లోక్ సభ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తెలంగాణ సర్కార్ ఉంటుందో ఉండదో చెప్పలేమని బీజేపీ నేతలు మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ అనూహ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న హర్యానాలో ఆ ప్రభుత్వం రిస్క్ లో పడిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు తంటాలు పడుతోంది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి ఏ మాత్రం ఎదురుగాలి వీచిని .. ఆ పార్టీ నుంచి చేజారిపోయే రాష్ట్రాల్లో మొదటగా హర్యానా ప్రభుత్వం ఉంనుంది.
తెలంగాణలో ప్రభుత్వ మనుగడపై బీజేపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్న సమయంలోనే హర్యానా లోని బీజేపీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ సైలెంట్ గా రిస్క్‌లో పెట్టేసింది. ఇప్పుడు హర్యానా బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో ఉంది. హర్యానా అసెంబ్లిలో మొత్తం సభ్యుల సంఖ్య 90 కాగా, బీజేపీ కూటమి బలం 39ర మాత్రమే. ముగ్గురు ఇండిపెండెంట్ల మద్దతు ఉప సంహరణతో అది ఇప్పుడు 36కి తగ్గింది. బీజేపీ తన బలా న్ని రుజువు చేసుకోవడానికి 45 మంది సభ్యులు అవస రం. ఇప్పటి వరకూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన మాజీ ఉపప్రధాని దేవీలాల్ మనవడు, జన నాయక్ జనతా పార్టీ అధ్యక్షుడు దుష్యంత్ చౌతాలా నేతృ త్వంలోని పార్టీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయదలిస్తే ఆ పార్టీకి తమ పార్టీ మద్దతు ఇస్తుందని దుష్యంత్ చౌతాలా ఇప్పటి కే ప్రకటించారు.
హర్యానాలో ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకోవడంతో బీజేపీ సీఎం నాయబ్‌సింగ్ సైనీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం మైనారిటీలో పడింది. ప్రభుత్వానికి బలం లేదనీ, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. లోక్‌సభ ఎన్నికల మధ్యలో ఈ పరిణామం బీజేపీని కల వర పరుస్తోంది. హర్యానాలో ఏడుగురు ఇండిపెండెంట్లు ఉన్నా రు. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఇండి పెండెంట్లు మంత్రి పదవులను ఆశించారు. ఇందుకు అధిష్టానం నుంచి అనుమతి లభించలేదు. దాంతో వారు సైనీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్నారు.
ఒకరిద్దరు సభ్యులతోనే ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగిన బీజేపీ తమ చేతిలోని ప్రభుత్వాన్ని పోగొట్టుకోదు. అందుకు ఎంతకైనా తెగిస్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్ట డం అంత సులభం కాదు, అందుకే కాంగ్రెస్ ఆ ప్రయ త్నాలు చేయడం లేదు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితిని గురించి గవర్నర్‌కి తెలియజేసింది. ఇటీవలి కాలం వరకూ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన మనోహర్ లాల్ కట్టార్ బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడేందుకు తెర వెనుక యత్నాలు సాగిస్తున్నారు. దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జయనాయక్ జనతా పార్టీని చీల్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన కృషి కొంతవరకూ ఫలించినట్టు కనిపిస్తోంది. చౌతాలా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కట్టార్‌ని కలుసుకుని చర్చలు జరిపారు. కాగా, తమ ప్రభుత్వానికి ఢోకా లేదని ముఖ్య మంత్రి నాయబ్ సింగ్ సైనీ స్పష్టం చేశారు.
గత నెలలోనే అసెంబ్లిలో బలపరీక్షలో నెగ్గాననీ, మరోసారి బలపరీక్షకు అవసరమైతే సిద్ధమేనని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటం వల్ల ఫిరాయింపు లపై దృష్టి పెట్టలేదు. కానీ, బీజేపీ తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతోంది. రాష్ట్ర శాసనసభలో ఏ పార్టీకి ఎంత బలం ఉందో తేల్చుకోవడానికి వెంటనే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ బండారు దత్తాత్రేయకు చౌతాలా లేఖ రాశారు. ఎన్నికలు తుది దశకు చేరుకున్నందున ఈ హడావుడిలో అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారా లేదా అనేది అనుమానాస్పదమే. గవర్నర్‌పై కేంద్రం నుంచి ఒత్తిడి ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా,అదేమీ లేదని బీజేపీ ఖండిస్తోంది.
ప్రభుత్వాన్ని కాపాడు కోవడానికి ఫిరాయింపులను ప్రోత్సహించడంలో బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. హర్యానాలో పార్టీ ఫిరాయింపుల రాజకీయాలు చాలా ఎక్కువే. దేవీలాల్, బన్సీలాల్, భజన్‌లాల్ వంటి హేమాహేమీల హయాంలోనూ ఎమ్మెల్యేలు పార్టీలను ఫిరాయించడం హర్యానాలో రికార్డు సృష్టించింది. ఇందిరాగాంధీ హయాంలో ముఖ్యమంత్రి భజన్‌లాల్ ఏకంగా మొత్తం జనతాపార్టీ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంగా మార్చేసి చరిత్ర సృష్టించారు. హర్యానా పేరు చెబితే పార్టీల ఫిరాయిం పులు గుర్తుకు వస్తాయి. మోడీ కేంద్రంలో ప్రధానిగా వచ్చిన తర్వాత రాజకీయ అస్థిరతకు తెరపడింది. మనోహర్ లాల్ కట్టర్ మోడీకి ఆర్‌ఎస్‌ఎస్‌లో సహచరు డు. రాష్ట్రంలో రాజకీయ బలం లేకపోయినా ఆయన అండతోనే ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు. ఎంపీ పదవికి పోటీ చేయించేందుకు ఆయనను మోడీయే రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారు. రాజకీయ అస్థిరత మళ్ళీ చోటు చేసుకుం టుుందేమోనని బీజేపీ ఆందోళన చెందుతోంది.అయితే, లోక్‌సభ ఎన్నికల తర్వాత మోడీఈ రాష్ట్రంపై దృష్టిని కేంద్రీకరించవచ్చని భావిస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ మూడో సారి తిరుగులేని బలంతో అధికారంలోకి వస్తే హర్యానాను కాపాడుకోవడం పెద్ద విషయం కాదు. కానీ బీజేపీకి ఎదురుదెబ్బ తగిలితే మాత్రం.. ఆ పార్టీ కోల్పోయే మొదటి రాష్ట్రం హర్యానా అవుతుంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…