రెండేళ్ల తర్వాత రోహిత్‌ టెస్టు(9) సెంచరీ.

By KTV Telugu On 10 February, 2023
image

రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. తోటి ప్లేయర్లు వచ్చిన వారు వచ్చినట్టే పెవిలియన్ బాట పడుతున్నా, సమన్వయంతో ఆడి శతకం బాదాడు. దాదాపు రెండేళ్ల తర్వాత రోహిత్‌ చేసిన టెస్టు సెంచరీ కావడంతో అభిమానుల్లో ఆనందం నెలకొంది. ఇంతకుముందు 2021లో ఇంగ్లాండ్‌పై శతకం బాదాడు. బౌలింగ్‌కు అనుకూలంగా మారిన నాగ్‌పుర్‌ పిచ్‌పై ఆసీస్‌ బ్యాటర్లు చేతులెత్తేయగా రోహిత్ శర్మ మాత్రం సహనంతో ఆడి సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా టెస్టుల్లో 9సెంచరీలు సాధించాడు హిట్ మ్యాన్. టెస్ట్‌ కెప్టెన్‌గా రోహిత్‌కు ఇది తొలి సెంచరీ .

ఆసీస్‌పై సెంచరీ సాధించిన రోహిత్‌ శర్మ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో సెంచరీ సాధించిన తొలి భారత కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయంగా పాక్‌ కెప్టెన్ బాబర్ అజామ్‌, ఫాఫ్‌ డుప్లెసిస్‌, తిలకరత్నె దిల్షాన్‌ మాత్రమే ఈ ఫీట్‌ను సాధించారు. ఇప్పుడు వారి సరసన రోహిత్ చేరాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ 43 శతకాలను పూర్తి చేశాడు. ఇందులో టెస్టుల్లో 9, వన్డేల్లో 30, టీ20ల్లో నాలుగు సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌ సెంచరీల రికార్డును అధిగమించాడు. అంతేకాదు ఆస్ట్రేలియాపై అత్యధిక సెంచరీలు బాదిన ఓపెనర్‌గా రోహిత్ శర్మ సచిన్ సరసన నిలిచాడు.

ఇక, ఈ టెస్టులో అరంగేట్రం చేసిన ఆటగాళ్లు ఇద్దరూ ఆశించిన మేర రాణించలేకపోయారు. సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్‌లు ఇద్దరూ సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమతమయ్యారు. సీనియర్లు కేఎల్ రాహుల్, విరాట్‌ సహా పుజారా కూడా స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. బౌలింగ్‌లో 5 వికెట్లు సాధించిన జడేజా బ్యాటింగ్‌లోనూ దుమ్ముదులిపాడు. జడేజాకు అండగా మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కూడా అద్భుత ప్రదర్శన కనబర్చాడు.