అమెరికా అంటే భూతల స్వర్గం అనుకుంటారు డాలర్ల మోజులో ఉన్న వారు. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. అక్కడి జీవన ప్రమాణాలే కాదు.. ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా. ఆ దేశం రిచ్ అనుకుంటారు కానీ ప్రపంచంలో ప్రతీ దేశం దగ్గర అప్పు చేసే ఒకే ఒక్క దేశ అమెరికా. చివరికి బద్ద శత్రువైనా దగ్గర.. మన దగ్గర కూడా చేయి చాపుతుంది. అమెరికా రుణాల లెక్కలు చూస్తే.. ఈ దేశం సంపన్న దేశం ఎలా అని ఆర్థిక నిపుణులకు కూడా డౌట్ రావడం ఖాయం.
అమెరికా అత్యంత సంపన్నదేశం. అందులో సందేహమే లేదు. ఇదంతా అస్తులు, ఆదాయాల పరంగా చూసినప్పుడే. కానీ అప్పుల పరంగా చూస్తే మాత్రం… తేడా కొడుతుంది. అమెరికా అప్పులు ఎంత అంటే.. ఆ దేశం డీఫాల్ట్ అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతుంది. ఏ ఒక్క దేశం బయటపడే పరిస్థితి ఉండదు. అమెరికా ప్రభుత్వం తన అప్పుల చెల్లింపులో విఫలమైతే ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని 2023 జనవరి మొదట్లోనే ఆర్థిక నిపుణులు హెచ్చరించారు. ఆ సమయంలో అమెరికా అప్పు 31.4 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. కానీ ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో అది 33.94 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుంది. 29 డిసెంబర్ 2023 నాటికి 34 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. అమెరికా అప్పులు తీసుకోని దేశం దాదాపుగా ప్రపంచంలో లేదని అనుకోవచ్చు.
అమెరికా అత్యధికంగా బాకీపడిన మొదటి దేశం జపాన్. జపాన్‌కు లక్ష కోట్లకుపైగా డాలర్లు బాకీ పడింది. అది నిరంతరం పెరుగుతూనే ఉంది. తర్వతా స్థానంలో చైనా ఉంది. అమెరికా ఉన్న అప్పులో పది శాతం చైనా దగ్గరే తీసుకున్నారు. చైనా అమెరికాకు బద్ద శత్రువు . అయినా చేయి చాచకుండా ఉండలేకపోతోంది అమెరికా. ఇంగ్లండ్, లగ్జంబర్గ్, కేమన్ ద్వీపాల దగ్గర కూడా అప్పులు చేశారు. ఇంకా విషయం ఏమిటంటే అమెరికా మన దేశానికి కూడా 21,600 కోట్ల డాలర్ల అప్పు ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ నియమాల ప్రకారం అది ఏ దేశం నుండి అయినా అప్పు తీసుకోవచ్చు. అంటే రుణ పత్రాలు అమ్మవచ్చు. అందుకే తన వాణిజ్య, సాంకేతిక, ఉత్పత్తి రంగాల శత్రువైన చైనా నుండి కూడా అప్పు తీసుకుంది. ఈ రుణ విస్తరణ రేటు అమెరికాతో పాటు, ఇతర ప్రపంచాన్ని భారీ ప్రమాదంలో పడేస్తోంది.
అమెరికా జనాభాలో అమెరికన్లు ఎంత మంది ఉంటారో చెప్పడం కష్టం. అక్కడ పుట్టిన వారికి పౌరసత్వం ఇస్తారు కాబట్టి అమెరికా జనాభా ఎక్కువ కనిపిస్తోంది. అ ఆదేశ సంపదలో విదేశాల ప్రత్యక్ష, పరోక్ష సహకారం చాలా ఉంది. స్వదేశాల్లో కోట్ల ఖర్చు తో చదువుకొన్న విద్యావంతులు ఉన్నత చదువులకుపోయి అమెరికాకు కోట్లు చెల్లిస్తారు. తర్వాత అమెరికాలోనే ఏదో ఒక ఉద్యోగం వెతుక్కొని అక్కడే నిలబడతారు. ఆ దేశ పౌరులుగా స్థిరపడతారు. అమెరికాకు పెట్టుబడి అవసరం లేని మ్యాన్ పవర్‌గా మాి అమెరికా ఆర్థిక వ్యవస్థను బలపరుస్తారు. అంటే.. అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం వలస వచ్చిన వారి మీదనే ఆధారపడి ఉంది. అయినా అమెరికా అన్ని దేశాల నుండి అప్పులు తీసుకుంది. అధిక వడ్డీ రేట్లతో అమెరికా రుణ భారం పెరుగుతూనే ఉంది. అమెరికా ఆర్థిక స్థిరత్వ కొనసాగింపు కష్టతరంగా మారుతోంది.
అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గలేదు, పెరుగుతున్నాయి. అందువలన కార్పొరేట్ సంస్థలు ఎగవేతదారులుగా మారే ప్రమాదం పెరుగుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి 2023 అక్టోబర్‌లో హెచ్చరించింది. ఆర్థిక వృద్ధి ఊపు లేకపోవడం, అధిక ద్రవ్యోల్బణం, పెరిగిన ప్రభుత్వ లోటు నిష్పత్తి కారణంగా అమెరికాకు అప్పుల అవసరం పెరిగింది. ఫలితంగా అప్పుల సేకరణ, రుణ పత్రాల జారీలను ఆపడం దానికి కష్టతరమైంది. దాని జాతీయ రుణాలు రోజురోజుకూ పెరగడానికి ఈ పరిస్థితులే కారణం. ఫెడరల్ రిజర్వ్ 11 సార్లు వడ్డీ రేటును పెంచింది. ఆర్థిక లోటు, బాండ్ల జారీ, వడ్డీ చెల్లింపులు, మరింత పెద్ద ఆర్థిక లోటు అనే విష వలయంలోకి అమెరికా పీకల లోతుకు కూరుకుపోయింది.
అమెరికా డాలర్ ఇప్పటికీ ఆధిపత్య స్థానంలో ఉండటం వల్లనే ఆ దేశం నిలబడుతోందన్న అభిప్రాయం ఉంది. అయితే అమెరికా ప్రభుత్వం డాలర్ స్థిరస్థితిని దుర్వినియోగం చేస్తోంది. డాలర్ పలుకుబడిని స్వప్రయోజనాలకు ఎక్కువగా వాడుకుంటోంది. దీని వల్ల ప్రపంచ దేశాల్లో అమెరికా పట్ల అపనమ్మకాన్ని పెంచింది. ప్రత్యామ్నాయ అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను వెతుక్కునే స్థితికి వాటిని నెట్టింది. కొంతమంది విదేశీ పెట్టుబడిదారులు ప్రధానంగా జపాన్, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఫ్రాన్స్ వంటి అమెరికా మిత్ర దేశాలు ఈ ఏడాది అమెరికా ఖజానాతో లావాదేవీలను పెంచుకున్నప్పటికీ ఎక్కువ దేశాలు అమెరికా ఖజానాలో తమ ఆర్థిక పెట్టుబడులనూ తగ్గించుకుంటూనే ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మరో దశాబ్దంలో అమెరికా కల్లోలంలో చిక్కుకోవచ్చు…
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…