అమెరికా అందగత్తె గేబ్రియల్ కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం

By KTV Telugu On 15 January, 2023
image

అమెరికాలోని లూసియానాలో న్యూ ఓర్లీన్స్‌ లో మిస్ యూనివర్స్ 71వ ఎడిషన్ ఫైనల్స్‌ కన్నుల పండుగగా జరిగాయి. ఇందులో 80 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో అమెరికా అందగత్తె ఆర్బోనీ గేబ్రియల్‌ మిస్ యూనివర్స్ 2022 విజేతగా నిలిచింది. 80 మంది అందగత్తెలను ఓడించి ఆమె కీరిటాన్ని సొంతం చేసుకుంది. 2021 మిస్ యూనివర్స్ హర్నాజ్ సంధు తన కిరీటాన్ని గేబ్రియాల్‌కు అలంకరిచి శుభాకంక్షలు తెలిపారు. ఈ పోటీల్లో మిస్ వెనిజుల అమందా దుదామెల్ మొదటి రన్నరప్ గా నిలవగా, మిస్ డొమినికన్ రిపబ్లిక్ ఆండ్రీనా మార్టినెజ్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఇండియా నుంచి ప్రాతినిథ్యం వహించిన దివిట రాయ్ నిరాశ పరిచారు. ఆమె టాప్-5లోకి కూడా అడుగుపెట్టకపోవడం భారత అభిమానులకు నిరాశకు గురిచేసింది. కేవలం టాప్ 16లో చోటు దక్కించుకొని సరిపెట్టుకుంది.

మిస్‌ యూనివర్స్‌గా నిలిచిన గాబ్రియేల్ పలు రంగాల్లో ప్రావీణ్యం ఉంది. హైస్కూల్‌లో ఉన్నప్పుడే ఫ్యాబ్రిక్స్, టెక్స్‌టైల్స్‌తో డిజైన్‌లను రూపొందించడం మొదలుపెట్టారు. ఫ్యాషన్‌ డిజైన్‌లో బాచిల్‌ డిగ్రీ పొందిన గాబ్రియల్‌ తన సంస్థ డిజైనింగ్‌ సంస్థకు సీఈవోగా ఉన్నారు. సమాజంలో నిరాధారణకు గురైన మహిళల అభివృద్ధి కోసం తాను తన చివరి వరకు కృషి చేస్తానని గాబ్రియేల్ స్పష్టం చేశారు. తన సంస్థ గురించి జ్యూరి అడిగిన ప్రశ్నకు బదిలిస్తూ తాను 13 సంవత్సరాలుగా ఫ్యాషన్ డిజైనర్ గా పని చేస్తున్నా నేను ఫ్యాషన్‌ను మంచి కోసం శక్తిగా ఉపయోగిస్తాను. రీసైకిల్ చేసిన పదార్థాల తో దుస్తులను తయారు చేస్తూ కాలుష్యాన్ని తగ్గించుకుంటాను. మానవ అక్రమ రవాణా, గృహ హింస నుంచి బయటపడిన మహిళలకు కుట్టు తరగతులు నేర్పుతాను. తన సంస్థను మార్పు కోసం వాహనంగా ఉపయోగిస్తాము అని ఆమె చెప్పారు.