భారత దేశంలో ధనవంతులు పెరిగి పోతున్నారు ఇది సంతోషించదగ్గ విషయమే అయినా పేదవారు పేదవారుగానే ఉండిపోయి , కనీసం తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితిలో కొంతమంది ఉంటున్నారు. వారి స్థితిగతులను మార్చడానికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు ప్రభుత్వం ఎన్నో పథకాలను అందిస్తుంది. అందులో భాగంగా పేదలు ఆకలితో బాధపడకూడదని ,ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వం రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తుంది. తెలంగాణలో ప్రతినెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున డీలర్ల ద్వారా బియ్యాన్ని అందిస్తారు. అయితే సన్నబియ్యానికి అలవాటుపడిన చాలా మంది రేషన్ బియ్యాన్ని తినకుండా . బ్లాక్ మార్కెట్లో కిలో 10 రూ .లేదా అంతకంటే తక్కువకే విక్రయిస్తున్నారు.
అయితే రేషన్ బియ్యంలో ఉండే పోషకాల గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే ఆ బియ్యంలో అన్ని రకాల పోషకాలు విటమిన్లు కలిపి పంపిణీ చేస్తున్నారు. ఈ విషయాన్ని జాతీయ పోషకాహార సంస్థ (NIN)మరోసారి స్పష్టం చేసింది.
ఆహార భద్రత నుంచి, పోషకాహార భద్రత కూడా కల్పించాలన్న లక్ష్యంతో పేదలకు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ఫోర్టిఫైడ్ బియ్యాన్ని రేషన్ డీలర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. చిన్నారులు, యువత, గర్భిణుల్లో వరుసగా 67శాతం, 57శాతం, 52శాతం రక్తహీనత ఉన్నట్టు జాతీయ కుటుంబ సర్వే నివేదిక తెలపింది. ఆ సమస్యను ఫోర్టిఫైడ్ బియ్యంతో అధిగమించొచ్చని ఎన్ఐఎన్ తెలిపింది. ఎన్ఐఎన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత నేతృత్వంలో శాస్త్రవేత్తల బృందం ఈ మేరకు ఓ రీసెర్చ్ పత్రాన్ని ఇటీవల విడుదల చేసింది. మహిళలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, పురుషులు తీసుకునే మొత్తం ఆహారంలో ఐరన్ వరుసగా 13 మిల్లీగ్రాములు, 13.23 మిల్లీగ్రాములు, 14.35 మిల్లీగ్రాములు, 15.19 మిల్లీగ్రాములు గ్రహిస్తున్నట్లు నివేదికలో తేల్చింది.
పోషక విలువలు పెంచేందుకు కృత్రిమ విటమిన్లు కలిపి ఆహారాన్ని బలవర్థకం చేయడాన్నే ఫోర్టిఫైడ్ అంటారు. ఈ విధానంలో బియ్యాన్ని పిండిగా మార్చి.. దానికి ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి-12 వంటి విటమిన్లు, పోషకాలు కలిపి ఆ పిండిని బియ్యం రూపంలో కెన్నెల్స్ గా మార్చుతారు. ప్రతి 99 కిలోల రేషన్ బియ్యానికి ఒక కిలో ఫోర్టిఫైడ్ బియ్యం కెన్నెల్స్ కలుపుతారు. సంచులో నింపి వాటిని ఎఫ్‌సీఐల్లో భద్రపరిచి రేషన్ దుకాణాలకు తరలిస్తారు. govt riceRation riceఈ బియ్యాన్ని తింటే విటమిన్లు అందటమే కాకుండా రక్తహీనత బారినపడకుండా ఉండొచ్చు.
28 నుంచి 42.5 మిల్లీగ్రాముల వరకు ఐరన్ (ఫెర్రిక్ పైరోపాస్పేట్) ఫోర్టిఫైడ్ బియ్యంలో కలుపుతారు. లేదా దీనికి బదులుగా సోడియం ఐరన్ 14-25.25 మి.గ్రాముల మేర మిక్స్ చేస్తారు. 75 -125 మి.గ్రా వరకు ఫోలిక్‌యాసిడ్ రేషన్ బియ్యంలో కలుపుతారు. దీంతోపాటు విటమిన్ బి12 కోసం హైడ్రాక్సైకోబాలమైన్ను ఇంతే మొత్తంలో మిక్స్ చేస్తారు. అదనంగా జింక్, విటమిన్ A, థయమిన్, రైబోప్లావిన్, నియాసిన్, విటమిన్ B6 పోషకాలు కలుపుతారు.
ఇలా ప్రాసెస్ చెసిన రేషన్ బియ్యాన్ని ఆహారంగా తీసుకోవడం వల్ల మహిళల్లో రక్తహీనత సమస్య తగ్గుతుంది.చిన్నపిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకోసమే వీటిని హాస్టళ్లు, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాల్లో పంపిణీ చేస్తున్నట్లు ఎన్ఐఎన్ వెల్లడించింది. ఈ విషయo తెలిసిన తర్వాత నుండైనా రేషన్ బియ్యాన్ని వాడుకోవాలని చెప్తున్నారు.
ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎంతో ఖర్చు చేసి ఇస్తున్న ఈ బియ్యాన్ని ప్రజలు దుర్వినియోగం చేయకూడదు ప్రతి ఒక్కరూ మేము 10 కిలోలే కదా అమ్ముతున్నాము అనుకుంటున్నారు . కానీ రేషన్ డీలర్ నుండి ప్రజల వద్దకు వచ్చిన బియ్యం బ్లాక్ మార్కెట్ కి తరలిపోతుంది అక్కడినుండి బార్డర్లు కూడా దాటి వెళుతున్న వాహనాలను ఎన్నోసార్లు ప్రభుత్వాధికారులు పట్టుకుని సీజ్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి రేషన్ బియ్యం అవసరం ఉంటేనే తీసుకోవాలి. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం అయ్యేలా చూడాలి..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…