భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే చాలామంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంత మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ క్రమంలోనే వదర బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు అపన్నహస్తం అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలు నీటముగాయి. దీంతో భారీ ఆస్తినష్టంతో పాటుగా ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. ఇలా కష్టకాలంలో కొట్టుమిట్టాడుతున్న వరద బాధితులకు ఉపముఖ్యమంత్రి అండగా నిలిచారు. వారి కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని వ్యక్తిగతంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాన్ని ఇస్తున్నట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.
అంతకు ముందు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం రాష్ర్ట విపత్తు నిర్వహణ కమిషనర్ కార్యాలయం నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకెళ్లి.. వరద బాధితుల పరిస్థితి పరిశీలించారు. రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సిసోడియా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవర్ స్టార్ సహాయ నిధికి రూ. కోటీ ప్రకటించారు.
బాధితుల ప్రాంతాలను పరిశీలించాక పవన్ కల్యాణ్ మీడియా వారితో ముచ్చటించారు. గత సర్కారు తప్పిదం కారణంగానే ఏపీ రాష్ట్రం ప్రస్తుతం ఇలాంటి పరిస్థితుల్లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడమేరును గత ప్రభుత్వం విస్మరించిందని పవన్ ధ్వజమెత్తారు. అంతేకాకుండా ప్రాజెక్టుల విషయంలో అయితే వైసీపీ ప్రభుత్వం నెగ్లెట్ చేసిందని ఫైర్ అయ్యారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటూ పవన్ మనసు కలచివేస్తుందని అన్నారు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి ఘటనలు రిపీట్ కావని ఏపీ ప్రజలకు డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. ఇంతటి దారుణమైన పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు వహిస్తామని తెలిపారు.
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ముందుకొచ్చారు.మహేష్ బాబు రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితుల సహాయం నిమిత్తం రూ.కోటి రూపాయల విరళాన్ని ప్రకటించారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, వరద బీభత్సానికి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు అవడం తనను తీవ్రంగా కలచి వేసిందన్న మహేష్ బాబు.. నా వంతు బాధ్యతగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెరో రూ.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నట్టు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు చిరంజీవి. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు, అదే విధంగా తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో 50 లక్షలు ప్రకటించారు.
ఈ విపత్కర పరిస్థితి నుండి త్వరగా బయటపడాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేశారు. వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణ సహాయం అందించడానికి ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలకు సమిష్టిగా మద్దతు ఇద్దాం.. ఈ ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నానని మహేష్ బాబు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. వరదల వల్ల అతలకుతలం అయిన తెలుగు రాష్ట్రాలను ఆదుకునేందుకు టాలీవుడ్ సినీ హీరోలు ముందుకు వస్తున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.కోటి విరాళాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల సీఎం సహాయనిధికి రూ.50 లక్షల విరాళంగా ప్రకటిస్తున్నా. అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.
పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత, మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన ‘మెగా’ మనసు చాటుకున్నారు. ఇటీవల కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో ప్రకృతి విపత్తు తలెత్తిన సమయంలో తనయుడు రామ్ చరణ్ తో కలిసి కోటి రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదలు కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో మరోసారి మెగా విరాళం ప్రకటించారు చిరంజీవి.
నటసింహం నందమూరి బాలకృష్ణ కోటీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీకి రూ.50 లక్షలు, తెలంగాణకు రూ.50 లక్షలు అనౌన్స్ చేశాడు. అంతేకాకుండా ఓ ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చాడు. ‘50 ఏళ్ళ క్రితం మా నాన్నగారు నా నుదుటిన దిద్దిన తిలకం ఇంకా మెరుస్తూనే ఉంది.. 50 ఏళ్ల నుంచి నా నట ప్రస్థానం సాగుతూనే ఉంది- వెలుగుతూనే ఉంది.. తెలుగు భాష ఆశీస్సులతో, తెలుగుజాతి అభిమాన నీరాజనాలతో పెనవేసుకున్న బంధం ఇది.. ఈ ఋణం తీరనిది. ఈ జన్మ మీకోసం.. మీ ఆనందం కోసం.
ఏపీకి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోటి విరాళం ఇచ్చారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, నిర్మాతలైన రాధాకృష్ణ, నాగవంశీ. ముగ్గురు కలిపి రెండు రాష్ట్రాలకు రూ.25 లక్షల చొప్పున రూ.50 లక్షలు ప్రకటించారు. దర్శకుడు వెంకీ అట్లూరి రూ. 5 లక్షల చొప్పున రూ.10 లక్షల విరాళం అందజేశారు. నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షల చొప్పు రూ.కోటి విరాళం అందజేశారు. విశ్వక్ సేన్ రెండు రాష్ట్రాలకు రూ. 5 లక్షల చొప్పున రూ. 10 లక్షల విరాళం ఇచ్చారు. హీరోయిన్ అనన్యా నాగళ్ళ రూ. 5 లక్షలు ఇచ్చారు. ఏపీ సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ప్రకటించారు నిర్మాత అశ్వినీదత్.
రెబల్ స్టార్ ప్రభాస్ వరదబాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు ప్రభాస్. అలాగే వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు, మంచి నీళ్లు ఏర్పాటు చేశారు ప్రభాస్. ప్రభాస్ 5 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…