భారతదేశ కుటుంబ వ్యవస్థ విచ్చిన్నం అవుతుందా? అమాయకమైన చిన్న పిల్లలు తల్లిదండ్రుల స్పర్ధల మధ్య నలిగిపోతున్నారా ?అంటే కొంతవరకు అవునని అనాల్సి వస్తుంది. సెలబ్రిటీలు మొదలుకొని సామాన్యుల వరకు భార్యా భర్తలు విడిపోవడం ఎక్కువైందనే చెప్పాల్సి వస్తుంది.
పెళ్లి పెటాకులు అయింది అనే మాట ఎప్పుడో కానీ వినిపించేది కాదు .ప్రస్తుతం మీడియా ద్వారా ప్రతి చిన్న విషయం ప్రజలకు తెలుస్తుంది ముఖ్యంగా హీరో హీరోయిన్ల మీద విపరీతంగా అభిమానం పెంచేసుకుంటున్నారు అభిమానులు .ఈమధ్య జ్యోతిక సూర్య విడిపోయారని జ్యోతిక పిల్లల్ని తీసుకుని ముంబైకి మకాం మార్చేసిందని మీడియాలో వచ్చే వార్తలు చూసి అభిమానులు బాధపడుతున్నారు. కానీ అలాంటిదేమీ లేదని తనకు అక్కడ అవకాశాలు రావడం వల్ల వెళ్లాను అంతే అని జ్యోతిక క్లారిటీ ఇచ్చింది .అలాగే ఐశ్వర్య ,అభిషేక్ బచ్చన్ లు విడాకులు తీసుకుంటున్నారని అజిత్ శాలిని, విజయ్ వంటి వారందరూ విడాకులు తీసుకోబోతున్నారని మీడియాలో వస్తున్న వార్తలను చూసి అభిమానులు అందులో ఎంతో కొంత నిజం ఉండవచ్చు సమంత నాగచైతన్య విషయంలో అలాగే ఐశ్వర్య ధనుష్వంటి వారు విడిపోవడం వల్ల అలాంటి వార్తలు విన్నప్పుడు నిప్పు లేనిదే పొగ రాదు కదా అని అవి నిజమేనేమో అని అభిమానులు బాధపడుతున్నారు రోజురోజుకు విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది ఇందుకు ఎవరు బాధ్యులు అంటే ? మనమే కారణం అని చెప్పక తప్పదు
పూర్వం ఒకసారి పెళ్లి అయ్యిందంటే భర్త కుంటి వాడైనా , గుడ్డి వాడైనా , కోపిష్టి వాడైనా, భార్యలు సర్దుకు పోయేవారు.కాబోయే భర్త ఎలాంటి వాడో తెలుసుకునే,చూసే అవకాశం వారికి ఉండేదికాదు.ఆర్థిక స్వాతంత్ర్యం ఉండేది కాదు. తల్లిదండ్రుల కష్టం చూసి, తర్వాత తమ పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని. సర్దుకు పోయేవారు.
ఒక తరం స్త్రీలు పడిన కష్టాన్ని చూసిన వారు, తమ పిల్లలు బాగా చదువుకోవాలి ఆర్థిక స్వేచ్ఛ కలిగి ఉండాలని కోరుకున్నారు. అమ్మాయిలను అబ్బాయిలను కూడా సమానత్వం పాటిస్తూనే పెంచుతున్నారు. నువ్వూ ఇంటి పనులు చేయాలి, స్త్రీలను గౌరవించాలి అని మగ పిల్లలకు నేర్పుతూనే ఉన్నారు.
నేటి తరం పిల్లలకు మంచి విద్య, ఉద్యోగాలు ఉంటున్నాయి. ఆర్థికంగా ఒకరి పై ఆధార పడే పరిస్థితి లేదు. చాలా మందికి కాబోయే భాగస్వామిని చూసి ,మాట్లాడి నచ్చితేనే పెళ్లి చేసుకునే స్వాతంత్య్రం ఇస్తున్నారు. అయినా విడాకులు తీసుకునే వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది.పెళ్లికి ముందే అసలు పెళ్లి అంటే ఏంటి? ఎందుకు చేసుకుంటున్నాము,? ఎలాంటి పరిస్థితులు ఎదురు కావచ్చు వంటివి ఆలోచించి పెళ్లి చేసుకుని . చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకు పోయి కుటుంబ వ్యవస్థను తమ సంతోషాన్నీ కాపాడుకోవాల్సిన అవసరం ఉంది..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…