వారసత్వ పన్నుకు ఓటేస్తారా

By KTV Telugu On 10 May, 2024
image

KTV TELUGU :-

దేశంలో ఇప్పుడు వారసత్వ పన్నుపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ వస్తే వారసత్వ పన్ను వేస్తామని చెబుతోందని.. తాళిబొట్లను కూడా లాక్కుంటారని మోదీ ఆరోపిస్తున్నారు. కానీ తాము అలా చేస్తామని చెప్పలేదని కాంగ్రెస్ ఎంటోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సిద్ధాంతకర్తగా భావించే శామ్ పిట్రోడా అనే పెద్ద మనిషి అమెరికాలో వారసత్వ పన్ను ఉందని మన దగ్గర కూడా విధించవచ్చని ఆయన చెబుతున్నారు. ఈ విషయాన్ని బీజేపీ మరింత అడ్వాంటేజ్ తీసుకుంది. అందుకే వారసత్వ పన్నుపై ఇప్పుడు విస్తృత చర్చ జరుగుతోంది.

భారత ప్రజలకు వారసత్వ పన్ను, సంపద పన్ను అనేది కొత్తగా వినిపించే పదం. కానీ ఇది భారత్ లో చాలా కాలం కిందటే అమలయింది.  ఎస్టేట్ డ్యూటీ యాక్ట్ 1953 చాలాకాలం అమలైంది. అయితే, 1985లో అప్పటి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేసింది. పన్ను వసూళ్లకంటే, వారసుల నుంచి వసూలు చేయడానికి అయ్యే ఖర్చులు, కోర్టు లిటిగేషన్ల చికాకుల నేపథ్యంలో ఈ చట్టాన్ని రద్దు చేశారు.  తల్లిదండ్రులు, ఇతరత్రా బంధువుల మరణానంతరం వారసత్వంగా పొందే ఆస్తులపై విధించే పన్నును ‘ఎస్టేట్ డ్యూటీ’ గా వ్యవహరించేవారు. చట్ట ప్రకారం అప్పటి విలువ ప్రకారం ఒకటిన్నర లక్షల రూపాయలకు మించిన ఆస్తులను వారసత్వంగా పొందినట్లయితే ఈ ట్యాక్స్ చెల్లించాల్సిందే. ఓ వ్యక్తి మరణించినపుడు అతడి పేరు మీద ఉన్న ఆస్తుల విలువను మధించి  ఆ విలువ రూ.1.5 లక్షలకు పైన ఉంటే ఆస్తి విలువలో 7.5 శాతం పన్ను కింద అధికారులు వసూలు చేసేవారు. అయితే, చట్టంలోని పలు లొసుగులను వాడుకుంటూ చాలామంది పన్ను ఎగవేతకు పాల్పడేవారని ఆరోపణలు వచ్చాయి. పన్ను వసూళ్లకు అనేక లిటిగేషన్లు ఎదురవడంతో ఖర్చు పెరిగిపోయేది. తీరా చూస్తే వసూలైన సొమ్ముకంటే ప్రభుత్వానికయ్యే ఖర్చే ఎక్కువైందని తేలేది. ఈ ట్యాక్స్ తో ప్రభుత్వానికి సమకూరే మొత్తం చాలా తక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఎస్టేట్ డ్యూటీని రద్దు చేసింది.

అమెరికాలో వారసత్వ పన్ను చట్టం ఇప్పటికీ అమలులో ఉంది. దీని ప్రకారం.. ఆ దేశంలో ఎవరైనా 100 మిలియన్‌ డాలర్ల ఆస్తి సంపాదిస్తే.. అతడి మరణానంతరం ఆ ఆస్తిలో 55 శాతం ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది.  45 శాతం మాత్రమే అతడి వారసులకు చెందుతుంది. ఇది చాలా ఆసక్తికరమైన చట్టం. సంపాదించిన ఆస్తిలో సగానికిపైగా సమాజం కోసం వదులుకోవాలని ఈ చట్టం చెబుతుంది. సంపాదించిన వ్యక్తికే ఈ ఆస్తి మొత్తం చెందదు. అయితే ఇది అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అమలవుతోంది. ఈ చట్టాన్ని ఇండియాలో అమలు చేయడంపై  సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన శామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు  దుమారం రేపాయి. సంపద సమానంగా పంపిణీ పేరుతో మేనిఫెస్టోలో కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలూ దీనికి ఆజ్యం పోశాయి.

