భారత్ నుంచి తొలి పాన్ వరల్డ్ సినిమాగా కల్కి విడుదలయింది. అందులో దృశ్యాలు చూసి తెలుగు సినిమా స్టామినా ఈ స్థాయిలో పెరిగిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. కల్కి సినిమా వెయ్యికోట్లకుపైగా వసూలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ టాప్ వసూళ్ల సినిమా కూడా తెలుగుదే . భారత సినీ రంగంలో తెలుగు సినిమా నే ప్రధానంగా నిలబడుతోంది. మరి కల్కి బాహుబలిని మించుతుందా ?
ఇండియా బిగ్గెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ విడుదలైంది. కొన్ని వారాల ముందు పరిస్థితి చూస్తే.. సినిమాను సరిగా ప్రమోట్ చేయలేదని, సరైన హైప్ క్రియేట్ చేయలేకపోయారని అనుకున్నారు. కానీ ఈ సినిమాలో ఎన్నో ఆకర్షణలు ఉన్నప్పటికీ.. ఒక వరల్డ్ క్లాస్ విజువల్ వండర్ చూడబోతున్నామనే ఫీలింగే ఎక్కువ ఎగ్జైట్ చేసింది. . మామూలుగా ఉన్న హైప్‌కి, అదనపు రేట్లు తోడవుతుండడంతో కలెక్షన్ల పరంగా ‘కల్కి’కి ఆకాశమే హద్దు అనడంలో సందేహం లేదు. తెలుగు రాష్ట్రాల వరకే తొలి రోజు ‘కల్కి’ 60-70 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. హిందీ వెర్షన్ ఇండియాలో 25-30 కోట్ల మధ్య తొలి రోజు వసూళ్లు రాబట్టే అవకాశముంది. ఇంకా కర్ణాటకలో తెలుగు వెర్షనే వసూళ్ల మోత మోగించడం ఖాయం. ఇంకా కేరళ, తమిళనాడు ఉన్నాయి. వరల్డ్ వైడ్ సినిమా భారీగా రిలీజవుతున్న నేపథ్యంలో తొలి రోజే ఓవరాల్ వసూళ్లు 200 కోట్ల మార్కును అందుకున్నాయని అంచనా వేస్తున్నారు.
టాక్ ప్రకారం చూస్తే సులువుగా వెయ్యి కోట్లు దాటేస్తుంద ికల్కి. వెయ్యి కోట్లు… తక్కువేం కాదు! కానీ, ఇండియన్ సినిమాలకు అది అందని ద్రాక్ష అని కొన్నాళ్ల క్రితం వరకు అందరి నోటా వినిపించిన మాట! కానీ, ఆ వెయ్యి కోట్లు వసూలు చేయడం పెద్ద కష్టం ఏమీ కాదని రాజమౌళి నిరూపించారు. ‘బాహుబలి 2’ మొదట వెయ్యి కోట్ల వసూళ్లు చేసింది. ఒక్క భారత్‌లోనే ఆ సినిమా 1430 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఓవర్సీస్ వసూళ్లు 380 కోట్లు. టోటల్ రూ. 1810 కోట్లు ఆ సినిమా కలెక్షన్లు. ‘బాహుబలి 2’ తర్వాత వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిన సినిమా ‘కెజిఎఫ్ 2’. మన దేశంలో ఆ చిత్రానికి రూ. 1008 కోట్లు వచ్చాయి. ఓవర్సీస్ వసూళ్లు రూ. 242 కోట్లతో కలిపి 1250 కోట్ల మార్క్ చేరుకుంది. ‘బాహుబలి 2’కి, ‘కెజియఫ్ 2’కు మధ్యలో ‘ఆర్ఆర్ఆర్’ ఉంది. కానీ, ఆ సినిమాకు ఇండియాలో రూ. 944 కోట్లు, విదేశాల్లో రూ. 446 కోట్లు వచ్చాయి. టోటల్ రూ. 1340 కోట్లు.
ఇండియాలో హయ్యస్ట్ గ్రాస్ సాధించిన టాప్ 5లో సినిమాల్లో మూడు సౌత్ ఫిలిమ్స్ ఉన్నాయి. ‘బాహుబలి 2’, ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజిఎఫ్ 2’ తర్వాత స్థానంలో షారుఖ్ ‘జవాన్’, ‘పఠాన్’ ఉన్నాయి. ఆ లెక్కలో ‘దంగల్’ది ఆరో స్థానమే. ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ సినిమాలు ఏవీ ఆ దరిదాపుల్లోకి వెళ్ళలేదు. ‘సలార్’ సక్సెస్ కొట్టినా ఇండియాలో 500 కోట్లకు అటు ఇటుగా ఆగింది. ట్రిపుల్ ఆర్తో ఎన్టీఆర్, రామ్ చరణ్ వెయ్యి కోట్ల సినిమాలో భాగమయ్యారు. ఆ సినిమాలో వాళ్లిద్దరూ డ్యాన్స్ చేసిన ‘నాటు నాటు’కు ఆస్కార్ వచ్చింది. ఇప్పుడు వాళ్లిద్దరి సినిమాలపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ నెలకొంటుంది , కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ‘దేవర’ మీద సైతం భారీ అంచనాలు ఉన్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫిల్మ్ ‘పఠాన్’ భారీ వసూళ్లు సాధించిన నేపథ్యంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటిస్తున్న ‘వార్ 2’ సైతం వెయ్యి కోట్ల క్లబ్బును టార్గెట్ చేసిన సినిమాయే.
‘పుష్ప: ది రైజ్’లో అల్లు అర్జున్ నటనకు జాతీయ ప్రేక్షకులు జేజేలు కొట్టారు. ఆ సినిమాకు గాను ఆయన నేషనల్ అవార్డు సైతం అందుకున్నారు. అయితే, ఆ సినిమా 500 కోట్ల క్లబ్బులో చేరలేదు. కానీ, సీక్వెల్ ‘పుష్ప: ది రూల్’కు భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. డిజిటల్, శాటిలైట్ హక్కులతో వెయ్యి కోట్లు వచ్చాయని ప్రచారం జరుగుతోంది. ఇండియన్ మార్కెట్ చూస్తే… 500 కోట్ల గ్రాస్ దాటిన తమిళ సినిమా ఒక్కటి కూడా లేదు. కానీ, ‘జైలర్’తో రజనీకాంత్ కొత్త ఆశలు చిగురించేలా చేశారు. ఆ సినిమాకు భారీ వసూళ్లు వచ్చినప్పుడు… ఆయనకు సెట్ అయ్యే, స్టార్డమ్ కు తగ్గ కథ పడితే వెయ్యి కోట్లు కష్టం ఏమీ కాదు. ‘ఇండియన్ 2’తో కమల్ హాసన్ ఏం చేస్తారో చూడాలి. ‘కెజిఎఫ్’ తర్వాత యశ్ చేస్తున్న ‘టాక్సిక్’ మీద సైతం అంచనాలు ఉన్నాయి. ‘కల్కి 2898 ఏడీ’తో ప్రభాస్ నెక్స్ట్ లెవల్ క్రేజ్ కనబడుతోంది. ఇప్పటి వరకు ఓ లెక్క, ఇప్పటినుంచి మరో లెక్క అన్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి వెయ్యి కోట్ల క్లబ్బులో అడుగుపెట్టేలా ఉన్నారు. మరి, ‘బాహుబలి 2’ను బీట్ చేస్తారా? లేదా? అన్నది కొద్ది రోజుల్లో తేలనుంది.
మొత్తంగా చూస్తే అద్భుతమైన సినిమాలు తీయడంలో తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రమే ముందంజలో ఉంటోంది. ఇతర పరిశ్రమల్లో వ్యాపారం ఎక్కువైపోయి సృజనాత్మకత తగ్గిపోతోంది.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…