చంద్రుడ్ని చేరుకున్నాం. ఇప్పటికి రోవర్ ని పంపి ఉండవచ్చు. కానీ చేరుకోవడానికి ఓ మార్గం కనిపెట్టాం. ఆ దారిలో శరవేగంగా వెళ్లడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.. అందుకే భారత శాస్త్రవేత్తలు… తర్వాత టార్గెట్ ను ఖరారు చేసుకున్నారు. అదే ఆదిత్య మిషన్. అంటే సూర్యుడి మీద ల్యాండ్ అవడం. కానీ చంద్రుడు అంటే చల్లగా ఉంటాడు….సూర్యుడంటే మండిపోతూంటాడు.. అది సాధ్యమా అనే సందేహాలు చాలా కాలంగా ఉన్నారు. ఆ వేడిమికి ఏదీ ఉండలేదని అన్నీ కరిగిపోతాయని మనం అనుకుంటూ ఉంటాయి. అందులో నిజం ఎంత ఉంది ? ప్రతీ దానికి ఓ పరిష్కార మార్గం ఉన్నట్లుగా ఆదిత్యుడ్ని చేరుకోవడానికి ఓ మార్గం ఉంటుందా ? ఇస్రో దగ్గర ఉన్న ప్రణాళికలేమిటి?
చంద్రయాన్ త్రీ సక్సెస్ తర్వాత అంతరిక్ష వ్యవహారాల్లో ప్రపంచం మొత్తం మన వైపు చూస్తోంది. అమెరికా వంటి అగ్రరాజ్యాలు సైతం చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలూన లేకపోయాయి. అంతటి మహత్తర మైన ఘనత మన ఇస్రోకే దక్కింది. యూరప్ స్పేస్ ఏజెన్సీ సహా పలు అంత ర్జాతీయ సంస్థలు ఇస్రోని ప్రశంసించాయి. ఇప్పుడు వారెవరూ ఊహించని విధంగా సూర్యుడిపై అడుగు పెట్టాలని ఇస్రో ప్రణాళికలు రెడీ చేస్తోంది. దాన్ని అందుకోవడం కష్టసాధ్యమే కానీ అసాధ్యం కాదు.
సూర్యుడిపై ప్రయోగాలు చేయాలన్న ఆకాంక్ష ఎప్పటి నుంచో ఉంది. చంద్రయాన్-3 విజయంతో లభించిన స్ఫూర్తితో ఆదిత్య మిషన్‌ను ప్రారంభించేందు కు ఇస్రో ఆలోచనలకు కార్యరూపం ఇవ్వనున్నది. ఇస్రో తన మొదటి సన్ మిషన్‌ను సెప్టెంబర్ 2న ప్రారంభించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మిషన్ ఆదిత్య ఎల్1 ప్రయోగం జరగనుంది. చంద్రయాన్-3 విజయం తర్వాత ఇస్రోకు ఆదిత్య ఎల్1 చాలా ముఖ్యమైనది. ISRO చేపట్టిన మొదటి సన్ మిషన్ సహజంగానే చాలా క్లిష్టమైనదే. ఆదిత్య ఎల్. వన్ సూర్యుని నుంచి వెలువడే మండే వేడిని ఎదుర్కోవలసి ఉంటుంది. సూర్యుని నుండి వెలువడే ప్రమాదకరమైన రేడియేషన్లను నివారించాలి. దీంతో పాటు సోలార్ తుపానును కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆదిత్య చాలా వేడి, ప్రమాదకరమైన రేడియేషన్ నుండి తప్పించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆదిత్య-ఎల్1లో 7 పేలోడ్‌లు అంటే ప్రత్యేక పరికరాలు ఉంటాయి. ఈ పరికరాలు సూర్యకిరణాలను వివిధ మార్గాల్లో పరీక్షిస్తాయి. సౌర తుపానులకు సంబంధించిన లెక్కలు చేస్తాయి. ఇందులో హెచ్‌డీ కెమెరాలను కూడా అమర్చనున్నారు. ఇతర డేటాతో పాటు సూర్యుని, అధిక రిజల్యూషన్ చిత్రాలను పొందుతారు ఇస్రో శాస్త్రవేత్తలు ఈ డేటాను తరువాత అధ్యయనం చేస్తారు. చంద్రయాన్-3 కింద విక్రమ్ ల్యాండింగ్ చేసిన 10 రోజుల్లోనే ఇంత భారీ మిషన్‌ను ప్రారంభించడం సవాలుతో కూడుకున్న పని, దీని కోసం ఇస్రో సన్నాహాలు పూర్తయ్యాయి. నిజానికి ఇది ఇప్పటికిప్పుడు అనుకున్న ప్రాజెక్ట్ కాదు. 2008 నుంచి ఆదిత్య మిషన్ పై వర్క్ చేస్తున్నారు. 2016లో తొలిసారిగా ప్రయోగాత్మకంగా రూ.3 కోట్ల బడ్జెట్ ఇచ్చారు. దీని తరువాత, 2019 లో, ఆదిత్య L1 కోసం 378 కోట్ల రూపాయల బడ్జెట్ విడుదల చేశారు. మొత్తం మీద ఆదిత్య ఎల్1 మిషన్ కోసం మొత్తం .456 కోట్లు ఖర్చు చేశారు. అంటే చాలా బాలీవుడ్ చిత్రాల కంటే ఆదిత్య ఎల్-1 బడ్జెట్ తక్కువ.
