పద్మ విభూషణ్ చిరంజీవి. పద్మశ్రీ, పద్మ భూషణ్ తర్వాత ఇప్పుడు పద్మ విభూషణ్ కూడా అయ్యారు. చెప్పుకోవడానికి సాధారణంగా ఉంటుంది. కానీ ఈ ఘనత సాధించడం వెనుక అపారమైన కృషి ఉంది. కఠోరమైన శ్రమ ఉంది. అంతా కలిస్తే చిరంజీవి అవుతారు. చిరంజీవి నేటి యువతరానికి స్ఫూర్తి.
దేశ రెండో అత్యున్నత పురస్కారం అయిన పద్మ విభూషణ్‌ను చిరంజీవికి ప్రకటిస్తారని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. అది నిజమైంది. అందరూ ఆ పురస్కారానికి చిరంజీవి అర్హుడేనని అంటారు తప్ప ఒక్కరూ ప్రశ్నించరు. ఎందుకంటే ఆయన సాధించినది ఎవరూ అందుకోనంత ఉంటుంది మరి. ఆయన స్ఫూర్తి యువతలో జ్వలలా రగులుతూ ఉంటుంది. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్వయంకృషితో పైకొచ్చిన హీరో చిరంజీవి. కష్టం, అంకితభావం, చేసే పనిని దైవంగా భావించే గుణం.. ఆయన్ని సక్సెస్ బాటలు నిలిపాయి. కోట్లాదిమంది అభిమానుల ఆదరణ, ప్రేమాభిమానాలు ఆయన సొంతం. హిట్‌ఫ్లాప్‌లతో సంబంధిం లేని స్టార్‌డమ్ ఆయనది. ఎదిగేకొద్దీ ఒదిగి ఉండాలనేది ఆయన ఫార్ములా.. ఆ ఫార్ములాను తూచ తప్పకుండా పాటిస్తారు. అదే టాలీవుడ్‌కి మెగాస్టార్‌గా నిలబెట్టాయి. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమకు రారాజుగా నిలిచారు.
ప్రాణం ఖరీదు’ చిత్రంతో 1978లో ప్రారంభించిన చిరంజీవి జైత్రయాత్ర 2006లో పద్మభూషణ్ పురస్కారంతో శిఖరాగ్రానికి చేరింది. ఇప్పుడు ో2023లో పద్మవిభూషణ్ వచ్చి చేరింది.
ప్రజాభిమానాన్ని మించిన అవార్డు లేదని చిరు నమ్ముతారు. ‘స్వయంకృషి, అపద్బాంధవుడు’ ఇంద్ర చిత్రాలకు గానూ ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నారు. రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు. చిరు ఖాతాలో ఎనిమిది ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, ఒక లైఫ్‌టైమ్ ఎఛీవ్‌మెంట్ అవార్డు ఉన్నాయి. ఇన్నిసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్న ఏకైక స్టార్ హీరోగా చిరంజీవి గుర్తింపు పొందారు. ఆఫ్‌బీట్ చిత్రాల్లో నటించే నాన్ రెగ్యులర్ ఆర్టిస్ట్‌లకు మాత్రమే ఇలాంటి అవార్డులు వస్తాయనే అభిప్రాయం అప్పట్లో ఉండేది. అలాంటివి ఓ ప్రాంతీయ భాషలో నంబర్‌వన్ స్టార్‌గా ఎదుగుతున్న హై ఓల్టేజ్ కమర్షియల్ స్టార్‌కు ఎనిమిదిసార్లు ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది.
మదర్ థెరిసా స్ఫూర్తితో చిరంజీవి నెలకొల్పిన స్వచ్ఛంద సేవా సంస్థ ‘చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్. తనని నంబర్‌వన్ స్టార్‌గా అక్కున చేర్చుకున్న తెలుగు వారికోసం ఏదో ఒకటి చేయాలన్న ఆలోచనతో పుట్టుకొచ్చినదే ఈ ట్రస్ట్. నా చుట్టూ ఉన్న యువతకు ‘నేనెందుకు స్ఫూర్తి కాకూడదు’ అన్న ఆలోచన మెగాస్టార్ స్ఫురించిన ఫలితమే రక్తనిధి, నేత్ర నిధి ఏర్పాటు. పంజాగుట్టలో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిరంజీవి ఐ అండ్ బ్లడ్‌బ్యాంక్ మొదలైంది. చిరంజీవి పిలుపుతో లక్షలాది మంది అభిమానులు రక్తదానం చేశారు. 1998లో అద్దె భవనంలో మొదలైన సీసీటీ 2006 కల్లా సొంత భవనం సమకూర్చుకుంది. అంధులకు వెలుగు తెప్పించే నేత్రాలయంగా, రక్తదానం చేసి ప్రాణాలు కాపాడే ప్రాణాలయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ సుమారు 10 వేల మందికిపైగా అంధుల జీవితాల్లో వెలుగు తెప్పించారు. లక్షల మంది పేద రోగులకు రక్తం అందించి ప్రాణదానం చేశారు. నటి రాష్ట్రపతి అబ్ధుల్ కలాం 2006 జూన్ 10న బ్లడ్‌బ్యాంక్‌ను సందర్శించి చిరంజీవిని ప్రశంసించారు. ఇక వ్యక్తిగతంగా కూడా చిరంజీవి చేసే గుప్తదానాలకు లెక్కలేదు. కుడి చేత్తో ఇచ్చిన దానం ఎడమ చేతికి తెలియకూడదన్న నియమాన్ని ఆయన పాటిస్తారు. చిత్ర పరిశ్రమలో బాధితులకు అండగా ఉంటారు. కష్టాల్లో ఉన్న అభిమానుల పాలిట ఆత్మీయుడిగా మెలుగుతారు. సొంత సంస్థల్లో పని చేసే సిబ్బందికి పెద్ద అన్నయ్యగా వ్యవహరిస్తారు.
చిరంజీవి చేసిన సినిమాల గురించి .. సినిమాల్లో ఆయన సాధించిన విజయాల గురించి చెప్పుకుంటే.. ఎంత చెప్పినా తీరదు. ఆయన సినీ రంగంలో సామాజిక సేవా రంగంలో చేసిన కృషి అనన్యా సామాన్యం. అయితే చిరంజీవి రాజకీయాల్లో మాత్రమే రాణించలేకపోయారు. తన వైఫల్యాన్ని ఆయన ఒప్పుకుని అంతే వేగంగా విరమించుకున్నారు. తనదైన సినిమాలు మళ్లీ చేసుకుంటున్నారు. చిరంజీవి ది గ్రేట్ అనిపించేలా ఆయన జీవన ప్రస్థానం ఉంది. ఇప్పుడు ఆయన పద్మ విభూషణ్.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…