రిలయన్స్ కట్టే పన్నులు రూ. 2 లక్షల కోట్లు ! మరి అదానీ ఎంత ?

By KTV Telugu On 9 August, 2023
image

KTV Telugu ;-

దేశంలో అత్యధిక పన్నులు కట్టేది ఎవరు ? . వ్యక్తిగత విషయాలను పక్కన పెడితే కార్పొరేట్ సంస్థలు దేశానికి ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాయన్నది పరిశీలిస్తే ఇందులో నెంబర్ వన్‌గా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉంది. ఈ సంస్థ అటూ ఇటూగా దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలకుపైగా పన్ను రూపంలో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ గర్వంగా ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థలో తమ కంట్రిబ్యూషన్ చాలా గొప్పదని.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తమ పాత్ర కీలకమని గొప్పగా ప్రకటించుకుంటోంది.

రిలయన్స్ .. దేశంలో ఏ మూలకు వెళ్లినా వినిపించే పేరు. మన రోజువారీ జీవితంలో అనేక చోట్ల మనకు తెలియకుండానే మనకు సేవల్ని అందించి మన దగ్గర డబ్బులు వసూలు చేస్తోంది. ఓ జియో ఫోన్ కనెక్షన్ కావొచ్చు రిలయన్స్ రీటైల్ కావొచ్చు.. అలాగే న్యూస్ 18 గ్రూప్ మీడియా సహా మనకు తెలియని ఎన్నో వ్యాపారాలను రిలయన్స్ చేస్తోంది. ప్రజల జీవితాల్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడంలో రిలయన్స్ పాత్రను కాదనలేం. ఆ సంస్థపై వచ్చే విమర్శలు… ఇతర విషయాలు పక్కన పెడితే.. దేశానికి మాత్రం పన్నుల రూపంలో ఎవరూ కట్టనంత.. కట్టడానికి ఊహించనంత కడుతోంది. ఓ పెద్ద రాష్ట్రం బడ్జెట్ అటూ ఇటూగా రెండు లక్షల కోట్లు ఉంటుంది. దాదాపుగా ఇదే స్థాయిలో రిలయన్స్ ప్రభుత్వానికి పన్నులు కడుతోంది.

గడచిన మూడేళ్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ దేశానికి కట్టిన పన్నులు 5 లక్షల కోట్ల రూపాయల పైమాటే. కంపెనీ ఏజీఎం మీటింగ్ సందర్భంగా రిలయన్స్ తమ లెక్కలను విడుదల చేసింది. 2023 సంవత్సరానికి ఇటీవల విడుదలైన రిలయన్స్‌ వార్షిక నివేదికలో ప్రభుత్వానికి తమ సంస్థ కట్టిన పన్నుల వివరాలను వివరించారు. 2023లో ఖజానాకు రిలయన్స్‌ సంస్థ నుంచి 1 లక్షా 77 వేల 173 కోట్ల రూపాయలు పన్నులుగా కట్టారు. 2022 సంవత్సరానికి అది 1 లక్షా 88 వేల 012 కోట్లుగా నమోదైంది. పలు ప్రత్యక్ష, పరోక్ష పన్నుల ద్వారా జాతీయ ఖజానాకు అత్యధిక పన్ను చెల్లింపుదారుగా నిలిచింది. ఉపాధి కల్పనలో కంపెనీ సరికొత్త రికార్డును నెలకొల్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రియలన్స్‌ గ్రూప్‌ 2 లక్షల 62 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. వారిలో 1 లక్షా 80 వేల మంది రిటైల్‌లో చేరగా, 70,500 మంది జియోలో చేరారు. తన వ్యాపారాలన్నింటా అదనంగా 2,62,558 ఉద్యోగాలను కల్పించడం ద్వారా భారతీయులకు ఉపాధి కల్పనలో రిలయన్స్‌ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. దేశంలో అతి పెద్ద ఉద్యోగ ప్రదాతగా రిలయన్స్‌ రిటైల్‌ నిలిచింది.

రిలయన్స్ సంస్థ 2023 సంవత్సరానికి రిలయన్స్‌ 171 పేటెంట్‌ దరఖాస్తులు చేయగా వాటిలో 141 పేటెంట్లు మంజూరు అయ్యాయి. 2023 సంవత్సరానికి పరిశోధన, అభివృద్ధి కోసం రిలయన్స్‌ రూ.3,001 కోట్లు వెచ్చించింది. జియో బీపీ దేశవ్యాప్తంగా తన చార్జింగ్‌ పాయింట్లను విస్తరించుకుంటూ పోతున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి 1,000కి పైగా పబ్లిక్‌ చార్జింగ్‌ పాయింట్లను జియో బీపీ ప్లస్‌ బ్రాండ్‌ కింద నెలకొల్పిన జియో బీపీ.. ఎనిమిది నగరాలు, ప్రధాన జాతీయ రహదారుల వెంబడి నెట్‌వర్క్‌ను 1,400కు పైగా పాయింట్లకు పెంచింది. రిలయన్స్ కంపెనీ ఈ నెల 28న వార్షిక సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనుంది. అదే సమయంలో రిటైల్‌, డిజిటల్‌ సర్వీసెస్‌, ఓ2సీ, ఈ అండ్‌ పీ లాంటి వ్యాపారాల్లో కంపెనీ సాధించిన పురోగతిని వార్షిక నివేదిక వెల్లడించింది. ఎలా చూసినా రిలయన్స్ సంస్థ.. దేశవ్యాప్తంగా లక్షల ఉద్యోగాలను ఇవ్వడమే కాదు.. ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం ఇస్తోంది.

