Kiran Abbavaram – రేపు సాయంత్రం 4 గంటలకు కిరణ్ అబ్బవరం ఎంగేజ్మెంట్

By KTV Telugu On 12 March, 2024
image

KTV TELUGU :-

1. వివాహబంధంతో ఒక్కటవుతున్న రాజా గారు రాణిగారు
2. రేపు సాయంత్రం గండిపేట లోని ఒక రిసార్ట్ లో ఎంగేజ్మెంట్
3. ఆగస్టులో పెళ్లి ముహూర్తం ఉండవచ్చు
4. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లు అందుకుంటున్న కిరణ్
5. స్వగ్రామంలో సొంతింటి కలను నెరవేర్చుకున్నారు

తమతో సినిమాలలో స్క్రీన్ పంచుకున్న హీరో హీరోయిన్లు తర్వాత కాలంలో జీవితం పంచుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాటి కృష్ణ విజయ
నిర్మల నుండి నేటి వరకు ఎంతమందో ప్రేమ వివాహాలు చేసుకుని అన్యోన్య దాంపత్యాన్ని సాగిస్తున్నారు.

నేడు అదే తరహాలో కిరణ్ అబ్బవరం కూడా తన మొదటి సినిమా అయిన రాజావారు రాణి గారు లో హీరోయిన్ గా నటించిన రహస్య గోరక్ ని వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరికి ఇదే మొదటి సినిమా

అంతకుముందు ఇద్దరు కూడా షార్ట్ ఫిలిమ్స్ లో, నటించారు. రహస్య మోడలింగ్ కూడా చేశారు

ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 2019లో విడుదలయిన రాజావారు రాణి గారు సినిమా మంచి సక్సెస్ ని సాధించింది. ఈ సినిమాలో సాదాసీదాగా కనిపించిన పల్లెటూరి అబ్బాయి రాణి గారి ప్రేమను పొందాడు. ఆ ప్రేమ ను నిజజీవితంలో కూడా పొందగలిగారు. కిరణ్ రహస్య గోరక్ లు.
తర్వాత సినిమాలలో తన స్టైల్ ని మార్చి కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అన్నిటిలో తన ప్రతిభను చూపుతూ ఎవరి సపోర్ట్ లేకుండా స్వశక్తి తో ఇండస్ట్రీలో తన స్థానాన్ని పదులపరుచుకున్నారు కిరణ్.

జయాపజాలతో సంబంధం లేకుండా వరుసగా అతనికి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి ఎస్ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే వినరో భాగ్యము విష్ణు కథ ,మొదలైన సినిమాల ద్వారా తనలోని టాలెంట్ ని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం దిల్ రుబా అనే చిత్రంలో నటిస్తున్నారు. 197 0 దశాబ్దం నేపథ్యంలో సాగే ఓ పీరియాడిక్ మూవీకి కూడా ఒప్పుకున్నట్లు తెలిసింది

గత ఐదు సంవత్సరముల నుండి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు ఇరు కుటుంబాల అంగీకారంతో మార్చ్ 13న గండిపేటలోని ఒక రిసార్ట్లో దగ్గరి బంధువులు స్నేహితుల మధ్య సాయంత్రం నాలుగు గంటలకు ఎంగేజ్మెంట్ జరగనుంది

రాజావారు రాణి గారు చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది కానీ ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచారు వీరి ప్రేమ గూర్చి మీడియాలో ఎన్నో వార్తలు కూడా వచ్చాయి అయితే అలాంటిది ఏమీ లేదని రహస్య తనకు మంచి స్నేహితురాలు అని కిరణ్ ఒక సందర్భంలో చెప్పారు. ఇంకొక సందర్భంలో మీరిద్దరూ లివిన్ రిలేషన్ లో ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు కిరణ్ సిగ్గుపడిపోయారు. నేనెప్పుడూ ఇలా దొరికిపోలేదు అని కూడా అన్నారు. దాంతో వారి మధ్య ప్రేమ ఉంది అనే విషయం అందరికీ క్లియర్ గానే అర్థమైంది

కిరణ్ తన సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారు స్వగ్రామంలో ఇంటిని నిర్మించుకుని గృహప్రవేశం ఫోటోలను మీడియాలో షేర్ చేశారు అందులో రహస్య గోరక్ కూడా ఉన్నారు.

అయితే ఈ విషయాన్ని ఇప్పుడు కిరణ్ అబ్బవరం స్వయంగా ప్రకటించారు బహుశా ఆగస్టులో పెళ్లి ముహూర్తం ఉండొచ్చని కూడా చెప్పారు.

రహస్య గోరక్ 4 తెలుగు తమిళ మూవీలలో నటించి, తర్వాత సినిమా ఇండస్ట్రీకి దూరంగానే ఉంటున్నారు.

ఐదు సంవత్సరాల వీరి ప్రేమ పెళ్లి అనే బంధంతో ఒకటవుతున్న సమయంలో అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి