ఒక చిన్న ముద్దు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ ముద్దు వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో జిల్ బైడెన్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భర్త డగ్ ఎమ్హాఫ్ను ముద్దాడారు. అమెరికా ఉభయ చట్టసభలను ఉద్దేశించి అధ్యక్షుడు బైడెన్ ప్రసంగానికి కొన్ని క్షణాల ముందు ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికాలో స్నేహితులు పరిచయస్తుల మధ్య మర్యాదపూర్వకంగా పలకరిస్తూ ముద్దు పెట్టుకోవడం కౌగిలించుకోవడం అనేది అక్కడి కల్చర్లో భాగం. ఇలాంటి సందర్భాలలో నేరుగా పెదాలపై కిస్ చేయరు. కానీ జిల్ నేరుగా కమల భర్త పెదాలను కిస్ చేసింది.
ఇప్పుడిది అగ్రరాజ్యంలో చర్చనీయాంశమైంది. ఆ సమావేశంలో వీరిద్దరూ ఎదురెదురుగా వచ్చినప్పుడు జిల్కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు డగ్ చేయి చాచారు. అయితే జిల్ ఎవరూ ఊహించని విధంగా ఆయన పెదాలపై కిస్ చేశారు.
ఎనిమిది సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోను బెన్నీ జాన్సన్ అనే జర్నలిస్టు ట్విట్టర్లో షేర్ చేశారు. వెంటనే ఈ వీడియో వైరల్ అయిపోయింది. నెటిజన్లు రకరకాల కామెంట్లు ఎమోజీలతో తమ స్పందన తెలియజేస్తున్నారు. లేటు వయసులో ఏమిటీ ఘాటు సరసం అంటూ మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ సమావేశంలో జిల్ డగ్ను ముద్దు పెట్టుకోవడం చూసి అక్కడున్నవారు లైట్ తీసుకున్నారు. వారందరూ చప్పట్లు కొడుతూ జిల్కు ఆహ్వానం పలికారు. అమెరికాలో ఇలాంటి సీన్లు కామనే అని సరిపెట్టుకుంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్లు.