దేశంలోనీ పారిశ్రామిక దిగ్గజం . మానవతావాది, దాతృత్వానికి మారుపేరుగా నిలిచిన రతన్ టాటా మరణం అందర్నీ కలచి వేసింది.
రెండు రోజుల క్రితం రతన్ టాటా కు తీవ్ర అస్వస్థత అన్న వార్తలను ఖండించి తాను క్షేమంగానే ఉన్నానని వయోభారం వల్ల జనరల్ చెకప్ కోసం మాత్రమే ఆసుపత్రికి వచ్చానని x వేదికగా తెలియజేశారు
దేశంలో దిగ్గజ పారిశ్రామిక సంస్థ టాటా కంపెనీ ఛైర్మన్ రతన్ టాటా 86 వయస్సులో తుది శ్వాస విడిచారు. వృద్ధాఫ్య సమస్యలతో ముంబైలోని ఆసుపత్రిలో గత కొద్దిరోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. బుధవారం అర్ధరాత్రి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
దిగ్గజ పారిశ్రామికవేత్తగానే కాకుండా.. రతన్ టాటా అంతకుమించి గొప్ప మానవతావాది కూడా . రతన్ టాటా సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించారు. రతన్ టాటా సంపాదించిన లాభాల్లో దాదాపు 60 నుంచి 65శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం విరాళంగా అందించారు. ఎంత సంపద ఉన్నా చాలా సింపుల్ గా జీవిస్తూ పరోపకారంలోనే తృప్తి చెందుతూ వచ్చారు. రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడంతో అతనికి భార్యా పిల్లలు లేరు. అతని తర్వాత వారసత్వం ఎవరికి వస్తుందని చర్చ కూడా ప్రారంభ మైంది
చిన్నప్పటినుండి తల్లికి దూరంగా ఉన్న రతన్ టాటాకు వారి నాయనమ్మ ఎన్నో కథల ద్వారా ఉన్నతమైన విలువలను గూర్చి ఉదార స్వభావం , పరోపకారం వంటి విషయాలను అన్నిటిని కథల ద్వారా చెప్పేవారట. ఉన్నత ఆశయం కోసం పనిచేయడమే కాదు ఉన్నత విలువలను కూడా పాటించాలని నమ్మిన వ్యక్తి రతన్ టాటా
రతన్ టాటా 1991లో ‘టాటా సన్స్’ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. వందేళ్ల కిందట తన ముత్తాత స్థాపించిన గ్రూప్‌ను 2012 వరకు ఎంతో విజయవంతంగా నడిపారు రతన్ టాటా. 1996లో టెలి కమ్యూనికేషన్స్ కంపెనీ అయిన టాటా టెలిసర్వీసెస్‌ను, 2004లో ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ని ప్రారంభించి.. పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక అడుగులు వేశారు. టాటా గ్రూప్ సంస్థను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో రతన్ టాటా కీలక పాత్ర పోషించారు. రతన్ టాటా నాయకత్వంలో, టాటా గ్రూప్స్ సంస్థ.. 100 బిలియన్ డాలర్ల విలువైన ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. తన వ్యాపారాలన్నింటినీ ఎంతో విజయవంతంగా నడిపిస్తూ.. దేశంలోని గొప్ప పారిశ్రామిక వేత్తల్లో ఒకరిగా రతన్ టాటా పేరు సంపాదించుకున్నారు.
86 ఏళ్లు ఉన్న రతన్ టాటా.. చివరి దశలో గౌరవ ఛైర్మన్ హోదాలో కొనసాగారు. టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ.. టాటా సన్స్‌కు కూడా గతంలో ఛైర్మన్‌గా ఉన్నారు. టాటా గ్రూప్ ఛారిటబుల్ ట్రస్టులకు మాత్రం రతన్ టాటా నాయకత్వం వహించారు. ఇక.. బిజినెస్ టైకూన్‌గా పేరు తెచ్చుకున్న రతన్ టాటాను.. 2008లో దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్‌తో అప్పటి కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. అంతకు ముందు.. 2000లోనే రతన్ టాటాను పద్మ భూషణ్ వరించింది.
ప్రధాని నరేంద్ర మోడీ తో పాటు ప్రముఖులందరూ రతన్ టాటా మరణం దేశానికి చాలా లోటు అని సంతాపం తెలియజేశారు
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…