ఈ సంవత్సరం కూడా భారతదేశంలోని సంపన్నవంతులలో మొదటి వాడిగా నిలిచాడు ముఖేష్ అంబానీ. ఆయనకు ఉన్న బిజినెస్ లను చిన్నతనం నుండే పిల్లలు గమనించేలా తయారు చేశాడు. వారి అన్నదమ్ముల మధ్యలో వచ్చిన వేదాభిప్రాయాలు గొడవలు తన పిల్లల మధ్యలో రావద్దని ముందు నుండే జాగ్రత్త పడుతూ ఎవరు ఏది చూసుకోవాలో నిర్ణయిస్తూ వారిని ఆ పనిలో నిమగ్నమయ్యేలా చేశారు ముఖేష్ నీతా అంబానీలు అనంత్ ఈ మధ్యనే రాధిక మర్చంట్ తో ఫ్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరుపుకున్నారు. అనంత్ ఈరోజు 29వ ఏట అడుగుపెట్టాడు. త్వరలో రాధిక మర్చంట్నీ పెళ్ళి చేసుకోబోతున్నాడు. అయితే అనంత్ అంబానీ తన అక్క ఇషా అంబానీకి ఒక విషయంలో సమానంగా పోటీ పడుతున్నాడు. అది ఏంటంటే
అనంత్ అంబానీ కంటే పెద్ద వారైన
తోబుట్టువులు ఇషా, ఆకాష్ కవలలు. వారిద్దరూ అనంత్ కంటే 3 సంవత్సరాలు పెద్దవారు.. ప్రస్తుతం 32 సంవత్సరాలు
అయితే అనంత్ అంబానీ తన అక్క ఇషా అంబానీకి ఒక విషయంలో సమానంగా పోటీ పడుతున్నాడు.
ముఖేష్ అంబానీ చాలా చిన్న వయస్సులోనే వ్యాపార విషయాలలో తన పిల్లలను తీర్చిదిద్దడం ప్రారంభించాడు. 8 సంవత్సరాల క్రితం ‘రిలయన్స్ జియో’ ప్రారంభించినప్పుడు, ఆకాష్, ఇషాలు కీలక బాధ్యతలు పోషించారు. అనంత్ అంబానీ ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన కొత్త ఇంధన వ్యాపారాన్ని మరింతగా విస్తరించడంపై దృష్టి సారించారు. ఈ ముగ్గురు ఇప్పుడు రిలయన్స్ గ్రూప్ డైరెక్టర్ల బోర్డులో చేరారు. ఇషా కంపెనీ రిటైల్ వ్యాపారంపై దృష్టి సారిస్తుండగా, ఆకాష్ జియో ప్లాట్‌ఫారమ్‌లకు బాధ్యత వహిస్తున్నాడు. అనంత్ కంపెనీ కొత్త ఎనర్జీ వ్యాపారాన్ని నడుపుతున్నాడు. అయితే జీతం విషయంలో అనంత్, ఇషా ఒకరికొకరు పోటీ పడుతారని మీకు తెలుసా? అయితే ఆకాష్ జీతం ఇద్దరు తోబుట్టువుల కంటే ఎక్కువ.
మీడియా నివేదికల ప్రకారం, ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్, రిలయన్స్ జియో, రిలయన్స్ ఫౌండేషన్, మరియు తన పిన్ని సహాయం తో ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ బాధ్యతల వంటివి నిర్వహిస్తున్నారు. అలాగే దీని కోసం ఆమె వార్షిక వేతనం రూ. 4.2 కోట్లు. రిలయన్స్ గ్రూప్‌లోని షేర్లు, వాటిపై అందుతున్న డివిడెండ్లు వేరేగా ఉంటాయి. ఇక తమ్ముడు అనంత్ అంబానీ కూడా జీతం విషయంలో అక్కతో పోటీ పడుతున్నాడు. అతను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన వ్యాపారం, పునరుత్పాదక, గ్రీన్ ఎనర్జీ వ్యాపారానికి సంబంధించిన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఇది కాకుండా, అతను జియో ప్లాట్‌ఫారమ్‌ల లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌ల అనేక బాధ్యతలను కూడా కలిగి ఉన్నాడు. ఆయన వార్షిక వేతనం కూడా దాదాపు రూ.4.2 కోట్లు. అనంత్ అంబానీ వ్యక్తిగత నికర విలువ 40 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ. 3,32,482 కోట్లు
కాగా, అనంత్ అన్నయ్య ఆకాష్ అంబానీ భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు ఛైర్మన్‌గా ఉన్నారు. ఇది కాకుండా, అతను రిలయన్స్ రిటైల్ వెంచర్స్, జియో ప్లాట్‌ఫారమ్‌ల డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అతని వేతనం అతని సోదరుడు, సోదరి కంటే ఎక్కువ సంవత్సరానికి రూ. 5.4 కోట్లు .
కష్టపడి పని చేస్తేనే ఎంతటి వ్యాపారమైన నిలుస్తుంది లేదంటే కుప్ప కూలుతుంది అనేది వారికి బాగా అవగతమైన విషయం. కాబట్టి కష్టించి పని చేస్తారు ఒకరికొకరు అండగా నిలుస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా పాల్పంచుకుంటున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…