వినడానికి వింతగానే ఉన్నా.. కొందరి వాదన మాత్రం ఇదే! ఎందుకంటే.. మన దేవుళ్లను మనమే నమ్మాలనే శాసనం ఏమీ లేదు. భగవంతుడిని ఎవరైనా నమ్మొచ్చు. కానీ.. ట్రంప్ లాంటోడు మన జగన్నాథుడిని నమ్ముతాడా? గతంలో రథయాత్రలో పాల్గొన్నాడా? దానికి మెచ్చే.. జగన్నాథుడు ఇప్పుడు కాల్పుల నుంచి కాపాడాడా? అనేదే.. ఇక్కడ మేజర్ పాయింట్. ట్రంప్ ఒక్కడే కాదు.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా మన హనుమంతుడిని బలంగా నమ్ముతాడు. ఆయన దగ్గర.. చిన్న సైజు ఆంజనేయుడి ప్రతిమ కూడా ఉంటుంది. ఆ లెక్కన చూసుకుంటే.. ట్రంప్ ప్రాణాలతో బయటపడటంలో.. మన జగన్నాథుడి కృప ఉందనడంలో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు.
ఎందుకంటే.. ట్రంప్‌కు తాకిన బుల్లెట్ గాయం అమెరికాను షేక్ చేసింది. ప్రపంచ దేశాలను షాక్‌కి గురిచేసింది. అయితే.. ట్రంప్ ప్రాణాలతో బయటపడటానికి పూరీ జగన్నాథుడి కృపే కారణమని ఇస్కాన్ చెబుతోంది. ట్రంప్‌పై గన్ ఎటాక్ జరిగి.. ఆయన సేఫ్‌గా బయటపడ్డాక.. జగన్నాథుడి రథయాత్రతో ట్రంప్‌కు ఉన్న అనుబంధాన్ని ఇస్కాన్ చెప్పుకొచ్చింది. జగన్నాథుడి కృప వల్లే.. ఆయన ప్రాణాలతో బయటపడ్డారని తెలిపింది. 1976 లో ఇస్కాన్ భక్తులు రథయాత్ర కోసం రథాలు సిద్ధం చేసుకునేందుకు ఉచితంగా తన ట్రైన్ యార్డ్‌ని ఇచ్చి సహకారం అందించారని చెప్పారు. 48 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రపంచవ్యాప్తంగా రథయాత్ర ఉత్సవాలు జరుగుతున్నప్పుడే.. ఆ జగన్నాథుడి అనుగ్రహం.. ట్రంప్ ని రక్షించిందని ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. అయితే.. జగన్నాథుడి కృపే తనను రక్షించిందని ట్రంప్ నమ్మినా.. నమ్మకపోయినా.. ఇస్కాన్ మాత్రం.. ఈ విషయాన్ని బలంగా నమ్ముతోంది. ఏదేమైనా.. కాల్పుల్లో గాయపడి ప్రాణాలతో ట్రంప్ బయటపడటం మంచి విషయమే. అయితే.. ఇప్పటికైనా అగ్రరాజ్యం అమెరికా గన్ కల్చర్‌పై ఉక్కుపాదం మోపకపోతే.. మున్ముందు ఇలాంటి మరిన్ని దురదృష్టకరమైన ఘటనలు జరిగే అవకాశం లేకపోలేదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…