పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉన్నారు. పవన్‌తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో సెటిల్ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలను పంచుకుంటూ ఉంటారు. రేణు దేశాయ్ తెలుగు తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది. ఈమధ్యనే రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేసింది. మాస్ మహరాజా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఆ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
ప్రస్తుతం రేణు దేశాయ్.. యానిమల్స్, చిన్న పిల్లల కోసం ఫండింగ్ కలెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తనకు తోచినంత సాయం చేస్తూనే తన ఫ్యాన్స్ ద్వారా కూడా ఆమె విరాళాలు సేకరిస్తుంటారు. ఇక జంతు ప్రేమికురాలిగా ఆమె సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్‌లు షేర్ చేస్తుంటారు. నెెట్టింట యాక్టివ్‌గా ఉండే రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పులపై రియాక్ట్ అవుతుంటారు. తాజాగా ఆమె వినాయకచవితి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రేణు దేశాయ్ మాట్లాడుతూ..ఇప్పుడు అందరూ తమ స్థాయిని చాటుకోవడం కోసం చూస్తున్నారని, పెద్ద పెద్ద విగ్రహాలు, ఎక్కువ డెకరేషన్ అంటూ సెలబ్రేషన్స్ చేస్తున్నారని చెప్పారు. నిజానికి వారు చేసే పనిలో దేవుడు లేడని అన్నారు. వారు చేస్తున్న ఆ పనుల్లో మనుషుల దురాశ, అత్యాశ మాత్రమే ఉందని రేణు దేశాయ్ కామెంట్స్ చేశారు. వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు.. రాను రాను దేవుడి స్థాయిని దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారని ఆమె మండిపడ్డారు. హీరో హీరోయిన్ల గెటప్పుల్లో వినాయక విగ్రహాలను పెట్టడం ఏంటని ఆమె ఫైర్ అయ్యారు. ప్రస్తుతం రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆమె చెప్పింది కరెక్టే అని కొందరు అంటుంటే మరికొందరు మాత్రం రేణు దేశాయ్ మాటలకు కౌంటర్ ఇస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…