అరుణ్ జైట్లీ పోయి నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎన్డీయే ఆర్థిక విధానాలపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. విత్త సచీవులు అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని కూడా జనమూ, విపక్షాలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. తాజాగా తమిళనాడులో జరిగిన ఒక సంఘటన ఆగ్నికి ఆజ్యం పోసినట్లయ్యింది. అక్కడ ఒక వ్యాపారి చేత నిర్మలమ్మ సారీ చెప్పించుకున్న తీరుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చెన్నైలో ఇటీవల హోటల్ ఓనర్లతో కేంద్రప్రభుత్వం సమావేశం ఏర్పాటుచేసింది. అందులో పాల్గొన్న శ్రీ అన్నపూర్ణ రెస్టారెంట్ యజమాని శ్రీనివాసన్ ….దేశంలో పెరుగుతున్న జీఎస్టీపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ప్రశ్నించారు. జీఎస్టీలో ఉన్న లోటుపాట్లను వివరించారు. తర్వాత ఏం జరిగిందో తెలీదుకానీ ఒక ప్రైవేటు కార్యక్రమంలో నిర్మలమ్మను కలిసి క్షమాపణ చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను చింతిస్తున్నట్లు ప్రకటించి, తాను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని వివరణ ఇచ్చుకున్నారు. ఈ వీడియోను బీజేపీ తమిళనాడు శాఖ అధికారిక హ్యాండిల్ లో పోస్ట్ చేయడంతో విపక్షాలన్నీ తప్పుపడుతున్నాయి. హోటల్ ఓనర్ చేత బలవంతంగా క్షమాపణ చెప్పించారని ఆరోపిస్తున్నాయి. హోటల్ ఓనర్ చేత క్షమాపణ చెప్పించడం సిగ్గుచేటైన చర్య అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. నిర్మలా సీతారామన్ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దానితో దిద్దుబాటు చర్యగా బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై క్షమాపణ చెప్పి.. పొరపాటున వీడియోను పబ్లిక్ డొమైన్లో పెట్టామని వివరణ ఇచ్చుకున్నారు..
గత ఐదేళ్లలో బీజేపీ ఆర్థిక విధానాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూనే ఉన్నాయి. అన్ని రకాల పన్నుల పెంచుతున్నారని, అదేమని అడిగితే నిర్మలమ్మ అహంకారపూరితంగా సమాధానం చెబుతున్నారని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కొందరైతే ఆర్థిక వ్యవహారాలు తెలియని ఆర్థిక మంత్రి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఆర్థిక విధానాలు తెలియని ఆర్థికవేత్త అంటూ కొందరు సెటైర్లు కూడా వేస్తున్నారు. మంత్రిపదవిని చేపట్టిన వెంటనే ఫారిన్ ఈక్విటీ ఇన్వెస్టర్లపై పన్ను విధించడం.. విమర్శలు రావడంతో ఉపసంహరించుకోవడం చూస్తే ఆమె పరిపక్వతలేని ఆర్థిక మంత్రి అయి ఉంటారని కొందరు అప్పుడే విమర్శించారు. కొన్ని వస్తువుల ఉత్పత్తులపై పన్ను విధించి.. మూడు వారాల్లోనే ఉపసంహరించుకోవడంతో కొందరు ఆమెదీ తుగ్లక్ పాలన అంటూ కూడా విమర్శించారు. ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేయడంలోనూ, అధికారుల దూకుడును నియంత్రించడంలోనూ ఆమె విఫలమయ్యారని ఆరోపించేవారూ ఉన్నారు.
బ్యాంకింగ్ రంగంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కూడా ప్రజలకు రుచించలేదు. జనం దాచుకునే డబ్బుకు వడ్డీ రేట్లు తగ్గించి, జనం తీసుకునే అప్పులకు మాత్రం భారీగా పెంచేయ్యడం నిర్మలమ్మకే చెల్లిందని చెప్పాల్సి ఉంటుంది. ఉద్యోగుల భవిష్య నిధి అయిన ఈపీఎఫ్ పై వడ్డీ రేటును 8 పాయింట్ ఎనిమిది నుంచి ఎనిమిది పాయింటే ఐదు శాతానికి తగ్గించారు. పీపీఎఫ్ మీద వడ్డీ రేటును 8 పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ ఒక శాతానికి దిగ్గొట్టారు. ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 7.5 శాతం నుంచి దాదాపు 4.5 శాతానికి పడేశారు. సేవింగ్స్ ఖాతాల్లో వడ్డీ రేటును 4 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించారు. వచ్చే ఏడాది అది 3 శాతానికి పరిమితమవుతుంది. ఆదాయపన్ను విషయంలో కొత్త స్లాబులంటూ ఫెయిల్యూర్ స్కీమును ఆమె ప్రవేశపెట్టారు. దానిలోకి వెళ్లిన వారికి అదనంగా లక్ష రూపాయల వరకు పన్ను చెల్లించాల్సి వస్తుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…