నిజానికి అమెరికా కూడా సూర్యుడి మీదకు చేరేందుకు చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. సోలార్ మిషన్లను పంపడంలో అమెరికా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది.. ఇప్పటివరకు 23 సోలార్ మిషన్లను పంపింది. 1994లో, NASA యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి మొదటి సౌర మిషన్‌ను పంపాయి. నాసా పార్కర్ సోలార్ ప్రోబ్ అనే మిషన్ సూర్యుని చుట్టూ 26 సార్లు ప్రయాణించింది. నాసా సోలార్ మిషన్ పై పనిచేస్తోంది. 2018లో, నాసా సూర్య మిషన్ పార్కర్ సోలార్ ప్రోని ప్రారంభించింది. నాసా ప్రయోగింప బోయే ఆదిత్య మిషన్ 2028 వరకు సూర్యుడిని అధ్యయనం చేస్తుంది.
ఇస్రోకు అమెరికా లేదా ఇతర యూరప్ ప్రభుత్వాలు కేటాయించినంతగా నిధులు కేటాయించవు. కానీ శాస్త్రవేత్తలు దాన్నో లోపంగా .. కష్టంగా భావించడం లేదు.
తరతరాలుగా మనకు ప్రత్యక్ష దైవాలు సూర్య చంద్రులు. వారి నుంచి పొందే కాంతి, వేడిమి, చల్లదనం మనిషి మనుగడకు ఆధారం అవుతోంది. అటువంటి ప్రత్యక్ష దైవాల వద్ద ఇంకా ఏమేమి శక్తులున్నాయో వాటిని పొందాలనే తహతహ మనుషుల్లో ఉండటం సహజం. సూర్యరశ్మి వల్ల మనం పొందుతున్న ప్రయోజ నాలను గురించి మాటల్లో వర్ణించలేం. సౌరశక్తి వల్ల మన ఇంధనం ఖర్చు చాలా వరకూ ఆదా అవుతోంది. సూర్య కిరణాల ప్రభావంతో ఇప్పటికే ఎన్నోరోగాలను నయం చేయగలుగుతున్నారు మన వైద్యులు. పూర్వ కాలం నుంచి సూర్యుణ్ణి మన పెద్దలు ఆరోగ్య ప్రదాతగా అభివర్ణిస్తూ వస్తున్నారు. సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తే సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని మన పెద్దలు పాటించి చూపిన సంప్రదాయం. అందుకే ఆదిత్య మిషన్.. మనకు అత్యంత పవిత్రమైనదని అనుకోవచ్చు.
ప్రైవేటు సంస్థల ద్వారా వాహక నౌకలు, క్రయోజ నిక్ ఇంజన్ల తయారీని ఇస్రో ప్రోత్సహిస్తోంది.అంతరిక్ష విజ్ఞానంలో కొత్త శకానికి నాంది పలుకుతోంది.అంతరిక్ష రంగంలో మనదేశం ఇప్పటికే అగ్రదేశాలతో సమానంగా ప్రయో గాలను విజయవంతం చేస్తోంది. చంద్రయాన్-3 తో ఇస్రో ఘనకీర్తిని సాధించి పెట్టడంతో వాణిజ్యపరంగా మన దేశం నుంచి ఉపగ్రహాలను ప్రయోగించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ కారణంగా ప్రభుత్వాలు వేల కోట్లతో నిధులు కేటాయించలేకపోయినా ఇస్రో సొంతంగా ఆదిత్యమిషన్ కు అవసరమైన నిధులను వాణిజ్య పద్దతిలో సమకూర్చుకునే అకాశం ఉంటుంది.
చంద్రయాన్-3 మిషన్ విజయవంతం కావడంతో మన సాంకేతిక సామర్ధ్యం, వ్యోమనౌక నాణ్యత అంత ర్జాతీయ ప్రమాణాలను అందుకున్నాయి. మన శాస్త్రవేత్త లు డబ్బు,పేరు, ప్రతిష్టల కోసం కాకుండా దేశానికి మంచి పేరు తేవాలన్న ఆకాంక్షతోనే పగలు,రాత్రి తేడా లేకుండా కష్టించి పనిచేశారు. చేస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిపుణులు, శాస్త్రవేత్తల వేతనాలతో పోలిస్తే మన వారి వేతనాలు తక్కువే. అయినప్పటికీ, వారెప్పుడూ అలాంటి లెక్కలు వేసుకోలేదు. ఇతర దేశా ల్లో కన్నా 50 నుంచి 60 శాతం తక్కువ ఖర్చుతోనే ఇస్రో రాకెట్లను ప్రయోగిస్తోంది. కానీ ఎప్పుడూ ఈ కారణంగా ఫెయిలైన దాఖలాలు లేవు. ఆదిత్య మిషన్ ద్వారా… సూర్యూడ్నీ అందుకుంటే.. భారత్ అంతరిక్షాన్ని జయించినట్లే అనుకోవచ్చు.
పెద్ద కలలు కనండి వాటిని సాధించేందుకు ప్రయత్నించండి అని కలాం అన్నారు. అందుకే మన సామర్థ్యాన్నికి తగ్గట్లుగా ఎంత పెద్ద కలలు కన్నా అవి ఎప్పటికైనా నిజమవుతాయి. చంద్రయాన్ లాగే ఆదిత్య మిషన్ కూడా సక్సెస్ అవుతుందని ఆశిద్దాం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…