రిలయన్స్ మన రోజువారీ జీవితంలో భాగం అయింది. వంద కోట్ల మంది అవసరాల్ని ఏదో ఓ విభాగంలో తీర్చే ప్రయత్నం చేస్తోంది. అంబానీ కంటే గొప్పగా ఎదిగిన మరి అదానీ కంపెనీలు దేశానికి ఎంత పన్నులు కడుతున్నాయి ?

అదానీ గ్రూప్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గ్రూప్‌గా ఓ దశలో ఎదిగిందింది. హిండెన్ బెర్గ్ సంస్థ ఓ నివేదిక ప్రకటించిన తర్వాత సంస్థ వాల్యూ తగ్గిపోయింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కార్పోరేట్ మోసానికి సంబంధించిన ఆరోపణలు అదానీ గ్రూప్‌ను కుదిపేయకముందే , గౌతమ్ అదానీ ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఒకరు . మైనింగ్ నుండి గ్రీన్ ఎనర్జీ వరకు షిప్పింగ్ నుండి ఏవియేషన్ నుండి పవర్ మరియు ఇతరాలు, అతని కంపెనీలు విభిన్న రంగాలలో విస్తరించి ఉన్నాయి. అందువల్ల, అదానీ కంపెనీలు, ముఖ్యంగా అతని ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌తో సహా, భారతదేశంలోని అగ్ర కార్పొరేట్ పన్ను చెల్లింపుదారులలో ఒకటిగా ఉండాలని ఎవరైనా అనుకుంటారు. కానీ ఏ అదానీ సంస్థ కూడా టాప్ 10లో లేదు. పన్నులకు… స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులకు సంబంధం లేదు. వ్యాపార వ్యవహారాల మీద పన్నులు కడతారు. అందు వల్ల హిండెన్ బెర్గ్ రిపోర్టును పక్కన పెట్టి అదానీ కంపెనీలు కట్టే పన్నుల సంగతి చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు.

పన్నులు మార్కెట్ క్యాపిటలైజేషన్‌పై కాకుండా లాభాలపై మాత్రమే విధిస్తారు. అలాగే మొత్తం ఆ కంపెనీ కార్యకలాపాలపై ప్రభుత్వానికి అందిన పన్నును రిలయన్స్ లెక్కేసి చెప్పింది. అలా అదానీ గ్రూప్ ను విశ్లేషిస్తే.. . ప్రభుత్వానికి ఎక్కువ టాక్స్ కడుతున్న కంపెనీల లిస్టులో కూడా అదానీ సంస్థల పేర్లు లేవు. 2022 ఆర్ధిక సంవత్సరంలో అదానీకి చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు మొత్తం కలిపి కట్టిన టాక్స్‌ల విలువ 5000 కోట్ల రూపాయల కన్నా తక్కువే. పొతే రిలయన్స్, TCS, SBI, మొదలైన సంస్థలు ప్రభుత్వానికి టాక్స్ చెల్లించే లిస్టులో ముందు వరసలో ఉన్నాయి. భారత దేశ కార్పోరేట్ చట్టాల ప్రకారం కార్పొరేట్ టాక్స్ అనేది కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌పై కాకుండా, అవి ఆర్జించిన లాభాలపై విధిస్తారు. అదానీకి చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు పెద్దగా లాభాలను ఆర్జించట్లేదని, అందుకే అదానీ గ్రూప్ సంస్థలు భారత ప్రభుత్వానికి ఎక్కువ టాక్స్ చెల్లించడం లేదని అనుకోవచ్చు. అదానీకి చెందిన అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ గత ఆర్థిక సంవత్సరం 477 కోట్లు రూపాయలు టాక్స్ చెల్లించాయి. మిగతా కంపెనీలు కట్టిన పన్నుల ప్రకారం చూస్తే అదానీకి చెందిన ఏడు లిస్టెడ్ కంపెనీలు మొత్తం కలిపి ప్రభుత్వానికి చెల్లించిన టాక్స్ విలువ 5000 కోట్ల కన్నా తక్కువే ఉంటుంది.

రిలయన్స్ ప్రజలకు అవసరాలు తీర్చే వ్యాపారాలు చేస్తుంది. ప్రతీ లావాదేవీలోనూ కేంద్రానికి.. రాష్ట్రాలకు పన్నులు వెళ్తాయి. కానీ.. అదానీ గ్రూప్ చేస్తున్న వ్యాపారాలు… సామాన్య ప్రజలతో సంబంధం లేనివి. అదానీ విల్మర్ పేరుతో అమ్మే నూనె వ్యాపారాల్లాంటివి మాత్రమే ఉన్నాయి. అందుకే.. అదానీ గ్రూప్ పన్నుల రూపంలో దేశానికి చేస్తున్న మేలేం లేదు. కానీ దేశం నుంచి మాత్రం ఆ గ్రూప్ చాలా ఎక్కువగా ప్రయోజనం పొందుతోంది.

దేశంలో కార్పొరేట్ సంస్థలు భిన్నంగా ఉంటాయి. కంపెనీల వాల్యూ ఆకాశంలో ఉంటుంది కానీ.. లాభాలు మాత్రం అతి తక్కువగా ఉంటాయి. కొన్ని మాత్రం దానికి రివర్స్‌లో ఉంటాయి. కానీ గొప్ప కంపెనీలు అనుకునే అదానీ గ్రూపులు మాత్రం.. ఏటా ఐదు వేల కోట్లు కూడా పన్నులు కట్టవు… కానీ రిలయన్స్ మాత్రం అటు ఉద్యోగులు కల్పిస్తోంది.. ఇటు ప్రభుత్వాలకు లక్ష ల కోట్ల పన్నుల ఆదాయం వచ్చేలా చేస్తోంది.

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి..