హీరో నారా రోహిత్ ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఇంతకాలం సినిమాలపై మాత్రమే కాన్సంట్రేట్ చేసిన రోహిత్…ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ కు టైమ్ అడ్జెస్ట్ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. రోహిత్ డిసెంబరులో పెళ్లి పీటలెక్కబోతుండగా.. తాను ప్రేమించిన అమ్మాయితో ఇప్పుడు లాంఛనంగా నిశ్చితార్థం జరిగింది. రీల్ లైఫ్ హీరోయినే ఇప్పుడు ఆయన రియల్ లైఫులోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
హైదరాబాద్‌లో జరిగిన నిశ్చితార్థానికి ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరితో పాటు అత్యంత సన్నిహిత వర్గాలు హాజరయ్యాయి. నిశ్చితార్థం సందర్భంగా అసలు నారా రోహిత్ కాబోయే భార్య సిరి ఎవరూ అన్న చర్చ జరిగింది. సోషల్ మీడియాలో సెర్చ్ చేసిన వారు లక్షల్లో ఉన్నారు.ఇటీవలే విడుదలైన ప్రతినిధి 2.. సినిమాలో సిరి నటించారు. సినిమా చిత్రీకరణ సమయంలో సిరితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ప్రొపోజ్ చేస్తే తమ తల్లిదండ్రుల అనుమతితో ఆమె అంగీకరించారు.
సిరి కాస్త లేటుగానే సినిమాల్లోకి వచ్చారు. ఆమె ఎక్కడ నుంచో రాలేదు. ఇక్కడ ఆమె, మన తెలుగమ్మాయే.. బ్యాచిలర్స్ డిగ్రీ దాకా ఇక్కడే చదువుకున్నారు. తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్స్ చేశారు. వేరే ఉద్యోగాలు చేసే అవకాశం ఉన్నా… తొలుత సినిమాల్లో నటించాలన్న కోరిక ఆమెకు ఉండేది. అలా ప్రతినిధి 2 మూవీ ఆడిషన్స్ కు ఆమె అటెండయ్యారు. హీరోయిన్ గా ఎంపిక కావడంతో సినీ జీవితం ప్రారంభమైంది. అప్పుడే నారా రోహిత్ తో పరిచయం కావడం, ఆయన ప్రొపోజ్ చేయడం జరిగిపోయింది. ఆమె తరపున పెద్దలు అంగీకరించిన తర్వాత.. మొత్తం విషయాన్ని నారా రోహిత్ తన పెద్దమ్మ భువనేశ్వరికి చెప్పారట. అప్పుడు భువనేశ్వరి స్వయంగా వెళ్లి.. సిరి తరపు వాళ్లతో మాట్లాడి పెళ్లి కుదిర్చారు.
‘బాణం’ చిత్రంతో నారా రోహిత్ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు. యాక్షన్ డ్రామా ఫిల్మ్‌గా తెరకెక్కిన ఈ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. 2011లో విడుదలైన ‘సోలో’తో చక్కని విజయం అందుకున్నారు. అనంతరం ‘ఒక్కడినే’, ‘ప్రతినిధి’, ‘రౌడీ ఫెలో’, ‘అసుర’, ‘జో అచ్యుతానంద’ వంటి చిత్రాల్లో నటించారు. 2018 లో విడుదలైన ‘వీర భోగ వసంత రాయలు’ తర్వాత దాదాపు ఆరేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది ఆయన నటించిన ‘ప్రతినిధి 2’ విడుదలైంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే నటి సిరితో ఆయనకు పరిచయం ఏర్పడింది
40 ఏళ్ల వయసులో నారా రోహిత్ పెళ్లిచేసుకుంటున్నారు. కాకపోతే ఆయనదీ క్లీన్ ఇమేజ్, ఎక్కడా ఎఫైర్స్ లేవు. ఇంతకాలం కేరీర్ తప్పితే వేరే ఏ విషయంలోనూ ఆయన తలదూర్చలేదు. రాజకీయ కుటుంబమైనా రాజకీయాల వైపు చూడలేదు. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి….