ఆదివారం సెలవు క్రైస్తవుల కోసం ఉద్దేశించినదని ..దాన్ని హిందువులపై బలవంతంగా రుద్దామని జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఆదివాలం సెలవు వెనుక ఇంత చరిత్ర ఉందా అని ఆశ్చర్యపోయారు. నిజానికి ఆదివారాన్ని సెలవుగా నిర్ణయించడం వెనుక ఇలాంటి సంప్రదాయాలే ఉన్నాయి కానీ .. ఆ కారణంతో హిందువులు ఎవరూ చర్చికు వెళ్లడం లేదు . ఇప్పుడు శుక్రవారాన్ని సెలవుగా మార్చాలని కూడా డిమాండ్లు లేవు. కానీ మోదీ వ్యాఖ్యలతో ఆదివారంపై చర్చ మాత్రం ప్రారంభమయింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జార్ఖండ్‌లోని దుమ్కాలో జరిగిన బహిరంగ సభలో మోదీ ఆదివారం సెలవుల గురించి ప్రస్తావించారు. జులై 2022లో జార్ఖండ్‌లోని జమ్తారా జిల్లాలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతాల్లో 43 పాఠశాలలు వారాంతపు సెలవును ఆదివారం నుండి శుక్రవారానికి మారుస్తూ నిర్ణయం తీసుకున్నాయి. శుక్రవారం ఇస్లాంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐతే అప్పట్లో దీనిపై విమర్శలు రావడంతో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీన్ని రాజకీయంగా ఉపయోగించుకున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ కేవలం హిందువులతోనే కాకుండా క్రైస్తవులతో కూడా ఘర్షణకు పాల్పడుతోందని ప్రధాని ఆరోపించారు. ఆదివారం సెలవును క్రైస్తవానికి ముడిపెడుతూ మోదీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దాంతో ఆదివారం సెలవుపై చర్చ ప్రారంభమయింది.
హిందూ సంప్రదాయాలు ప్రకారం అయితే ఆదివారాన్ని రవి వారం అని కూడా పిలుస్తారు. ఆదివారానికి అధిపతి సూర్యుడు అని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల సూర్య భగవానుని మరొక పేరు అయినా రవిని తీసుకొని రవి వారంగా పిలుస్తున్నారు. సూర్యుని ప్రత్యక్ష దైవంగా కొలిచే మన హిందు సాంప్రదాయంలో ఆయన అనుగ్రహం పొందడానికి ప్రత్యేక పూజలు, ఉపవాసాలు వంటివి చేసేవారు. అలాగే క్రైస్తవులకు పవిత్ర గ్రంథం అయిన బైబిల్ లో కూడా ఆదివారానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. క్రైస్తవ మతానికి మూల పురుషుడు అయిన ఏసుక్రీస్తు చనిపోయిన మూడో రోజు సమాధిలో నుంచి తిరిగి బ్రతికాడని బైబిల్ చెప్తుంది. ఆయన్ని సమాధిలో పాతి పెట్టింది శుక్రవారం. అయితే అతను మూడవ రోజు ఆదివారం ఆకాశంలో మేఘాలలో కనిపించాడు.
దాని కారణంగా ఆదివారాన్ని పవిత్రమైన దినంగా భావిస్తారు. అందుకే ప్రతి సంవత్సరం వచ్చే గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే సండేను నే ఈస్టర్ సండేగా పిలుచుకుంటారు. ఈ విధంగా ఆదివారం క్రైస్తవ మతంలో కూడా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే దళితుల అందరు ప్రతి రోజు పనికి వెళ్ళడం వలన, కుటుంబం పట్ల, దైవారాధన పట్ల శ్రద్ధ వహించడం లేదని భావించిన క్రైస్తవ ధర్మం యొక్క పెద్దలు వారంలో ఒకరోజు సెలవు ఇవ్వాలని భావించారు. రోజు అందరూ తమ కుటుంబ సభ్యులతో కలిసి దైవారాధన చేస్తూ సంతోషంగా గడపాలని ఎంతో శ్రేష్టమైన ఆదివారాన్ని సెలవు రోజుగా ప్రకటించారు. తర్వాత కాలంలో క్రైస్తవ మతం వ్యాప్తి చెందిన ప్రతి దేశం ఆదివారం సెలవు అనే పద్ధతి ఆచారంగా కొనసాగించ బడింది. మన దేశాన్ని బ్రిటిష్ వారు ఆక్రమించుకోవడానికి ముందు ఆదివారాన్ని ఒక పవిత్రమైన రోజుగా భారతీయులు కొలిచే వారు.
కానీ సెలవు మాత్రం ఉండేది కాదు. దీనికి ప్రధాన కారణం పూర్వం మనదేశంలో వ్యవసాయం చేసేవారు ఎక్కువగా ఉండేవారు. కానీ బ్రిటిష్ వారు మన దేశాన్ని ఆక్రమించిన తరువాత మన దేశంలో వారు చేసే కార్యకలాపాలకు మన భారతీయులను కూలీలుగా తీసుకోవడం మొదలుపెట్టారు. రోజుకు ఎంతో కొంత ధనం రావడం వల్ల చాలా మంది ప్రజలు ప్రతిరోజు బ్రిటిష్ వారి వద్దకు వెళ్లి పని చేసే వాళ్ళు క్రమంలో సంఘంలో జరిగే సమస్యలు పరిష్కరించ డానికి ఎవరు సరిగ్గా సమయాన్ని కేటాయించేవారు కాదు.
అప్పటి మన సంఘంలో సమస్యలు పరిష్కరించ డానికి ఒకరోజు అందరికీ సెలవు ఉండాలని నిర్ణయించుకున్న ఆరు రోజు ప్రజలందరూ కలిసి సంఘసంస్కరణకు పాటుపడాలని అప్పటి అభ్యుదయవాది నారాయణ ఘాజీ అనే వ్యక్తి ఆదివారం భారతదేశంలో సెలవు కావాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఆయన డిమాండ్‌ను చేసే సమయంలో బ్రిటిష్ వారి దేశాలలో ఆదివారం సెలవు దినంగా ప్రకటించబడింది. తర్వాత బ్రిటిష్ వారు విధానాన్ని భారత దేశంలో కూడా అమలు చేశారు. ఆ విధంగా ఆదివారం సెలవు లభించింది.
అంటే ఆదివారం విషయంలో ప్రతి వర్గానికి అథ్యాత్మిక ఆసక్తి ఉంది. అది ఎవరి సొంతమూ కాదు. అయితే మోదీ వ్యాఖ్యలతో రాజకీయం ప్రారంభమయింది. ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేం.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…