నాగచైతన్య, శోభితకు లేని సమస్య మీకెందుకు..

By KTV Telugu On 30 August, 2024
image

KTV TELUGU :-

ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. వేణు స్వామిపై మహిళా కమిషన్‌కు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ ఫిర్యాదు చేయగా.. వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఆ నోటీసులను సవాలు చేస్తూ వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించగా.. ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ క్రమంలో.. అటు మహిళా కమిషన్‌ మీద.. ఇటు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం గమనార్హం.

రాజకీయ, సినీ ప్రముఖుల జాతకాలు చెప్తూ సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన.. ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి.. కొన్ని రోజులుగా వివాదాలతో వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. గతంలో సమంత- నాగచైతన్య వివాహ బంధం గురించి చెప్పి ఎలా ఫేమస్ అయ్యాడో.. ఇప్పుడు నాగచైతన్య- శోభితా దూళిపాళ జాతకం చెప్పి అదే స్థాయిలో వివాదాల్లో ఇరుక్కున్నాడు. నాగచైతన్య ఎంగేజ్మెంట్  తర్వాత.. ఆ జంట ప్రయాణం గురించి అనుచిత వ్యాఖ్యలు చేయటంతో.. వివాదాలన్నీ ఒక్కసారిగా ఆయణ్ని చుట్టుముట్టాయి. ముఖ్యంగా వేణు స్వామిపై ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్.. మహిళా కమిషన్‌‍కు ఫిర్యాదు కూడా చేసింది.

నాగ చైతన్య- శోభిత ధూళిపాళ గురించి, వాళ్ల వివాహ బంధం గురించి చేసిన వ్యాఖ్యలపై ఫిలిం జర్నలిస్టులు ఫిర్యాదు చేయగా.. స్పందించిన మహిళా కమిషన్.. వివరణ కోరుతూ వేణుస్వామికి నోటీసులు జారీ చేసింది. అయితే ఈ నోటీసులపై వేణుస్వామి హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. వేణుస్వామి పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. కీలక వ్యాఖ్యలు చేయటం గమనార్హం. వేణుస్వామిపై మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసులు చెల్లవంటూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పైగా వేణు స్వామికి నోటీసులు ఇవ్వడంపై మహిళా కమిషన్‌పై హైకోర్టు సీరియస్ కూడా అయ్యిందని సమాచారం.

ఇదిలా ఉంటే.. మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసిన ఫిలిం జర్నలిస్టులకు గట్టిగానే మొట్టికాయలు వేసింది తెలంగాణ హైకోర్టు. ‘నాగచైతన్య-శోభితా దూళిపాలకు లేని సమస్య మీకెందుకు..?’ అంటూ ఫిలిం జర్నలిస్టులు, మహిళా కమిషన్‌పై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో.. వేణుస్వామికి ఈ విషయంలో భారీ ఊరట లభించినట్టయింది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి