ప్రపంచంలోని టాప్ ఫైవ్ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి అయిన జపాన్ ఆర్థిక మాంద్యంలోకి దిగజారిపోయింది. జపాన్ లాంటి దేశాల్లో లెక్కలు పక్కాగా ఉంటాయి.. అందుకే వారి పారామీటర్స్ ప్రకారం తమ దేశం ఆర్థిక మాంద్యంలోకి అడుగు పెట్టిందని అక్కడి పాలకులు ఒప్పుకున్నారు. అసలు ధనిక దేశాల్లో ఒకటి అయిన జపాన్ కు ఏమైంది ? ఎందుకు వెనుకబడిపోతోంది ?
అమెరికాను వెనక్కు నెట్టేసి ఆర్థికంగా మొదటి స్థానంలో ఉంటుందని అనేక మంది భావించిన జపాన్ గత రెండున్నర దశాబ్దాలుగా స్లో అయిపోయింది. 2010లో చైనా ముందుకు రావటంతో రెండో స్థానం కోల్పోయి మూడో స్థానానికి దిగజారింది. తాజాగా ఆ స్థానాన్ని కూడా కోల్పో యి జర్మనీ తరువాత నాల్గవదిగా మారింది. జర్మనీ జీడీపీ నాలుగున్నర లక్షల కోట్ల డాలర్లు కాగా జపాన్ 4.2లక్షల కోట్లకు పడిపోయింది. జర్మనీ పరిస్థితి కూడా అటూ ఇటూగా ఉంది, అక్కడ కూడా ఆర్థిక వృద్ధి అనుమానంలో పడింది. ఎక్కడైనా వరుసగా రెండు త్రైమాస కాలాల్లో జీడీపీ తిరోగమనంలో ఉంటే ఆ దేశం సాంకేతికంగా మాంద్యం లోకి దిగజారినట్లు భావిస్తారు. గతేడాది చివరి ఆరు నెలల్లో జపాన్లో అదే జరిగింది. ఈ కారణంగానే జీడీపీ లో తన స్థానాన్ని కోల్పోయింది.
జపాన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం 2023 జూలై- సెప్టెంబరు మాసాల్లో జీడీపీ వృద్ధి రేటు 0.8, తరువాత మూడు మాసాల్లో 0.1శాతం తిరోగమనంలో ఉన్నట్లు ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొని లెక్క లను ఖరారు చేశారు. గడచిన రెండు మూడు దశాబ్దా లుగా జపాన్ ఆర్థిక వ్యవస్థ అనుకున్నంతగా వృద్ధి చెందడం లేదు. ఒక సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకొని తరు వాత కాలంలో ఆ దేశ కరెన్సీ విలువ తగ్గిందా, పెరిగిందా అన్న అంశాన్ని తీసుకొని ఖరారు చేసేది వాస్తవ జీడీపీ. ఈ రోజు మన దేశంలో రూపాయి విలువ ఏడాది తర్వాత రూపాయి విలువ చాలా మార్పు వస్తుంది. అప్పుడు రూపాయే.. ఇప్పుడూ రూపాయే అని అనుకుంటాం. కానీ ఆ రూపాయితో ఇప్పుడు కేజీ బియ్యం వస్తే.. ఏడాది తర్వాత అర కేజీ మాత్రమే బియ్యం వస్తుంది. అంటే రూపాయి విలువ సగం పడిపోయినట్లే. ఇలా వాస్తవ రూపంలో లెక్కలు వేస్తేనే అసలైన జీడీపీ బయటకు వస్తుంది.
జపాన్లో 2023లో 1.9 శాతం వృద్ధి రేటు నమోదైనట్లు గతంలో ప్రకటించారు. కానీ దిగజారిన కరెన్సీ ఎన్ విలువ, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఆరునెలల కాలంలో తిరోగమన వృద్ధి నమోదైనట్లు తేలింది. డాలర్ లెక్కల్లో జర్మ నీ కంటే జపాన్ జీడీపీ విలువ తగ్గినట్లు పరిగణించాల్సి వచ్చింది. జపాన్, జర్మనీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఓడి పోయిన తరువాత ఆ దేశాలలో మరోసారి మిలిటరీ నియంతలు తలెత్తకుండా ఉండేందుకు ఆత్మరక్షణ దళా లను మాత్రమే నిర్వహించాలని ఒప్పందాలు జరిగాయి. అందువలన మిలిటరీ ఖర్చును అక్కడి ప్రభుత్వాలు పరిశోధన-అభివృద్ధికి వెచ్చించటంతో రెండు దేశాలు కూడా పారిశ్రామిక, ఎగుమతి రంగాల్లో దూసుకు పోయాయి. ఇటీవలి కాలంలో చైనా పెరుగుతున్న కొద్దీ జపాన్ నామమాత్ర వృద్ధితో కొట్టుమిట్టాడుతోంది.
ఎగు మతులు బాగా చేసిన కాలంలో సంపాదించుకున్న డాలర్ల మిగులు ఇప్పటికీ ఎంతో ఉంది కనుక ఆ మాత్ర మైనా నిలిచి ఉంది. డాలరుతో పోలిస్తే జపాన్ కరెన్సీ ఎన్ విలువ గత రెండేండ్లుగా పతనం అవుతున్నది. అందుకే వాస్తవ జీడీపీ విలువ తగ్గుతున్నది. స్థానికంగా జనాలు చేస్తున్న ఖర్చు కూడా తగ్గుతున్నది, పని చేసేం దుకు కార్మికులు లేకపోవటంతో విదేశాల నుంచి దిగు మతి చేసుకుంటున్నారు. మహిళలను మరింతగా ఉత్పాదక రంగంలోకి దించేందుకు వేతనాల పెంపుదల వంటి కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ వృద్ధి రేటు మెరుగుపడకపోగా దిగజారుతు న్నది. అభివృద్ధి చెందిన అన్ని దేశాల్లో జననాల రేటు తగ్గి కార్మిక శక్తి కొరత, వృద్ధుల సంఖ్య పెరుగుతున్నది.
చైనా అన్ని రకాల వస్తువు లను చౌకగా ఎగుమతి చేస్తుండటంతో ఎగు మతి ఆధారిత వ్యవస్థలన్నీ ఇబ్బందులను ఎదు ర్కొంటున్నాయి. జపాన్ ఎగుమతులు గత కొద్ది సంవత్సరాలుగా తగ్గుతున్నాయి. గతం లో ప్రపంచ మార్కెట్లో ఎక్కడ చూసినా జపాన్ టీవీలు, కంప్యూటర్లు, కార్లు కనిపించేవి. ఇప్పుడు చైనా వాటి స్థానాన్ని ఆక్రమించింది. ఇది ఒక్క జపాన్ సమస్య మాత్రమే కాదు, జపాన్ కోలుకోవాలంటే చాలా పెద్ద యుద్ధమే చేయాల్సి ఉంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…