నిజానికి మోదీ ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచన చేసింది. అమెరికా, యూకేల్లో వారసత్వ పన్ను కొనసాగుతున్నట్టే, భారత్‌లోనూ ఈ తరహా పన్నును విధిస్తే బాగుంటుందని 2017లో మోదీ ప్రభుత్వం యోచించింది. రూ.50 వేల కంటే ఎక్కువ విలువైన ఆస్తులు, సొమ్ము వారసత్వంగా సంక్రమించినైట్లెతే, ఆ సొత్తును ‘ఇతర మార్గాల ద్వారా లభించిన ఆదాయం’ కింద పరిగణించాలని భావించింది. దీనిపై వారసత్వ పన్ను విధించాలని అప్పటి ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ ప్రతిపాదించారు. ఈ మేరకు చట్టంలో సవరణలు, ఇతరత్రా మార్గదర్శకాల కోసం మోదీ ప్రభుత్వం విధివిధానాలను కూడా రూపొందించింది.  లిండియా ఫెడరేషన్‌ ఆఫ్‌ ట్యాక్స్‌ ప్రాక్టిషనర్స్‌, హక్కుల కార్యకర్తలు, మేధావులు బీజేపీ సర్కారు నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ‘వారసత్వ పన్ను’ ఆలోచనను విరమించుకోవాలని, లేకపోతే దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. దీంతో మోదీ సర్కారు ఆ యోచనను విరమించుకొన్నది.

నిజానికి ఈ వారసత్వ పన్నుపై పూర్తి స్థాయిలో వ్యతిరేకత లేదు. అమలు చేయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి.  వంద కోట్లకుపైబడి ఆస్తులున్న వారికి అమలు చేస్తే మంచిదన్న వాదన కూడా కొన్ని వర్గాల నుంచి వస్తుంది.  ఆదాయాల మీద గాని, సంపన్నులు చేసే వ్యయాల మీద గాని, వారివద్ద ఉన్న సంపద మీద గాని, కంపెనీల షేర్ల రూపంలో ఉన్న సంపద మీద గాని, లేదా వారసత్వంగా సంక్రమించిన సంపద మీద గాని పన్నులు విధించవచ్చని అంటున్నారు. దీని వల్ల దేశానికి అవసరమైన మౌలిక సదుపాయాలు ఇతర ప్రజల అవసరాలు తీర్చవచ్చన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే భారత్ కు ఈ విధానం సరిపోతుందా అనేదానిపై అనేక అనుమానాలు ఉన్నాయి.  ఆసక్తికర చట్టమే అయినా.. దీని అమలును అడ్డుకునేది మొదట రాజకీయ నాయకులే అని పేర్కొంటున్నారు. అలాంటి చట్టం అమలు చేస్తే మొదట నష్టపోయేది రాజకీయ నాయకులు, సంపన్నులే. పేద మధ్య తరగతి కుటుంబాలపైనా ప్రభావం ఉన్నప్పటికి అధిక మొత్తంలో సంపదను సమాజం కోసం వదులుకోవాల్సింది మాత్రం రాజకీయ నేతలు, ఆ పార్టీలకు విరాళాలు ఇచ్చే పారిశ్రామిక వేత్తలు, సంపన్నులు అవుతారు. ఇక సామాన్యులు, పేదలు ఈచట్టం కిందకు రారు. అయినా ఎన్నికల సమయం కాబట్టి, ఈ అంశాన్ని సైతం బీజేపీ .ఎన్నికలప్రచారాస్త్రం చేసేసింది.

పన్ను అనే మాట వినిపిస్తే  భారత ప్రజలు భయపడిపోతారు.  ఎందుకంటే మన దేశంలో టాక్స్ టెర్రరిజం ఆ స్థాయిలో ఉంది. ఒక మనిషి సంపాదనలో 40 శాతం టాక్స్ కింద వివిధ పద్దతుల ద్వారా చెల్లిస్తున్నారు. ఈ భయాన్ని ఆసరా చేసుకుని మోదీ రాజకీయం చేస్తున్నారు.  కాంగ్రెస్ టెన్షన్ పడుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి