తొలి ఏకాదశి. మాంసాహారం తినవచ్చా?

By KTV Telugu On 17 July, 2024
image

KTV TELUGU :-

వైష్ణవ భక్తులకు ఈ ఏకాదశి చాలా పవిత్రమైనది. ఆషాడమాసంలో శుక్లపక్షం సమయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో సహా తెలుగు మాట్లాడే వారంతా ఏకాదశి పండుగను జరుపుకుంటారు. ఈ ఏకాదశిని దేవశయనీ ఏకాదశి, అని హరి శయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. దేవతలకు ఈ రోజు నుండి రాత్రి సమయం ప్రారంభమవుతుంది. అంటే శ్రీమన్నారాయనుడు ఈరోజున యోగ నిద్రలోకి వెళ్తాడు. ఇప్పటినుండి నాలుగు నెలలు అంటే కార్తీక మాసం వరకు నిద్రపోతాడు. తిరిగి కార్తీక మాసం శుద్ధ ఏకాదశిన మేల్కొంటాడు. భక్తులు ఇప్పటినుండి చాతుర్మాస వ్రతం ఆచరిస్తారు.

శ్రీమన్నారాయణడు నాలుగు నెలలు నిద్రపోతాడా అంటే నిజంగా నిద్రపోడు అతడు మానవమాత్రుడు కాదు అతనికి ఆకలి నిద్ర వీటితో పనిలేదు కానీ మన వాతావరణంలో వచ్చే మార్పులను బట్టి రకరకాల ఉపవాసాలను ఆహారాలను నియమాలను ఏర్పరిచారు .

ఇప్పటినుండి దక్షిణాయనం ఆరంభం అవుతుంది పగలు తక్కువ రాత్రి ఎక్కువగా ఉంటుంది. వర్షాలు కురుస్తుంటాయి. సూర్య రష్మీ తగ్గడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది కాబట్టి ఉపవాసాలు ఉండాలని నియమం ఏర్పరిచారు. ఇక జీర్ణమవ్వడానికి  ఎక్కువ సమయం తీసుకునే మాంసాహారాలను తినకపోవడమే మంచిది. ఉపవాసం ఉండడం వల్ల శరీరంలోని మలినాలన్నీ  తొలగించబడతాయి. కఠిన ఉపవాసమే చేయనవసరం లేదు. ద్రవాహరాలు తీసుకోవచ్చు. లేదంటే పండ్లు ఫలాలు కూడా తినవచ్చు. అది కూడా చేయలేము అనుకునేవారు ఉప్పు కారం లేకుండా  పెరుగన్నమైనా తినవచ్చు అంటారు

తొలి ఏకాదశికి రైతులు కూడా చాలా ప్రాముఖ్యతను ఇస్తారు నాగళ్లతో పొలం దున్ని విత్తనాలు వేస్తారు అంతకంటే ముందే విత్తనాలు వేసిన వారైనా ఈరోజు  పూజ చేసుకుని కొన్ని విత్తనాలు అయినా నాటుతారు. పశువులను ముఖ్యంగా ఆవులను

పూజిస్తారు. రైతులు కాని వారు కూడా ఈరోజు ఆవుకి మేతవేయడం చాలా మంచిది. ఈరోజు ఇతర పశుపక్షులకు కూడా ఆహారాన్ని అందిస్తారు.

దానధర్మాలు చేస్తారు. దానంగా ప్రధాన అవసరాలైన ఆహారం, వస్త్రాలనే కాకుండా పుస్తకాలు , వ్యవసాయ పనిముట్లను కూడా దానంగా ఇస్తారు. ఇది చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు.

ఈ ప్రత్యేకమైన రోజున విశ్వంలోని సకల జీవరాసుల క్షేమం కోసం పూజలు చేస్తారు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. విష్ణువు కి ఇష్టమైన తులసిని మొదట పూజిస్తారు. భక్తులు వారి ఇండ్లల్లో కూడా యధాశక్తి పూజలు  నిర్వహించుకుంటారు. విష్ణు సహస్రనామాలు, రాముడు కృష్ణుడికి సంబంధించిన అష్టోత్తరాలు చదువుకుంటూ ఉంటారు. అవేమీ చేయలేకపోయినా హరినామ స్మరణ చేసుకుంటారు. ఎంత గొప్పగా చేశాము, అనేదానికంటే ఎంత శ్రద్ధగా చేసామన్నదే ముఖ్యము. మనసుపెట్టి ఆర్తిగా పిలిచినప్పుడు దేవుడు తప్పక  మొర ఆలకిస్తాడు

మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి