టాలీవుడ్ కొరియోగ్రాఫక్ జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక ఆరోపణల కేసు చినికి చినికి గాలివానగా మారుతోందన్న మాట నిజం. ఇంతకాలం టీవీ ప్రోగ్రాంలలో నవ్వుతూ, ఎంజాయ్ చేస్తూ కనిపించే జానీ మాస్టర్ ఫేస్.. ఒక కేసుతో మాయమైంది. జనం ముందుకు వచ్చేందుకు జానీ మాస్టర్ వెనుకాడుతున్నారు. జానీ మాస్టర్ రెండు జాతీయ అవార్డులు పొందిన స్టార్ కొరియోగ్రాఫర్. అతను శ్రేష్ఠి వర్మ అనే యంగ్ కొరియోగ్రాఫర్ తన పై లైంగిక వేధింపులు చేసారు అంటూ నార్సింగి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఈ ఘటన ఇండస్ట్రీ లో పెను దుమారం రేపింది. ఎందుకంటే జానీ మాస్టర్ కేవలం టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్ లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్స్ లో ఒకరు. రెండు సార్లు నేషనల్ అవార్డు దక్కించుకున్న నేటి తరం ఏకైక కొరియోగ్రాఫర్ . కెరీర్ పీక్ రేంజ్ లో వెళ్తున్న సమయంలో అతనిపై ఇలాంటి ఆరోపణలు రావడం పెను దుమారం రేపింది. ఈ సంఘటన లో నిజానిజాలు ఏంటో తెలుసుకునేందుకు మీడియా ప్రయత్నించింది. కానీ జానీ మాస్టర్ అజ్ఞాతం లో ఉన్నాడు. కనీసం సోషల్ మీడియా ద్వారా అయినా స్పందిస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయన మౌనం వహించాడు. ఈ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ మీద చేసిన ఆరోపణలు మొత్తం నిజమేనా?, తనపై ఎప్పుడు రూమర్స్ వచ్చిన వెంటనే స్పందించే జానీ మాస్టర్ ఎందుకు ఇప్పటి వరకు మౌనం వహించాడు.ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో మరో అంశం కూడా చర్చకు వచ్చింది. ఐదేళ్లుగా జానీ మాస్టర్ తనను లైగికంగా వేధిస్తున్నాడని బాధితురాలు ఆరోపించడం సంచలనమైంది. తొలినాళ్లలో ఆమె మైనర్ అని తేలింది. మైనర్ ను పనిలో పెట్టుకోవడం ద్వారా జానీ మాస్టర్ చట్టాన్ని ఉల్లంఘించాడని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు అతడ్ని మాస్టర్ అని పిలవడం కూడా కరెక్టు కాదని సింగల్ చిన్మయి లాంటి వాళ్లు ఆరోపిస్తున్నారు….
జానీ మాస్టర్ వ్యవహారంలో రాజకీయ కోణం కూడా చూడాలి. అతను జనసేనలో కీలక భూమిక పోషిస్తున్నాడు. లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కరెక్టే అయినా.. రాజకీయ ప్రత్యర్థులు జనసేనను ఇరకాటంలో పెట్టేందుకు జనీ మాస్టర్ వ్యవహారాన్ని పావుగా వాడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన నాయకులకు ఈ విషయంలో కొన్ని అనుమానాలున్నాయి. జానీ మాస్టర్ వ్యవహారం లోపల లోపల కొన్ని రోజులుగా నలుగుతోంది. ఇప్పుడు అది బయటకు రావడం వెనుక వైసీపీ వారి హస్తం ఉందని జనసేన అనుమానిస్తోంది. అగ్రెసివ్ గా ఉండే కొందరు జనసేన కార్యకర్తలైతే పవన్ పాపులారిటీ పెరగడం తట్టుకోలేక టీడీపీ వాళ్లే మహిళా డ్యాన్సర్ ను రెచ్చగొట్టారని కూడా ఆరోపిస్తున్నారు. 2029లో పవన్ కల్యాణ్ సీఎం అవుతారని, 2034లో దేశ ప్రధాని అవుతారని జానీ మాస్టర్ ప్రచారం ప్రారంభించాడు. దానితో చిర్రెత్తుకొచ్చిన వాళ్లు అతను నోరు మెదపకుండా చేసేందుకు లైంగిక వేధింపుల వ్యవహారాన్ని గట్టిగా లాగారని అంటున్నారు. అయితే అధికార పార్టీలో చిచ్చుపెట్టేందుకు వైసీపీ ఎంతకైనా దిగజారుతుందనేందుకు జానీ మాస్టర్ వ్యవహారం ఒక ఉదాహరణ అని జనసేన ప్రముఖులు అంటున్నారు. పైగా అప్పట్లో జానీ మాస్టర్ ను బ్యాట్స్ మేన్ అంటూ హైపర్ ఆది ప్రశంసించడాన్ని కూడా కొందరు నెటిజెన్లు కావాలనే వైరల్ చేస్తున్నారన్నది జనసేన కార్యకర్తల ఆరోపణ. ఏకంగా పవన్ కల్యాణ్ పైనే కుట్ర జరుగుతోందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఇందులో పవన్ బంధువర్గం హ్యాండ్ కూడా ఉండి ఉండొచ్చన్నది మరికొందరి అనుమానం. ఈ క్రమంలో బాధితురాలికి సినిమా ఛాన్స్ ఇస్తామని గీతా ఆర్ట్స్ ప్రకటించడం చర్చను మరింత తీవ్రతరం చేసింది. ఎందుకంటే గీతా ఆర్డ్స్ అనేది హీరో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కు చెందినదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు…
జానీ మాస్టర్ వ్యవహారం నలుగుతుండగానే నటి పూనమ్ కౌర్ మళ్లీ బయటకు వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తాను చేసిన ఆరోపణలను ఇప్పటికైనా విచారించాలని ఆమె కోరుతుంది. డాన్స్ మాస్టర్ల సంఘం అధ్యక్ష పదవి నుంచి జానీ మాస్టర్ ను తొలగించగా, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని ఇండస్ట్రీ పెద్దలు అంటున్నారు. నిజంగా జానీ మాస్టర్ నిందితుడైతే మైనర్ పై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఉరి వేయడంలో తప్పులేదు. కావాలనే ఆయన్ను ఇరికిస్తే మాత్రం అన్యాయమైపోతానడంలో సందేహం లేదు..
మరిన్ని వార్తలకు ఎక్కడ క్లిక్ చేయండి
మరిన్ని వీడియోలకు ఎక్కడ క్లిక్ చేయండి…