రాబోయేది రాహుల్ శకం

By KTV Telugu On 19 June, 2024
image

KTV TELUGU :-

రాహుల్ గాంధీ వారసుడిగా వెనుకబడిపోయారు. కానీ రాజకీయనాయకుడిగా తెర ముందుకు వస్తున్నారు.  అందరి మన్ననలు అందుకుంటున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల ముందుకు వచ్చి ఐదేళ్లు తన పనితీరు చూపించబోతున్నారు. ఇప్పటికే పడిపోతున్న బీజేపీ గ్రాఫ్ ఆయనకు మరింత కలసి రానుంది. పదిహేనేళ్లు అధికారంలో ఉండే పార్టీపై ప్రజలకు ఖచ్చితంగా మొహం మెత్తుతుంది. ఒక్క చాన్స్ రాహుల్ కు ఇద్దామనకుంటారు. అందుకే రాబోయేది రాహుల్ శకమని అందరూ ఓ అభిప్రాయానికి వస్తున్నారు.

పదేళ్ల కింట కుదలైన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాస్త మంచి రోజులు వచ్చాయి.  తమకూ భవిష్యత్ ఉందన్న నమ్మకాన్ని ఈ ఎన్నికలు కలిగించాయి.  కాంగ్రెస్ కు గొప్పగా సీట్లేమి రాలేదు. వచ్చింది  99 ఎంపీ స్థానాలు మాత్రమే.  2014, 2019 సార్వత్రక ఎన్నికలలో కాంగ్రెస్ వరుసగా 44, 52 సీట్లు మాత్రమే సాధించింది.   ఈ సారి  ఆ పార్టీ అంత కంటే తక్కువ సీట్లు సాధిస్తుందన్న ఓ ప్రచారం ఉద్ధృతంగా సాగింది. చాలా ఎగ్టిట్ పోల్స్స్ అదే చెప్పాయి. కానీ ఫలితాలు వేరుగా ఉన్నాయి. హర్యానా నుంచి బిహార్ దాకా హిందీ రాష్ట్రాలలో ఆ పార్టీ సంఖ్యా బలం 5 నుంచి 23కి పెరిగింది. మహారాష్ట్రలో పోటీ చేసిన సీట్లను దాదాపుగా గెలుచుకున్నది. అన్ని నియోజకవర్గాలలోను భారీ మెజారిటీ సాధించింది. పంజాబ్లో బీజేపీకి ఒక్క సీటును కూడా దక్కనివ్వక పోవడంలో కాంగ్రెస్ సఫలమయింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఓట్ల వాటా 1.7 శాతం మేరకు పెరిగింది. ఇది అద్భుతమైన విజయం కాకపోవచ్చు కానీ భవిష్యత్‌పై నమ్మకం కలిగించేదే.

కాంగ్రెస్ ఓటములన్నింటికీ రాహుల్ గాంధీని బాధ్యుడ్ని చేస్తున్నట్లే ఈ విజయానికీ ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి.  భారత్ జోడో యాత్రతో ప్రారంభమైన కాంగ్రెస్ ఉత్సాహం  మెల్లగా పుంజుకునే దిశగా సాగుతోంది.  తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్లగా ఒక్క సరైన విజయం లేక.. ఎన్నో ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన పార్టీ అధికారం అందుకుంది.  2019 సార్వత్రక ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ సీట్ల సంఖ్యలో మూడో స్థానానికి పడిపోయింది. అంటే పుంజుకోవడానికి గట్టి పునాదులను రాహుల్ వేసినట్లే.  బీజేపీతో ముఖాముఖి పోరులో కాంగ్రెస్ ఎప్పుడూ వెనుకబడుతుందన్న అభఇప్రాయం ఉంది.  ఈ సారి 215 నియోజకవర్గాల్లో ముఖాముఖీ తలపడ్డాయి. అయితే కాంగ్రెస్ ఈ సారి వాటిలో 62 నియోజకవర్గాలను కైవసం చేసుకున్నది. బీజేపీ గెలిచిన సీట్లలో ఆ పార్టీకి మెజారిటీని గణనీయంగా తగ్గించడంలో కూడా కాంగ్రెస్ సఫలమయింది.

కాంగ్రెస్‌కు బలం మిత్రపక్షాలు. కాంగ్రెస్ కు 125 సీట్లు వస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. కానీ బీజేపీకి 240 నుంచి ఓ ఇరవై సీట్లు తగ్గి ఉంటే ఖచ్చితంగా  బీజేపీ  ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమే ఉండేది కాదు.ల కాంగ్రెస్ తమిళనాడు, మహారాష్ట్రలో మాత్రమే కాదు యూపీ, బిహార్, ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌లో కూడా ఇండియా కూటమిలోని తన భాగస్వామ్య పక్షాల విజయానికి సాయపడింది. ఆ పార్టీలన్నీ కాంగ్రెస్ వెనుకే ఉంటున్నాయి. ఎన్ని వేధింపులు ఎదురవుతున్నా… దారి మారడంలేదు.  ఇప్పుడు కాంగ్రెస్‌కు గొప్ప అవకాశం వచ్చింది. ఉపయోగించుకోవాలంటే.. కొన్ని సవాళ్లను అధిగమించాల్సి లఉంది.  గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్‌లలో కాంగ్రెస్ పరిస్థితిని తక్షణం మెరుగుపర్చుకోవాల్సి ఉంది.  ఢిల్లీలో ఇప్పటికీ కోలుకోలేకపోతోంది.  ఆమ్ ఆద్మీతో పొత్తు పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది.

ఈ లోపాలన్నింటినీ సవరించుకుని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. రాహుల్ గాందీ గతంలో  చేసిన రాజకీయం ఆయనపై నాన్ సీరియస్ పొలిటీషియన్ అన్న భావన కల్పించేదమో కానీ.. ఇటీవలి కాలంలో ఆయన బాగా యువత మద్దతు పొందుతున్నారు. ఆయన పోరాట పటిమ ఆకట్టుకుంటోంది. బహుశా మోదీ అదే పనిగా అధికారంలో ఉండటం వల్ల వస్తున్న వ్యతిరేకత కూడా దీనికి కారణం అయి ఉండవచ్చు.  కారణం ఏదైనా రాహుల్ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. తర్వాత రాజ్యం ఆయనదేనన్న భావనకు ఎక్కువ మంది వస్తున్నారు. దీన్ని నిలుపుకోగలిగితే చాలు.. మరోసారి దేశం కాంగ్రెస్ చేతుల్లోకి వెళ్తుంది.

మనది ప్రజాస్వామ్య  దేశం. ఒకే పార్టీ అధికారంలో ఉండటం అసాధ్యం. మారుతున్న ప్రజల ఆలోచనల ప్రకారం.. అధికార పార్టీ రెండో సారి గెలవడమే అసాధ్యంగా కనిపిస్తోంది. అందుకే బీజేపీకి ఇదే లాస్ట్ చాన్స్.. రాహుల్ కు రాబోయేది ఫస్ట్ చాన్స్ అన్న అభిప్రాయం అప్పుడే స్థిరపడుతోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి