ఎవరేమనుకుంటే నాకేంటీ – అదే రజనీ స్టైల్

By KTV Telugu On 23 August, 2023
image

KTV TELUGU :-

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఏ పని చేసినా కాంట్రవర్సీ క్రియేట్ అవుతోంది. ఎందుకంటే ఆయన సూపర్ స్టార్. ఆయన భావాలు అందరికీ నచ్చవు. ఐనా రజనీ ఎవ్వరినీ లెక్క చేయరు. నా దారి రహదారి అంటూ వెళ్లిపోతారు. జైలర్ సూపర్ సక్సెస్ అయిన తర్వాత కూడా అదే సీన్ .. యోగీకి పాదాభివందనం చేయడంతో తల్లెత్తిన వివాదాన్ని ఆయన పట్టించుకుంటారనుకుంటే పొరబాటే అవుతుంది.
రజనీ డైలాగ్ చాలా పవర్ ఫుల్, ఆయనకు వ్యతిరేకంగా వచ్చే కామెంట్స్ చాలా వీక్. కుక్కలు మొరుగుతాయ్ అన్న డైలాగ్ కంటే పవర్ ఫుల్ మాట ఏదైనా ఉంటుందా.. ఐనా జైలర్ సూపర్ సక్సెస్ అయ్యింది. పాన్ ఇండియా సినిమా 500 కోట్ల క్లబ్బు దాటిన తర్వాత ఎవరేమనుకుంటే ఏముంటుంది. ఎవరెన్ని విమర్శలు చేస్తే మాత్రం రజనీ సక్సెస్ ను ఆపలేరని తెలిసిన తర్వాత మాట్లాడి ప్రయోజనం ఏముంటింది. పైగా తమిళనాడులో ఆత్మగౌరవ నినాదాన్ని జనం మరిచిపోయి కూడా చాలా రోజులైంది..

రజనీకాంత్ తమిళ సూపర్ స్టారే అయినా ఇప్పుడు ఆయన చేసిన పని కారణంగా తమిళనాడులోనే విమర్శలు వస్తున్నాయి. ఇదెన్నా తలైవా ఇప్పిడి పండ్రింగ…. అంటే ఇదేంటి నాయకుడా ఇలా చేస్తున్నారు.. అంటూ కొందరు నిలదీసేందుకు ప్రయత్నిస్తున్నారు. జైలర్ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన సందర్భంగా రజనీకాంత్ ఆలిండియా ఆధ్యాత్మిక టూర్ పెట్టుకున్నారు . సాధు సంతులను కలుస్తున్నారు. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన లక్నో వెళ్లారు. యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. యోగికి నమస్కారం చేసిన తర్వాత ఆయనకు పాదాభివందనం చేశారు. అనంతరం ఆయనకు పుష్పగుచ్ఛాన్ని సమర్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు మీడియాలోనూ, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. రజనీ తీరును కొందరు తమిళులతో పాటు నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. ఇదీ తమిళనాడుకు సిగ్గుచేటు అని అంటున్నారు. ఆధ్యాత్మికత అంటే ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కాదని స్టేట్ మెంట్లు ఇచ్చేస్తున్నారు. రజనీ సాధారణ వ్యక్తి అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదని, దక్షిణాదికే సూపర్ స్టార్ అని చెబుతూ మరికొందరు విమర్శలు చేశారు. మహారాష్ట్రకు చెందిన రజనీకాంత్ ఢిల్లీ వెళ్లి తమిళుడినని పరిచయం చేసుకున్నప్పుడు ఇలాంటి పనులు ఎలా చేస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు.

రజనీ ఏం చేసినా ఫ్యాన్ కు ఇష్టమే. రజనీ కోసం ప్రాణాలు ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. యోగికి ఆయన పాదాభివందనం చేయడంలో తప్పులేదని వాళ్లు వాదిస్తున్నారు. ఓ సర్వసంగపరిత్యాగికి దణ్ణం పెట్టడంలో తప్పేముందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. యోగికి ఐదు పదుల వయసు అయితేనేమీ, రజనీకి 72 ఏళ్లు వస్తేనేమీ.. వయసుకు పాదాభివందనానికి సంబంధమేమిటని రజనీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఆథ్యాత్మిక కోణంలో చూస్తే తప్పనిపించదని అనవసర రంద్రాన్వేషణ చేస్తున్నారని రజనీ అభిమానులు ఆయనపై వచ్చిన విమర్శలను కొట్టి పారేస్తున్నారు..

రజనీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి 48 ఏళ్లయ్యింది. ఆయన చూడని సక్సెస్ లేదు. ఏ మాటైనా ఆయన ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అవుతుంది. ఇంకొక్కసారి జయలలితకు ఓటేస్తే తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడని రజనీ వదిలిన డైలాగ్ తో 1996లో అన్నాడీఎంకే అధినేత్రి ఓడిపోయారు.పైగా రజనీ ప్రజా సంక్షేమ వాది. ఆయన ప్రతీ మాట జనం కోసమే అన్నట్లుగా ఉంటుంది రజనీ మనసులో పడింది చెబుతారు. ఆయన మంచే ఆలోచిస్తారు తప్పితే చెడును పట్టించుకోరు. విమర్శకులను ఆయన సమాధానం చెప్పేందుకు ఇష్టపడరు. ఇటీవల ఒక్క సారి మాత్రమే కుక్కలు మొరుగుతుంటాయ్ అని అనేశారు. గతంలో తన గురువు భారతీరాజా చేసిన విమర్శలకు కూడా రజనీ సమాధానం చెప్పే ప్రసక్తే లేదని ప్రకటించారు. ఆ మాట రజనీ అభిమానులకు గుర్తుండే ఉంటుంది.
రజనీ ఆలోచన ఒక్కటే.నువ్వు చేయాలనుకున్నదీ చేయ్. చెప్పాలనుకున్నది చెప్పేయ్. దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలా వద్దా అన్నది జనం ఇష్టం. రజనీ ఫిలాసఫీ కూడా సింపుల్, సమాజం అన్న తర్వాత విమర్శలు రాకుండా ఉండవు. జనం తిట్టిపోయకుండా ఉండలేరు. దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. పైగా రజనీ హిమాలయాలకు వెళ్లడం, బాబాలకు మొక్కడం మొదలు పెట్టి దాదాపు మూడున్నర దశాబ్దాలైంది. యోగీ ఆదిత్యనాథ్ కూడా బాబానే కాబట్టి ఆయన కాళ్లకు మొక్కడాన్ని రజనీ సమర్థించుకునే అవకాశమే ఉంటుంది. పైగా రజనీని విమర్శించే తమిళులు ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. అప్పట్లో వేలాది మంది తమిళులు కరుణానిధికి, జయలలిత కాళ్లకు మొక్కే వాళ్లు. అంతకంటే ఇది తప్పేమీ కాదుగా….

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి