక్షలు చెల్లిస్తున్నారు. ఇన్ ఫ్లూయన్సర్స్ మార్కెట్ ఇప్పుడు 289 మిలియన్ డాలర్లు.. రెండేళ్లలో అది 400 మిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. వీరంతా రకరకాల పద్దతుల్లో తమ క్లయింట్ కు మేలు చేసేలా ప్రచారం చేస్తారు. ఇక యూట్యూబర్స్ గురించి చెప్పాల్సిన పని లేదు.
మన దేశంలో రాజకీయ పార్టీలు.. సోషల్ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో బీజేపీ ముందు ఉంది. ఆ పార్టీ ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ , వాట్సాప్ వంటి మాధ్యమాల్లో ఇతర పార్టీలు అందుకోలేనంత ఫాలోయర్స్ ఉన్నారు. నేతల్లో మోదీకి ట్విట్టర్‌లో వంద మిలియన్ల ఫాలోయర్స్ ఉంటారు. రాహుల్ గాంధీకి పాతిక వేల మిలియన్ల ఫాలోయర్స్ మాత్రమే. అయితే వారు కూడా శక్తివంచన లేకుండా సోషళ్ మీడియాను వినియోగించుకునే ప్రయత్నంలో ఉన్నారు.
ఎన్నికలను ప్రభావితం చేసే శక్తి సోషల్ మీడియాకు ఉంది. అందుకే 2024 ఎన్నికల్లో సోషల్ మీడియాపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఫేక్ న్యూస్, మిస్ ఇన్ఫర్మేషన్, డీప్ ఫేక్, హేట్ స్పీచ్ వంటివి స్ప్రెడ్ చేసి.. ఎన్నికల్లో పార్టీలు లబ్ది పొందనున్నాయి. భారత ఎన్నికల్లో జోక్యం చేసుకోవడానికి చైనా కూడా ప్రయత్నిస్తోందన్న వార్తలు వస్తున్నాయి. ఏఐ టెక్నాలజీతో గందరగోళం సష్టించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని అంటున్నారు. చాలా దేశాల్లో సోషల్ మీడియా ఎన్నికలను ప్రభావితం చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఇండియాలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అందుకే ఓటర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
మనం ఎదురుగా చూసేది కూడా ఒక్కో సారి నిజం కాకపోవచ్చు. అలాంటి భావన సోషల్ మీడియా కల్పిస్తోంది. ఇక రాజకీయ పార్టీలు చేసే మాయ గురించి చెప్పాల్సిన పని లేదు. ఓటర్లే అవగాహన పెంచుకోవాల్సిన కీలక సమయం ఇది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…